search
×

Construction Flats: నిర్మాణంలో ఉన్న ఫ్లాట్‌ కొంటున్నారా, అది పూర్తయితేనే టాక్స్‌ బెనిఫిట్స్‌ వర్తిస్తాయని తెలుసా?

ఐటీ రిటర్న్స్‌ ఫైల్‌ సమయంలో సెక్షన్‌ 80C కింద టాక్స్‌ డిడక్షన్‌ పొందలేరు.

FOLLOW US: 
Share:

Tax Benefits On Under Construction Flats: సొంత ఇల్లు అనేది ప్రతి ఒక కుటుంబం కల. ఎవరి స్థోమతకు తగ్గట్లు వాళ్లు సొంతింటి కోసం ఆలోచిస్తుంటారు. రెడీ టు మూవ్‌ (నిర్మాణం పూర్తయిన) హౌస్‌ లేదా అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌ కొనడానికి కొందరు మొగ్గు చూపితే, నిర్మాణంలో ఉన్నప్పుడే కొనడానికి మరికొందరు ఇష్టపడతారు. కట్టించే తలనొప్పులు వద్దు అనుకున్నవాళ్లు నిర్మాణం పూర్తయిన ఇంటిని కొంటారు. తమ అభిరుచికి తగ్గట్లుగా మార్పులు చేయించుకునే వాళ్లు నిర్మాణంలో ఉన్నవాటిని కొంటారు. ఎవరి టేస్ట్‌ వాళ్లది.

ఉద్యోగస్తుల్లో చాలా మంది, హౌస్‌ లోన్‌ తీసుకుని ఆదాయ పన్ను భారం నుంచి సేఫ్‌ డిస్టాన్స్‌ మెయిన్‌టెయిన్‌ చేస్తుంటారు. ఎవరైనా సరే... బ్యాంక్‌ నుంచి రుణం తీసుకుని, నిర్మాణం పూర్తయిన ఇంటిని కొనుగోలు చేస్తే, బ్యాంక్‌కు తిరిగి కట్టే అసలు మీద, వడ్డీ మీద విడివిడిగా ఆదాయ పన్ను మినహాయింపులు పొందొచ్చు. బ్యాంక్‌ రుణంలో తిరిగి చెల్లించే ప్రిన్స్‌పుల్‌ అమౌంట్‌ మీద సెక్షన్‌ 80C కింద రూ. 1.50 లక్షలు.. చెల్లించే వడ్డీ మీద సెక్షన్‌ 24B కింద రూ. 2 లక్షల వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో క్లెయిమ్‌ చేసుకోవచ్చు.

నిర్మాణంలో ఉన్న ఇంటిని కొంటే ఏంటి పరిస్థితి?
ఒకవేళ మీరు బ్యాంక్‌ లోన్‌ తీసుకుని నిర్మాణంలో ఉన్న ఫ్లాట్‌ లేదా ఇంటిని కొంటే, వెంటనే టాక్స్‌ డిడక్షన్‌ వర్తించదు. ఆ రుణం మీద బ్యాంక్‌కు EMIల చెల్లింపు వెంటనే ప్రారంభమైనా, వడ్డీ అమౌంట్‌ మాత్రమే ఆ EMIలో ఉంటుంది. ప్రిన్స్‌పుల్‌ అమౌంట్‌ ఒక్క రూపాయి కూడా ఆ EMIలో ఉండదు. అంటే, మీరు ఐటీ రిటర్న్స్‌ ఫైల్‌ సమయంలో సెక్షన్‌ 80C కింద టాక్స్‌ డిడక్షన్‌ పొందలేరు. 

అసలు కట్‌ కాకపోయినా EMI ద్వారా వడ్డీ కడుతూ వెళ్లినా, దానిని కూడా వెంటనే క్లెయిం చేసుకోలేరు. సెక్షన్‌ 24B కింద ఈ వడ్డీ మినహాయింపును మీరు పొందాలంటే, ఇంటి నిర్మాణం పూర్తవ్వాల్సిందే. 

ఇల్లు లేదా ఫ్లాట్‌ నిర్మాణం పూర్తయి, సదరు ఆస్తిని మీరు స్వాధీనం చేసుకున్నట్లు ‘పొజెషన్‌ సర్టిఫికేట్‌’ పొందిన తర్వాత మాత్రమే బ్యాంక్‌ లోన్‌లో ప్రిన్సిపుల్‌ అమౌంట్‌ EMI ద్వారా కట్‌ కావడం ప్రారంభం అవుతుంది. ఇప్పుడు మీరు సెక్షన్‌ 24B కింద వడ్డీని క్లెయిం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.

చెల్లించిన వడ్డీ సంగతేంటి?
ఇల్లు లేదా ఫ్లాట్‌ నిర్మాణం ఎంతకాలం సాగితే అంతకాలం EMI రూపంలో మీరు వడ్డీని చెల్లిస్తూ వెళ్లాలి. ఇలా కట్టిన వడ్డీని ఆ ఇంటి నిర్మాణం కంప్లీట్‌ అయిన తర్వాత, 5 సమ భాగాలుగా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంకా వివరంగా చెప్పాలంటే.. మీ ఇంటికి ‘పొజెషన్‌ సర్టిఫికేట్‌’ పొందిన ఏడాది నుంచి 5 సంవత్సరాల వరకు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. నిర్మాణంలో ఉన్నప్పుడు చెల్లించిన వడ్డీని, నిర్మాణం పూర్తయిన తర్వాత చెల్లిస్తున్న వడ్డీని కలిపి మినహాయింపు పొందవచ్చు. అయితే, ఇక్కడో చిన్న మెలిక ఉంది. సెక్షన్‌ 24B కింద ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు క్లెయిమ్‌ చేసుకోదగిన వడ్డీ మొత్తం రూ. 2 లక్షలకు మించకూడదు.

