News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

IT Sector Stocks: ఈ ఎక్స్‌పర్ట్‌ చెప్పేది వింటే! పొరపాటున కూడా ఐటీ షేర్ల జోలికి వెళ్లరు!

IT Sector Stocks: కొవిడ్‌ సంక్షోభంలో.. ఆ తర్వాత ఐటీ రంగం బలంగా పుంజుకుంది. అలాంటిది ఏడాదిన్నరగా కంపెనీలు ఇబ్బంది పడుతున్నాయి.

FOLLOW US: 
Share:

IT Sector Stocks: 

కొవిడ్‌ సంక్షోభంలో.. ఆ తర్వాత ఐటీ రంగం బలంగా పుంజుకుంది. ఇతర రంగాల కంపెనీలన్నీ డిజిటల్‌ బాట పట్టడంతో ఐటీ కంపెనీలకు (IT Companies) లాభాలు వచ్చాయి. అలాంటిది ఏడాదిన్నరగా ఇబ్బంది పడుతున్నాయి. ఆదాయం, నికర లాభం వంటి అంచనాలను తగ్గిస్తున్నాయి. అమెరికా, ఐరోపాలో ఆర్థిక మందగమనం ఉండటమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో మరో ఆరు నెలల వరకు ఐటీ కంపెనీల షేర్ల జోలికి వెళ్లకపోవడమే మంచిదని హీలియోస్‌ క్యాపిటల్‌ ఫౌండర్‌ సమీర్‌ అరోరా అంటున్నారు. 

'సాధారణంగా మాకు మూడు అతిపెద్ద థీమ్స్‌ ఉన్నాయి. అవి ఫైనాన్షియల్స్‌, కన్జూమర్‌, ఐటీ. కానీ ఏడాది కాలంగా ఐటీని మేం పరిగణనలోకి తీసుకోవడం లేదు. మరో ఆరు నెలల వరకు ఆ కంపెనీల్లో పెట్టుబడి పెట్టడం లేదు. వారం రోజుల క్రితం ఒకే రోజు ఆరుగురు బ్రోకర్లు ఐటీ రంగంలోని కంపెనీల ఎర్నింగ్స్‌పై రేటింగ్‌ను తగ్గించారు. ఈ ఆరుగురూ ఒకేసారి అలా ఎలా తగ్గిస్తారు' అని సమీర్‌ ప్రశ్నించారు.

Also Read: అద్దెకు ఉంటున్నారా! టెనెంట్‌గా ఈ హక్కులు మీకున్నాయని తెలుసా!

ఐటీ కంపెనీల ప్రతినిధులే బ్రోకర్లను పిలిచి ఈ విషయం చెప్పి ఉండొచ్చని సమీర్‌ అనుమానిస్తున్నారు. 'కంపెనీలు బ్రోకర్లను పిలిచి.. వారి అంచనాలు తప్పని చెప్పిఉంటాయి. మేం ఫలితాలు విడుదల చేసే రోజు మార్కెట్‌ అంచనాల మేరకు రాణించడం లేదన్న ముద్ర వద్దనుకుంటున్నాం. దయచేసి అంచనాలను తగ్గించండని అడిగి ఉంటాయి. ఈ వ్యవహారం అనలిస్టులు చాలా స్మార్ట్‌ అన్న భ్రమ కలిగిస్తుంది. కంపెనీలు మరీ అంత దారుణంగా ఏమీ లేవని భావించేలా చేస్తాయి. ప్రజలు, ఫారిన్‌ ఇన్వెస్టర్లు ఐటీ రంగంపై సానుకూలంగా ఉన్నప్పటికీ కష్టాలు రెండు, మూడు నెలల్లో పోవనే అనుకుంటున్నా' అని ఆయన తెలిపారు.

