By: ABP Desam | Updated at : 04 Sep 2023 04:10 PM (IST)
నెలకు ₹1500 కూడబెట్టి ₹57 లక్షలుగా మార్చొచ్చు
Pension Plan: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఆదాయం మార్గం (ఉద్యోగం, వ్యాపారం) ఉన్నప్పుడే రిటైర్మెంట్ జీవితం గురించి ప్లాన్ చేయాలి. లేకపోతే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పెన్షన్ స్కీమ్స్‌లో దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టడం ఒక మంచి ప్లాన్. దీనివల్ల, ఉద్యోగం లేదా వ్యాపారం నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా డబ్బులు వస్తూనే ఉంటాయి. బెస్ట్ పెన్షన్ ప్లాన్స్‌లో ఒకటి... నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS).
మీ ఇంటి బడ్జెట్ మీద భారం పడకుండా, చిన్న అమౌంట్‌తో NPSలో పెట్టుబడిని ప్రారంభించవచ్చు. రిటైర్మెంట్ తర్వాత, మీ పెట్టుబడి మొత్తాన్ని ఒకేసారి మొత్తం పొందే ఆప్షన్‌తో పాటు, ప్రతి నెలా పెన్షన్ బెనిఫిట్ కూడా లభిస్తుంది. NPS వెబ్‌సైట్ ద్వారా మీ ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయవచ్చు. రాబడి, ఇతర ప్రయోజనాల గురించి ఆ సైట్‌లో మరిన్ని వివరాలు ఉంటాయి. NPS కాలిక్యులేటర్ కూడా సైట్‌లో ఉంటుంది. ఎంత చొప్పున ఇన్వెస్ట్ చేస్తే, ఎంత కాలానికి ఎంత మొత్తం చేతికి వస్తుందన్న విషయాలను ఆ కాలిక్యులేటర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ స్కీమ్ కింద, తక్కువ డబ్బును ఇన్వెస్ట్ చేసి ఎక్కువ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. రోజుకు కేవలం రూ. 100 ఆదా చేసి నెలకు రూ. 57,000 పెన్షన్ కూడా తీసుకోవచ్చు.
నెలకు ₹1500 కూడబెడితే ₹57 లక్షలు
మీరు, మీ 25 సంవత్సరాల వయస్సులో, NPSలో నెలకు రూ. 1500 (రోజుకు కేవలం 50 రూపాయలు) పెట్టుబడిని స్టార్ట్ చేస్తే, 60 ఏళ్ల వయస్సులో మొత్తం కార్పస్ రూ. 57,42,416 అవుతుంది. వార్షిక వడ్డీ 10 శాతం అనుకుంటే, ఈ సంపద క్రియేట్ అవుతుంది. మీరు 75 సంవత్సరాల వయస్సు వరకు కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం నుంచి నిష్క్రమించే సమయంలో, పెట్టుబడిదారు 100 శాతం వరకు కార్పస్‌ను వెనక్కు తీసుకోవడంతో పాటు, యాన్యుటీ ప్లాన్‌ను కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది.
మీ అకౌంట్‌లో పోగయిన మొత్తం డబ్బుతో 100% యాన్యుటీ ప్లాన్ కొంటే, నెలకు రూ.28,712 పెన్షన్ తీసుకోవచ్చు. 40% యాన్యుటీ కొనుగోలు చేస్తే, నెలవారీ పెన్షన్ రూ.11,485 అవుతుంది. ఇంకా మీ అకౌంట్‌లో రూ.34 లక్షలు ఉంటాయి, వాటిని విత్‌డ్రా చేసుకోవచ్చు.
మరో ఆసక్తికర కథనం: షూరిటీ లేకుండా లోన్, పైగా వడ్డీ తక్కువ - ఎల్‌ఐసీ పాలసీ ఉంటే చాలు
రోజుకు ₹100తో నెలకు ₹57,000 పెన్షన్
మీరు 25 సంవత్సరాల వయస్సు నుంచి ప్రతి నెలా 3 వేల రూపాయలు (రోజుకు కేవలం 100 రూపాయలు) పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, NPS కాలిక్యులేటర్ ప్రకారం, 60 తర్వాత రూ. 1,14,84,831 జమ అవుతుంది. ఈ మొత్తంతో 100% యాన్యుటీ కొనుగోలు చేస్తే, మొత్తం నెలవారీ పెన్షన్ రూ. 57,412 వస్తుంది. 40% యాన్యుటీని కొనుగోలు చేస్తే నెలకు రూ. 22,970 పెన్షన్ రూపంలో వస్తుంది. దీంతోపాటు పదవీ విరమణ తర్వాత ఏకమొత్తంగా రూ.68 లక్షలు విత్‌డ్రా చేసుకోవచ్చు.
మరో ఆసక్తికర కథనం: వీటిలో పెట్టుబడి పెడితే డబ్బుల వర్షమేనట!, యాక్సిస్ సెక్యూరిటీస్ సెలెక్ట్ చేసింది
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Digital Real Estate: 'డిజిటల్ రియల్ ఎస్టేట్' గురించి తెలుసా?, కొంతమంది రూ.కోట్లు సంపాదిస్తున్నారు!
SBI Loan: లోన్ తీసుకున్నవాళ్లకు షాక్ ఇచ్చిన ఎస్‌బీఐ - ఈ రోజు నుంచి EMIలు పెంపు
Gold-Silver Prices Today 15 Nov: పతనం నుంచి పుంజుకున్న పసిడి - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Childrens Day Gifts: ఈ చిల్డ్రన్స్ డే నాడు మీ పిల్లలకు ఆర్థిక భద్రతను గిఫ్ట్‌గా ఇవ్వండి - ఇవిగో బోలెడన్ని ఆప్షన్స్!
ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూల్స్‌లో భారీ మార్పులు - ఇక దబిడిదిబిడే!
Anurag Kulkarni - Ramya Behara Wedding: సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సింగర్స్... నెట్టింట ఫోటోలు వైరల్!
Mike Tyson vs Jake Paul Boxing Result: మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
Telangana: ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
Chandrababu: చంద్రబాబు అన్ని కార్యక్రమాలు రద్దు, ఢిల్లీ నుంచి హుటాహుటీన హైదరాబాద్‌కు పయనం