![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Stocks To Watch 06 October 2023: ఇవాళ మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' Adani Wilmar, IndiGo, PB Fintech
మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
![Stocks To Watch 06 October 2023: ఇవాళ మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' Adani Wilmar, IndiGo, PB Fintech Stocks to watch today 06 October 2023 todays stock market todays share market Stocks To Watch 06 October 2023: ఇవాళ మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' Adani Wilmar, IndiGo, PB Fintech](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/06/f5567808c3b0691f70cceded3038f0671696559985370545_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Stock Market Today, 06 October 2023: యుఎస్ బాండ్ ఈల్డ్స్ మెత్తబడడం, ముడి చమురు ధరలు ఇటీవలి గరిష్టాల నుంచి తగ్గడంతో ప్రపంచ సూచీలలో స్థిరత్వం కనిపించింది. వరుస పతనం తర్వాత ఇండియన్ మార్కెట్లు రికవరీని చూశాయి. ఈ రోజు ప్రకటించబోయే ఆర్‌బీఐ పాలసీ ఫలితాలను మార్కెట్ నిశితంగా గమనిస్తుంది.
US స్టాక్స్ డౌన్
ఈ రోజు విడుదలయ్యే నెలవారీ ఉద్యోగాల నివేదిక, వడ్డీ రేట్ల ఔట్‌లుక్‌పై స్పష్టమైన సంకేతాల కోసం పెట్టుబడిదార్లు ఎదురుచూస్తుండండతో US స్టాక్స్ గురువారం కనిష్ట స్థాయుల నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యాయి, ఆ తర్వాత కొద్ది పడిపోయాయి.
పెరిగిన ఆసియా షేర్లు
వాల్ స్ట్రీట్ స్టాక్స్ ర్యాలీ చేయడంతో ఆసియాలో షేర్లు పెరిగాయి, వరుస నష్టాల తర్వాత మార్కెట్లకు కొంత ఉపశమనం లభించింది. ట్రేడర్ల దృష్టి ఈ రోజు విడుదలయ్యే US జాబ్ డేటాపై ఉంటుంది.
ఇవాళ ఉదయం 8.05 గంటల సమయానికి గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 5.5 పాయింట్లు లేదా 0.03 శాతం గ్రీన్ కలర్‌లో 19,610 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
బజాజ్ ఫైనాన్స్: క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ & కన్వర్టబుల్ వారెంట్ల ద్వారా రూ. 10,000 కోట్ల వరకు సమీకరించడానికి బజాజ్ ఫైనాన్స్ బోర్డు ఆమోదం తెలిపింది.
అదానీ విల్మార్: ప్యాక్ చేసిన ఆహారాల్లో భారీ అవకాశాలను అందుకుని అమలు చేయడంతో, 2023 సెప్టెంబర్ త్రైమాసికంలో అదానీ విల్మార్ 11% (YoY) రెండంకెల వాల్యూమ్ వృద్ధిని రిపోర్ట్ చేసింది.
వాలియంట్ ల్యాబ్స్: వాలియంట్ ల్యాబ్స్ షేర్లు ఈ రోజు స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ అవుతాయి. ఈ స్టాక్ 15-16% ప్రీమియంతో లిస్ట్ అవుతుందని అంచనా.
టాటా మోటార్స్: FY24 రెండో త్రైమాసికంలో దాదాపు 300 మిలియన్ పౌండ్ల పాజిటివ్ ఫ్రీ క్యాష్ ఫ్లోను ఆశిస్తున్నట్లు టాటా మోటార్స్ ఆర్మ్ JLR తెలిపింది. Q2లో, సరఫరాల్లో మెరుగుదల కారణంగా అమ్మకాల్లో పెరుగుదలను ఈ కంపెనీ నివేదించింది. ఖాతాదార్లకు మరిన్ని వాహనాలను అందించడానికి ఇప్పుడు JLRకు అవకాశం దక్కింది.
స్టేట్ బ్యాంక్: కేంద్ర ప్రభుత్వం SBI చైర్మన్ దినేష్ ఖరా పదవీకాలాన్ని ఆగస్టు 2024 వరకు పొడిగించింది.
గోద్రెజ్ కన్జ్యూమర్: Q2 FY24లో బలహీనమైన, ప్రతికూల వాతావరణ పరిస్థితులను చూశామని గోద్రెజ్ కన్స్యూమర్ ప్రకటించింది. అయినప్పటికీ, వ్యాపారంలో మిడిల్-సింగిల్-డిజిట్ వాల్యూమ్ వృద్ధితో స్థిరమైన పనితీరును కనబరిచింది.
లుపిన్: టోల్వాప్టాన్ టాబ్లెట్‌ల కోసం లూపిన్ పెట్టుకున్న న్యూ డ్రగ్ అప్లికేషన్‌కు US FDA నుంచి తాత్కాలిక ఆమోదం లభించింది.
ఇండిగో: పెరుగుతున్న ATF ధరల భారాన్ని తగ్గించుకోవడానికి ఇంధన ఛార్జీలను ఇండిగో ప్రవేశపెట్టింది. దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో ఇంధన ఛార్జీలు ఈ రోజు నుంచి అమలులోకి వస్తాయి.
PB ఫిన్‌టెక్: సాఫ్ట్‌బ్యాంక్ ఈ రోజు బ్లాక్ డీల్స్ ద్వారా PB ఫిన్‌టెక్‌లో కొంత వాటాను విక్రయించే అవకాశం ఉంది.
సన్ ఫార్మా: EzeRxలో 37.76% ఈక్విటీ షేర్‌హోల్డింగ్‌ను కొనుగోలు చేయడానికి సన్ ఫార్మా ఒప్పందం చేసుకుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: రిటైర్మెంట్ నాటికి ₹57 లక్షలు కళ్లజూడాలంటే నెలకు ₹1500 దాస్తే చాలు!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)