search
×

Postal Schemes: పోస్టాఫీస్‌ నుంచి 3 బెస్ట్‌ స్కీమ్స్‌, వడ్డీతోనే ఎక్కువ డబ్బు సంపాదించొచ్చు!

ఈ పథకాల్లో పెట్టుబడికి గ్యారెంటీ ఉంటుంది.

FOLLOW US: 
Share:

Post Office Savings Schemes: భారత ప్రభుత్వం, పోస్టాఫీస్‌ ద్వారా చాలా చిన్న మొత్తాల పొదుపు పథకాలను (Post Office small savings schemes) అమలు చేస్తోంది. పోస్టాఫీసు పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తే, దీర్ఘకాలంలో మంచి రాబడిని సులభంగా తీసుకోవచ్చు. 

సాధారణ ప్రజల కోసం పోస్టాఫీస్‌ నుంచి చాలా స్మాల్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌ ఉన్నాయి. వాటిలో 3 పథకాలను బెస్ట్‌ స్కీమ్స్‌గా చెప్పుకోవచ్చు. అవి.. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ ఖాతా (RD), పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ ఖాతా (POTD), పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC). టైమ్ డిపాజిడ్‌ మినహా మిగిలిన 2 పథకాలు 5 సంవత్సరాల లాక్-ఇన్‌తో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తాయి కాబ్టటి, ఈ పథకాల్లో  పెట్టుబడికి గ్యారెంటీ ఉంటుంది. పైగా, వీటిలో 2 స్కీమ్స్‌కు ఇన్‌కమ్‌ టాక్స్‌ మినహాయింపు ప్రయోజనం కూడా లభిస్తుంది.

పోస్టాఫీసు RD అకౌంట్‌
5 సంవత్సరాల కాలానికి సురక్షితమైన పెట్టుబడి పెట్టాలని మీరు చూస్తుంటే.. ఈ పోస్టాఫీస్‌ స్కీమ్‌ ఉపయోగపడుతుంది. దీని పేరు పోస్టాఫీస్‌ రికరింగ్‌ డిపాజిట్‌ ఖాతా ((Post Office Recurring Deposit Account). ఈ RD మీద 6.5% వడ్డీ వస్తుంది. ఈ వడ్డీ రేటు ప్రతి త్రైమాసికానికి (3 నెలలకు ఒకసారి) మారుతుంది. మీరు ఈ పథకంలో ప్రతి నెలా కనీసం రూ. 100 లేదా రూ. 10 గుణిజాల్లో ఉండే (110, 120..) మొత్తాన్ని పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో మీకు ఎంత శక్తి ఉంటే అంత డబ్బు ఇన్వెస్ట్‌ చేయొచ్చు, గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్
పోస్టాఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (National Savings Certificate) పథకం 5 సంవత్సరాల లాక్-ఇన్ గడువుతో అందుబాటులో ఉంది. 5 సంవత్సరాల కాలానికి 7.70% వరకు ఆకర్షణీయమైన వడ్డీ రేటును అందించే పథకం ఇది. ఈ పథకం కింద, కనీసం రూ. 1000 లేదా రూ. 100 గుణిజాల్లో ఉండే (1200, 1300..) మొత్తాన్ని పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలోనూ గరిష్ట డిపాజిట్ ఆంక్షలు లేవు. 5 సంవత్సరాల టెన్యూర్‌ పూర్తయిన తర్వాత మాత్రమే మీ డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే, కొన్ని షరతులకు లోబడి మీ పెట్టుబడిని ముందుగానే విత్‌డ్రా చేసుకునే సౌకర్యం కూడా ఉంది. ఈ పథకం కింద డిపాజిట్ చేసిన మొత్తానికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద మినహాయింపు తీసుకోవచ్చు.

పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ అకౌంట్‌
పేరుకు తగ్గట్లుగానే, పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ అకౌంట్‌ (Post Office Time Deposit Account) ఒక రకమైన ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్ అని చెప్పవచ్చు. ఈ పథకం కింద, మీ డబ్బును 1, 2, 3 లేదా 5 సంవత్సరాల పాటు పోస్టాఫీసులో డిపాజిట్ చేయవచ్చు. ఒకటి, రెండు, మూడు సంవత్సరాల FDపై 6.8% నుంచి 7% వరకు వడ్డీ లభిస్తుంది. మీరు ఇంకా మంచి ఇంట్రస్ట్‌ కావాలంటే, 5 సంవత్సరాల టైమ్ డిపాజిట్‌ తీసుకోవాలి. 5 సంవత్సరాల డిపాజిట్‌ మీద 7.5% అత్యధిక వడ్డీ రేటు పొందుతారు. అలాగే, ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80C కింద టాక్స్‌ డిడక్షన్‌ బెనిఫిట్‌ కూడా లభిస్తుంది. ఈ పథకం కింద, కనీసం రూ. 1000తో ఖాతా తెరవాలి. ఇందులోనూ ఎంత డబ్బయినా ఇన్వెస్ట్‌ చేయవచ్చు.

