(Source: ECI/ABP News/ABP Majha)
Stocks To Watch 05 July 2023: ఇవాళ మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' LTIMindtree, Mankind Pharma
మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
Stock Market Today, 05 July 2023: ఇవాళ (బుధవారం) ఉదయం 8.00 గంటల సమయానికి, గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 22 పాయింట్లు లేదా 0.11 శాతం గ్రీన్ కలర్‌లో 19,515 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
LTI మైండ్‌ట్రీ: దేశంలో ఆరో అతి పెద్ద IT కంపెనీ LTIMindtreeకి నిఫ్టీలోకి ఎంట్రీ టిక్కెట్ దొరికింది. HDFC బ్యాంక్‌లో HDFC విలీనం తర్వాత, నిఫ్టీలో HDFC స్థానాన్ని LTIMindtree రీప్లేస్ చేస్తుంది.
మ్యాన్‌కైండ్ ఫార్మా: స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ఇటీవల లిస్ట్ అయిన మ్యాన్‌కైండ్ ఫార్మా, నిఫ్టీ500, నిఫ్టీ మిడ్ క్యాప్150, నిఫ్టీ మిడ్ క్యాప్100, నిఫ్టీ200 సహా మరికొన్ని నిఫ్టీ ఇండీసెస్‌లో యాడ్ అయింది.
RBL బ్యాంక్: 2023 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో, RBL బ్యాంక్ రిటైల్ అడ్వాన్సులు 32% YoY, హోల్‌సేల్ అడ్వాన్సులు 8% YoY పెరిగాయి. రిటైల్ మిక్స్‌లో హోల్‌సేల్ అడ్వాన్స్‌లు సుమారు 56:44 రేషియోతో ఉన్నాయి.
సోమ్ డిస్టిలరీస్: క్యాపెక్స్ & వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం నిధులు సమీకరించబోతోంది. ఇందుకోసం, ప్రిఫరెన్షియల్ బేసిస్‌లో ప్రమోటర్లు లేదా ఇతర పెట్టుబడిదార్లకు కన్వర్టిబుల్ ఈక్విటీ వారెంట్ల జారీ చేస్తుంది. దీనిని ఆమోదించడానికి కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఈ నెల 8న సమావేశం అవుతుంది.
BHEL: జనరల్ ఎలక్ట్రిక్ టెక్నాలజీ GmbH స్విట్జర్లాండ్‌తో గ్యాస్ టర్బైన్ల టెక్నాలజీ అగ్రిమెంట్‌ను BHEL పొడిగించింది.
బంధన్ బ్యాంక్: జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో బంధన్ బ్యాంక్ లోన్లు, అడ్వాన్సులు దాదాపు 7% పెరిగి రూ. 1.03 లక్షల కోట్లకు చేరుకోగా, మొత్తం డిపాజిట్లు 17% పెరిగాయి. బ్యాంక్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సునీల్ సమ్దానీ రాజీనామా చేశారు, ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు ఆ పదవిలో కొనసాగుతారు.
AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: 2023-24 మొదటి త్రైమాసికంలో బ్యాంక్ గ్రాస్ అడ్వాన్స్‌లు ఏడాది ప్రాతిపదికన 29% పెరిగి రూ. 63,635 కోట్లకు చేరుకోగా, డిపాజిట్లు 27% పెరిగి రూ. 69,315 కోట్లకు చేరుకున్నాయి.
లెమన్ ట్రీ: రాజస్థాన్‌లో 48 గదులున్న హోటల్ అసెట్ కోసం లైసెన్స్ అగ్రిమెంట్ మీద లెమన్ ట్రీ సంతకం చేసింది. ఈ హోటల్ Q4 FY2024 నాటికి ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు.
సుజ్లాన్ ఎనర్జీ: కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఈ నెల 7న సమావేశమై, వివిధ రూట్ల ద్వారా క్యాపిటల్ ఫండ్స్ సమీకరించే ప్రతిపాదనను పరిశీలిస్తుంది.
సంవర్ధన మదర్సన్: సంవర్ధన మదర్సన్ పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ MSSL కన్సాలిడేటెడ్, $14 మిలియన్ల పెట్టుబడి కోసం ప్రిస్మ్ సిస్టమ్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
మరో ఆసక్తికర కథనం:ఈ ఎక్స్‌పర్ట్ చెప్పేది వింటే! పొరపాటున కూడా ఐటీ షేర్ల జోలికి వెళ్లరు!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.