అన్వేషించండి

Stocks To Watch 01 August 2023: ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' Power Grid, Maruti, Adani Energy

మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

Stock Market Today, 01 August 2023: ఇవాళ (మంగళవారం) ఉదయం 7.50 గంటల సమయానికి, గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 05 పాయింట్లు లేదా 0.03 శాతం గ్రీన్‌ కలర్‌లో 19,891 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

ఇవాళ Q1 రిజల్ట్స్‌ ప్రకటించే కీలక కంపెనీలు: అదానీ టోటల్ గ్యాస్, PVR ఐనాక్స్, వెల్‌స్పన్‌ ఎంటర్‌ప్రైజెస్‌, థర్మాక్స్. ఈ స్టాక్స్‌ ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉంటాయి.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 

పవర్ గ్రిడ్: 2023-24 తొలి త్రైమాసికంలో పవర్ గ్రిడ్ కన్సాలిడేటెడ్ నెట్‌ ప్రాఫిట్‌ 5 శాతం తగ్గి రూ. 3,597 కోట్లకు పడిపోయింది. గత సంవత్సరం ఇదే కాలంలో రూ. 3,801 కోట్ల లాభం మిగుల్చుకుంది. సమీక్ష కాలంలో కంపెనీ ఆదాయం కేవలం 1 శాతం వృద్ధితో రూ. 10,905 కోట్లుగా నమోదైంది. 1:3 నిష్పత్తిలో బోనస్ షేర్లను కూడా ఈ కంపెనీ ప్రకటించింది.

మారుతి సుజుకీ: మారుతి సుజుకీ నికర లాభం మొదటి త్రైమాసికంలో రెండింతలు పెరిగింది, రూ. 2,485 కోట్లకు చేరుకుంది. కార్యకలాపాల ద్వారా ఈ వెహికల్‌ కంపెనీ రూ. 32,327 కోట్ల ఆదాయం ఆర్జించింది. ఇది 22 శాతం వృద్ధి.చేరుకుంది.

అదానీ ఎనర్జీ: 2023 ఏప్రిల్‌-జూన్‌ కాలంలో, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ రూ. 175 కోట్ల కన్సాలిడేటెడ్ నెట్‌ ప్రాఫిట్‌ సంపాదించింది, YoYలో ఈ లాభం 6% తగ్గింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం మాత్రం 17% పెరిగి రూ. 3,664 కోట్లకు చేరుకుంది.

ఈజ్‌మైట్రిప్‌: గైడ్‌లైన్ ట్రావెల్స్ హాలిడేస్ ఇండియా, డూక్ ట్రావెల్స్, ట్రిప్‌షాప్ ట్రావెల్ టెక్నాలజీస్‌లో 51% వాటాను కొనుగోలు చేసేందుకు ఈజ్‌మైట్రిప్‌ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. ఈ కొనుగోలు పూర్తయితే ఈజ్‌మైట్రిప్‌ బలం భారీగా పెరుగుతుంది.

JBM ఆటో: Q1 FY24లో JBM ఆటో 30 కోట్ల రూపాయల నికర లాభాన్ని ప్రకటించింది. ఆ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా రూ. 946 కోట్ల ఆదాయాన్ని ఈ కంపెనీ సంపాదించింది.

HG ఇన్‌ఫ్రా: జూన్‌ క్వార్టర్‌లో HG ఇన్‌ఫ్రా రూ.150 కోట్ల నికర లాభాన్ని మిగుల్చుకుంది. కార్యకలాపాల ద్వారా రూ. 1,351 కోట్ల ఆదాయం వచ్చింది.

KEI ఇండస్ట్రీస్: తొలి త్రైమాసికంలో, KEI ఇండస్ట్రీస్ నికర లాభం రూపంలో రూ. 121 కోట్ల ఆర్జించింది. కార్యకలాపాల ద్వారా రూ. 1,782 కోట్ల ఆదాయం గడించింది.

పెట్రోనెట్ LNG: జూన్ త్రైమాసికంలో పెట్రోనెట్ LNG రూ. 790 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఆ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 11,656 కోట్లుగా ఉంది.

ఇది కూడా చదవండి: పోస్టాఫీస్‌ నుంచి 3 బెస్ట్‌ స్కీమ్స్‌, వడ్డీతోనే ఎక్కువ డబ్బు సంపాదించొచ్చు!

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Embed widget