దీనిని ఒక ఉదాహరణ రూపంలో ఇంకా సింపుల్‌గా అర్ధం చేసుకుందాం. ఒక వ్యక్తి నిర్మాణంలో ఉన్న ఫ్లాట్‌ కొని, ఐదేళ్ల తర్వాత దానిని స్వాధీనం చేసుకున్నాడనుకుందాం. ఈ ఐదేళ్ల పాటు EMI రూపంలో రూ.6 లక్షల వడ్డీ చెల్లించాడని అనుకుందాం. ఇల్లు నిర్మాణంలో ఉంది కాబట్టి, ఐటీ రిటర్న్స్‌లో ఈ ఐదేళ్లలో ఆ వడ్డీని మినహాయింపుగా చూపలేదు. ఇంటిని స్వాధీనం చేసుకున్న ఆర్థిక సంవత్సరం నుంచి, ఆ వడ్డీని ఐదు సమాన భాగాలుగా చేసి, ఐదు ఆర్థిక సంవత్సారాల్లో క్లెయిం చేసుకోవచ్చు. అంటే, ఏడాదికి రూ.1.20 లక్షలు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఒకవేళ అతను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.85 వేల వడ్డీని చెల్లించాల్సి వస్తే... ఆ సంవత్సరంలో కట్టిన వడ్డీ మొత్తం రూ. 2.05 లక్షలు (రూ.85 వేలు + రూ.1.20 లక్షలు) అవుతుంది. సెక్షన్‌ 24B కింద రూ.2 లక్షలు మాత్రమే గరిష్ట పరిమితిగా ఉంది కాబట్టి ఆ మేరకు అతను క్లెయిమ్‌ చేసుకోవచ్చు, మిగిలిన 5 వేలకు మినహాయింపు వర్తించదు. 

కొత్త పన్ను చెల్లింపు విధానంలో ఇలాంటి డిడక్షన్స్‌ లేవు. పాత పన్ను చెల్లింపు విధానంలో మాత్రమే మినహాయింపులు ఉన్నాయి.

మరో ఆసక్తికర కథనం: మహీంద్రా థార్‌లో ఎలక్ట్రిక్ వెర్షన్ - ఆగస్టు 15న లాంచ్!

Published at : 06 Aug 2023 11:19 AM (IST) Tags: Income Tax ITR Under Construction House loan Home Tax

ఇవి కూడా చూడండి

New Year Financial Planning: ఇలాంటి ఫైనాన్షియల్‌ ప్లాన్‌తో కొత్త సంవత్సరం ప్రారంభించండి - ఏడాదంతా మీకు తిరుగుండదు!

New Year Financial Planning: ఇలాంటి ఫైనాన్షియల్‌ ప్లాన్‌తో కొత్త సంవత్సరం ప్రారంభించండి - ఏడాదంతా మీకు తిరుగుండదు!

Bank Timings Changed: బ్యాంక్‌ కస్టమర్లకు అలెర్ట్‌ - అన్ని బ్యాంకుల పని వేళల్లో మార్పులు

Bank Timings Changed: బ్యాంక్‌ కస్టమర్లకు అలెర్ట్‌ - అన్ని బ్యాంకుల పని వేళల్లో మార్పులు

Bank Cheque: బ్యాంక్ చెక్కుల్లో 9 రకాలు - ఏది, ఎక్కడ ఉపయోగిస్తారో మీకు తెలుసా?

Bank Cheque: బ్యాంక్ చెక్కుల్లో  9 రకాలు - ఏది, ఎక్కడ ఉపయోగిస్తారో మీకు తెలుసా?

Gold-Silver Prices Today 18 Dec: ఈ రోజు చవకగా బంగారం కొనే అవకాశం - మీ ప్రాంతంలో బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

Gold-Silver Prices Today 18 Dec: ఈ రోజు చవకగా బంగారం కొనే అవకాశం - మీ ప్రాంతంలో బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

Investment Secret: డబ్బులు సంపాదించే ట్రిక్‌ - ఈ బడా ఇన్వెస్టర్ల సీక్రెట్‌ ఎవరూ మీకు చెప్పి ఉండరు!

Investment Secret: డబ్బులు సంపాదించే ట్రిక్‌ - ఈ బడా ఇన్వెస్టర్ల సీక్రెట్‌ ఎవరూ మీకు చెప్పి ఉండరు!

టాప్ స్టోరీస్

KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్

KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్

DHOP Song Promo: ఊపు తెప్పించే ‘దోప్’ సాంగ్ వచ్చేసింది - రామ్ చరణ్, కియారా కిర్రాక్ స్టెప్స్!

DHOP Song Promo: ఊపు తెప్పించే ‘దోప్’ సాంగ్ వచ్చేసింది - రామ్ చరణ్, కియారా కిర్రాక్ స్టెప్స్!

Ashwin Retirement: "స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్

Ashwin Retirement:

Prasad Behara Arrest: నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్

Prasad Behara Arrest: నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్