News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Stocks To Watch 05 September 2023: ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' SpiceJet, YES Bank, Tata Steel

మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

FOLLOW US: 
Share:

Stock Market Today, 05 September 2023: యూఎస్‌ స్టాక్‌ మార్కెట్‌కు సోమవారం సెలవు, ట్రేడింగ్‌ జరగలేదు. దీంతో, ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలపై గ్లోబల్‌ ఇన్వెస్టర్లు దృష్టి పెట్టడంతో ఆసియా షేర్లు లోయర్‌ సైడ్‌లో ట్రేడ్ అయ్యాయి. జపాన్‌కు చెందిన నికాయ్‌ 225 42.80 పాయింట్లు క్షీణించగా, దక్షిణ కొరియా కోస్పి ఇండెక్స్ కూడా దిగువకు పడిపోయింది. ఆస్ట్రేలియా ASX 200 0.54% తగ్గింది. 

గత సెషన్‌లో, మెటల్ & ఐటీ స్టాక్స్‌లో బలమైన కొనుగోళ్లతో సెన్సెక్స్ & నిఫ్టీ 50 గ్రీన్‌లో సెటిల్‌ అయ్యాయి. ఇవాళ (మంగళవారం) ఓపెనింగ్‌ అవర్స్‌లో, హాంకాంగ్ ఇండెక్స్ భారీ అమ్మకాలను నమోదు చేయడంతో ఆసియా మార్కెట్లు కిందకు జారిపోయాయి. 

గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY), ఉదయం 8.05 గంటల సమయానికి 08 పాయింట్లు లేదా 0.04 శాతం రెడ్‌ కలర్‌లో 19,591 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 

స్పైస్‌జెట్‌: లో-కాస్ట్‌ క్యారియర్ స్పైస్‌జెట్, రూ. 231 కోట్ల విలువైన బకాయిలను క్లియర్ చేయడానికి, తొమ్మిది విమానాల కంపెనీలకు 48.1 మిలియన్ షేర్లను కేటాయించింది.

సిప్లా: ఈ ఫార్మా కంపెనీ పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ అయిన 'సిప్లా సౌత్‌ ఆఫ్రికా', యాక్టర్ ఫార్మా లిమిటెడ్‌ను కొనుగోలు చేయడానికి యాక్టర్ హోల్డింగ్స్‌తో బైండింగ్ టర్మ్ షీట్‌ మీద సంతకం చేసింది.

ఎస్కార్ట్స్ కుబోటా: ఈ నెల 16 నుంచి ట్రాక్టర్ల ధరలను పెంచనున్నట్లు ఎస్కార్ట్స్ కుబోటా తెలిపింది.

యెస్ బ్యాంక్: JC ఫ్లవర్ ARCకి లోన్‌ పోర్ట్‌ఫోలియోను విక్రయించిన తర్వాత, JC ఫ్లవర్ ARC చేపడుతున్న సెటిల్‌మెంట్‌లు/చర్చల్లో బ్యాంక్‌కు ఎలాంటి పాత్ర, సంబంధం లేదని యెస్‌ బ్యాంక్ స్పష్టం చేసింది.

టాటా పవర్: గ్రే & SG ఐరన్ కాస్టింగ్‌లో అగ్రగామి కంపెనీ నియోసిమ్ ఇండస్ట్రీతో టాటా రెన్యువబుల్‌ ఎనర్జీ ఒప్పందం కుదుర్చుకుంది. 26 మెగావాట్ల AC గ్రూప్ క్యాప్టివ్ సోలార్ ప్లాంట్‌ ఏర్పాటు కోసం PDAపై సంతకం చేసింది.

రామ్‌కో సిమెంట్స్: ప్లాన్‌లో ఉన్న 12 మెగావాట్ల సామర్థ్యంలో భాగంగా, తొలుత 3 మెగావాట్ల వేస్ట్ హీట్ రికవరీ సిస్టమ్ బ్యాలెన్స్ కెపాసిటీని ప్రారంభించినట్లు రామ్‌కో సిమెంట్స్ తెలిపింది. దీంతో, కంపెనీ వేస్ట్ హీట్ రికవరీ సిస్టమ్ మొత్తం కెపాసిటీ 43 మెగావాట్లకు పెరిగింది.