మరో ఆసక్తికర కథనం: వేలకు వేలు కాదు, ఏడాది కేవలం 20 రూపాయలకే ₹2 లక్షల బీమా కవరేజ్

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 31 Jul 2023 03:25 PM (IST) Tags: Interest Rate Recurring Deposit National Saving Certificate POST OFFICE Time Deposit

ఇవి కూడా చూడండి

Cyber Attack On Pensions: సైబర్ నేరగాళ్ల ఫోకస్‌ మీ పెన్షన్‌పై పడింది - ఒక్క క్లిక్‌తో మీ డబ్బంతా పోతుంది, జాగ్రత్త!

Cyber Attack On Pensions: సైబర్ నేరగాళ్ల ఫోకస్‌ మీ పెన్షన్‌పై పడింది - ఒక్క క్లిక్‌తో మీ డబ్బంతా పోతుంది, జాగ్రత్త!

Insurance Free-Look Period: బీమా పాలసీ ఫ్రీ-లుక్ పీరియడ్ నెల నుంచి సంవత్సరానికి పెంపు!- మీకు చాలా ప్రయోజనం

Insurance Free-Look Period: బీమా పాలసీ ఫ్రీ-లుక్ పీరియడ్ నెల నుంచి సంవత్సరానికి పెంపు!- మీకు చాలా ప్రయోజనం

Stock Market Fall: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా పోర్ట్‌ఫోలియో స్టాక్‌లో విధ్వంసం - రెండు రోజుల్లోనే రూ.1,600 కోట్ల నష్టం

Stock Market Fall: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా పోర్ట్‌ఫోలియో స్టాక్‌లో విధ్వంసం - రెండు రోజుల్లోనే రూ.1,600 కోట్ల నష్టం

Gold-Silver Prices Today 18 Feb: ఆగని పసిడి దూకుడు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

Gold-Silver Prices Today 18 Feb: ఆగని పసిడి దూకుడు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

SBI JanNivesh SIP: SBI స్పెషల్‌ ఆఫర్‌ - కేవలం రూ.250తో మ్యూచువల్‌ ఫండ్‌ SIP, ఛార్జీలు రద్దు

SBI JanNivesh SIP: SBI స్పెషల్‌ ఆఫర్‌ - కేవలం రూ.250తో మ్యూచువల్‌ ఫండ్‌ SIP, ఛార్జీలు రద్దు

టాప్ స్టోరీస్

BRS Latest News: ఆ మూడు కారణాలతోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా బీఆర్‌ఎస్- గట్టిగా కొట్టాలని భారీ ప్లాన్

BRS Latest News: ఆ మూడు కారణాలతోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా బీఆర్‌ఎస్- గట్టిగా కొట్టాలని భారీ ప్లాన్

Mamata Banerjee On Kumbha Mela: మమత బెనర్జీ Vs పవన్ కల్యాణ్- మహా కుంభ మేళాపై విమర్శలు

Mamata Banerjee On Kumbha Mela: మమత బెనర్జీ Vs పవన్ కల్యాణ్- మహా కుంభ మేళాపై విమర్శలు

Jagan: జగన్ పై పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం - చట్టాన్ని గౌరవించని వారికి సెల్యూట్ చేయబోమని హెచ్చరిక

Jagan: జగన్ పై పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం - చట్టాన్ని గౌరవించని వారికి సెల్యూట్ చేయబోమని హెచ్చరిక

Pawan Kalyan Latest News: మహాకుంభమేళాలో పవన్ దంపతుల పుణ్య స్నానం-గట్టి మెసేజ్ పంపించిన డీసీఎం- మీకు అర్థమవుతుందా?

Pawan Kalyan Latest News: మహాకుంభమేళాలో పవన్ దంపతుల పుణ్య స్నానం-గట్టి మెసేజ్ పంపించిన డీసీఎం- మీకు అర్థమవుతుందా?