'పరిస్థితులు బాగా లేవంటే కనీసం ఏడాది వరకు అలాగే ఉంటుంది. ఒక పెద్ద కంపెనీ ఫలితాలు 8-12 త్రైమాసికాలు నిరాశపరిచాయంటే అది పుంజుకుంటుందని అనుకోలేం. తర్వాతి త్రైమాసికంలో అంతా బాగుపడుతుందని భావించలేం. తిరిగి పుంజుకోవడానికి కనీసం ఆరు నెలలు పడుతుంది. మార్గదర్శకాలు, అంచనాలను రీసెట్‌ చేయడం, కొత్త వాల్యుయేషన్లు రావడం వంటివి అవకాశాలు సృష్టించొచ్చు. సాధారణంగా మేం 20 శాతం నిధులను ఐటీలో పెట్టుబడి పెడతాం. కాకపోతే జొమాటో, పేటీఎం వంటి డిజిటల్‌, ఫైనాన్షియల్‌ కంపెనీల్లో 7 శాతం వరకు ఇన్వెస్ట్‌ చేస్తున్నాం' అని సమీర్‌ వివరించారు.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial  

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 04 Jul 2023 06:43 PM (IST) Tags: IT Sector IT stocks Stock Market Samir Arora

ఇవి కూడా చూడండి

Stock Market Today: సెన్సెక్స్‌, నిఫ్టీ రికవరీ! కొంతైన పూడిన నిన్నటి నష్టాలు

Stock Market Today: సెన్సెక్స్‌, నిఫ్టీ రికవరీ! కొంతైన పూడిన నిన్నటి నష్టాలు

Honda SP 125 Sports Edition: రూ. లక్ష లోపే స్పోర్ట్స్ బైక్ లుక్ - హోండా ఎస్పీ125 స్పోర్ట్స్ ఎడిషన్‌ చూశారా?

Honda SP 125 Sports Edition: రూ. లక్ష లోపే స్పోర్ట్స్ బైక్ లుక్ - హోండా ఎస్పీ125 స్పోర్ట్స్ ఎడిషన్‌ చూశారా?

Cryptocurrency Prices: మస్తు లాభాల్లో క్రిప్టో మార్కెట్లు! బిట్‌కాయిన్‌ రూ.50వేలు జంప్‌

Cryptocurrency Prices: మస్తు లాభాల్లో క్రిప్టో మార్కెట్లు! బిట్‌కాయిన్‌ రూ.50వేలు జంప్‌

Stock Market Today: కోలుకున్న స్టాక్‌ మార్కెట్లు! మధ్యాహ్నం ఏం జరుగుతుందో?

Stock Market Today: కోలుకున్న స్టాక్‌ మార్కెట్లు! మధ్యాహ్నం ఏం జరుగుతుందో?

Latest Gold-Silver Price 29 September 2023: నేల చూపుల్లో గోల్డ్‌, షాక్‌ ఇచ్చిన సిల్వర్‌ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Latest Gold-Silver Price 29 September 2023: నేల చూపుల్లో గోల్డ్‌, షాక్‌ ఇచ్చిన సిల్వర్‌ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

టాప్ స్టోరీస్

KCR Fever : కేసీఆర్‌కు తగ్గని జ్వరం - కేబినెట్ మీటింగ్ వచ్చే వారం !

KCR Fever : కేసీఆర్‌కు తగ్గని జ్వరం - కేబినెట్  మీటింగ్ వచ్చే వారం   !

TDP News : అధికార మత్తు వదిలేలా మోత మోగిద్దాం - కొత్త ఆన్ లైన్ ప్రచార ఉద్యమాన్ని ప్రకటించిన టీడీపీ !

TDP News  :  అధికార మత్తు  వదిలేలా మోత మోగిద్దాం - కొత్త ఆన్ లైన్ ప్రచార ఉద్యమాన్ని ప్రకటించిన టీడీపీ !

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

YSR Vahana Mitra 2023: వాహన మిత్ర ద్వారా ఇచ్చిన డబ్బులు దేనికైనా వాడుకోండి,  కానీ రెండూ మర్చిపోవద్దు: సీఎం జగన్

YSR Vahana Mitra 2023: వాహన మిత్ర ద్వారా ఇచ్చిన డబ్బులు దేనికైనా వాడుకోండి,  కానీ రెండూ మర్చిపోవద్దు: సీఎం జగన్