టాటా స్టీల్: యూకేలో ఉన్న ప్లాంట్ కోసం నిధులు సమీకరించేందుకు కంపెనీ ప్రయత్నిస్తున్నట్లు రిపోర్ట్స్‌ వచ్చిన నేపథ్యంలో, టాటా స్టీల్‌ ఆ వార్తలను కన్‌ఫర్మ్‌ చేసింది. "UK ప్రభుత్వం, ఇతర వాటాదార్లతో చర్చలు కొనసాగుతున్నాయి" అని ప్రకటించింది.

ఆయిల్ ఇండియా: జాయింట్ వెంచర్ అసోం గ్యాస్ కంపెనీలో, తన షేర్ హోల్డింగ్‌కు అనుగుణంగా రూ.1738 కోట్ల వరకు ఈక్విటీ కాంట్రిబ్యూషన్‌కు ఆయిల్ ఇండియా బోర్డ్ ఆమోదం తెలిపింది.

మిసెస్ బెక్టర్స్ ఫుడ్ స్పెషాలిటీస్: ఈ కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా అర్నవ్ జైన్ నియామకాన్ని కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదించింది.

బాంబే డైయింగ్: యాక్సిస్ బ్యాంక్‌తో తనకున్న వివాదాలను బాంబే డైయింగ్ పరిష్కరించుకుంది, లెండర్‌కు అనుకూలంగా కన్వేయన్స్ డీడ్‌ను కూడా అమలు చేసింది.

ఇది కూడా చదవండి: నెలకు ₹1500 కూడబెట్టి ₹57 లక్షలుగా మార్చొచ్చు, ఈ పద్ధతి పాటిస్తే చాలు

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 05 Sep 2023 08:20 AM (IST) Tags: SPICEJET Stock Market Update Tata Steel Stocks to Buy YES Bank Stocks in news

ఇవి కూడా చూడండి

Stock Market Today: సూచీల ఊగిసలాట! లాభాల్లోంచి మళ్లీ నష్టాల్లోకి జారుకున్న నిఫ్టీ, సెన్సెక్స్‌

Stock Market Today: సూచీల ఊగిసలాట! లాభాల్లోంచి మళ్లీ నష్టాల్లోకి జారుకున్న నిఫ్టీ, సెన్సెక్స్‌

Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్లు విలవిల - రూ.22 లక్షల వద్దే బిట్‌కాయిన్‌

Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్లు విలవిల - రూ.22 లక్షల వద్దే బిట్‌కాయిన్‌

Artificial Intelligence: కృత్రిమ మేథకు మోదీ బూస్ట్‌! జీపీయూ క్లస్టర్‌ ఏర్పాటు చేస్తున్న కేంద్రం

Artificial Intelligence: కృత్రిమ మేథకు మోదీ బూస్ట్‌! జీపీయూ క్లస్టర్‌ ఏర్పాటు చేస్తున్న కేంద్రం

Stock Market Today: వరుస నష్టాలకు తెర! రీబౌండ్‌ అయిన నిఫ్టీ, సెన్సెక్స్‌

Stock Market Today: వరుస నష్టాలకు తెర! రీబౌండ్‌ అయిన నిఫ్టీ, సెన్సెక్స్‌

Hyundai Alcazar Facelift: హ్యుందాయ్ అల్కజార్‌ను అప్‌డేట్ చేయనున్న కంపెనీ - ధర ఎంత ఉండవచ్చు? ఏం మారుతుంది?

Hyundai Alcazar Facelift: హ్యుందాయ్ అల్కజార్‌ను అప్‌డేట్ చేయనున్న కంపెనీ - ధర ఎంత ఉండవచ్చు? ఏం మారుతుంది?

టాప్ స్టోరీస్

Chandrayaan-3: 'చంద్రయాన్-3' రీయాక్టివేషన్ ప్రక్రియ వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?

Chandrayaan-3: 'చంద్రయాన్-3' రీయాక్టివేషన్ ప్రక్రియ వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?

చంద్రబాబుకు హైకోర్టులో షాక్- క్వాష్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం

చంద్రబాబుకు హైకోర్టులో షాక్- క్వాష్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం

BC Survey In Telangana: తెలంగాణలో త్వరలో బీసీ సర్వే- స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం కసరత్తు

BC Survey In Telangana: తెలంగాణలో త్వరలో బీసీ సర్వే- స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం కసరత్తు

NDA కూటమిలో చేరిన జేడీఎస్, అమిత్‌షాతో భేటీ తరవాత అధికారిక ప్రకటన

NDA కూటమిలో చేరిన జేడీఎస్, అమిత్‌షాతో భేటీ తరవాత అధికారిక ప్రకటన