Mahindra Thar E: మహీంద్రా థార్‌లో ఎలక్ట్రిక్ వెర్షన్ - ఆగస్టు 15న లాంచ్!
మహీంద్రా థార్ ఎలక్ట్రిక్ త్వరలో లాంచ్ కానుంది.
Upcoming Mahindra Thar: మహీంద్రా & మహీంద్రా అకస్మాత్తుగా తన థార్ ఎలక్ట్రిక్‌ను రివీల్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సమాచారాన్ని తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్‌లో తెలియజేసింది. కంపెనీ తన థార్ ఎస్‌యూవీ ఎలక్ట్రిక్ వెర్షన్ (THAR.e)ని ఆగస్టు 15వ తేదీన విడుదల చేయబోతున్నట్లు వెల్లడించింది. అయితే ఈ కారు ప్రస్తుతానికి మనదేశంలో లాంచ్ కావడం లేదు. ఇది దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్‌లో ఎంట్రీ ఇవ్వనుంది.
టీజర్‌లో దాని లుక్ ఫ్యూచరిస్టిక్‌గా ఉంది. ఇది కాన్సెప్ట్ కారు కూడా అయ్యే అవకాశం ఉంది. అందువల్ల దీన్ని మార్కెట్లో లాంచ్ చేయడానికి చాలా సమయం పట్టవచ్చు. అయితే మహీంద్రా తన ఆఫ్ రోడ్ సెగ్మెంట్‌ను పూర్తిగా పునరుద్ధరిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా ఉంటుంది. మహీంద్రా థార్ రెట్రో లుక్ దాని ప్రజాదరణకు అతిపెద్ద కారణం. ఇది కాకుండా థార్ ఎలక్ట్రిక్ ఎంతవరకు విజయం సాధిస్తుందనేది కూడా ఆసక్తికరంగా మారింది.
మహీంద్రా ప్రస్తుతం ఎక్స్‌యూవీ400 పూర్తి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కలిగి ఉంది. ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉంది. కంపెనీ BE.05, BE.07 వంటి కొత్త వాహనాలపై పని చేస్తున్నప్పటికీ థార్ ఎలక్ట్రిక్ పూర్తిగా ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫారమ్‌పై రూపొందనుంది. ఇందులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు (ఫోర్ వీల్ డ్రైవ్) చూడవచ్చు.
మహీంద్రా థార్ ప్రస్తుతం 2.2 లీటర్ ఎంహాక్ డీజిల్ ఇంజిన్‌తో ఎంట్రీ ఇచ్చింది. ఇది గరిష్టంగా 128 హెచ్‌పీ శక్తిని ఇస్తుంది. రెండో ఇంజిన్‌గా ఉన్న 2.0 లీటర్ ఎంస్టాలియన్ టర్బో పెట్రోల్ మోటార్ 150 హెచ్‌పీ పవర్‌ను ఇస్తుంది. ఇది కాకుండా మరో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ కూడా ఉంది. ఇది 117 హెచ్‌పీ పవర్‌ని ఇస్తుంది. ఇది ఆర్‌డబ్ల్యూడీ సెటప్‌తో వస్తుంది. మహీంద్రా థార్‌కు పోటీగా ప్రస్తుతం మార్కెట్లో మారుతి సుజుకి జిమ్నీ, ఫోర్స్ గూర్ఖా వంటి ఆఫ్-రోడ్ వాహనాలు ఉన్నాయి.
A legend reborn, with an electric vision. Welcome to the future.
— Mahindra Born Electric (@born_electric) August 5, 2023
📌Cape Town, South Africa
🗓15th August, 2023#Futurescape #GoGlobal pic.twitter.com/2db15EOfJ2
A legend reborn, with an electric vision. Welcome to the future.
— Mahindra Automotive (@Mahindra_Auto) August 5, 2023
📌Cape Town, South Africa
🗓️15th August, 2023#Futurescape #GoGlobal pic.twitter.com/2ixVvmbOL9
Get ready to explore the future of farming. 7 Models. One vision of transformation.#Futurescape #GoGlobal
— Mahindra Tractors (@TractorMahindra) August 5, 2023
📌Cape Town, South Africa
🗓️15th August, 2023@rajesh664 @hsikka1 @BosePratap @_MaheshKulkarni @MahindraRise @Mahindra_Auto pic.twitter.com/OYwAG2OgFo
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial