News
News
వీడియోలు ఆటలు
X

Stocks to watch 29 March 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - అదానీ స్టాక్స్‌తో జాగ్రత్త

స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.

FOLLOW US: 
Share:

Stocks to watch today, 29 March 2023: ఇవాళ (బుధవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 13 పాయింట్లు లేదా 0.08 శాతం గ్రీన్‌ కలర్‌లో 17,003 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:

L&T: ఒక్కోటి రూ. 1 లక్ష విలువైన 2,00,000 నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లను (NCDలు) ఈ కంపెనీ జారీ చేసింది, తద్వారా రూ. 2,000 కోట్లు సమీకరిస్తోంది. 2028 ఏప్రిల్ 28న ఇవి మెచ్యూర్ అవుతాయి. ఈ డిబెంచర్లు NSEలో లిస్ట్‌ అవుతాయి.

అదానీ స్టాక్స్: మొత్తం $2.5 బిలియన్ల షేర్-బ్యాక్డ్ రుణాన్ని తిరిగి చెల్లించామని, ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తలు బయటకు వస్తున్నాయని అదానీ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) స్పష్టం చేశారు.

GR ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్: రూ. 587.59 కోట్ల విలువైన ప్రాజెక్ట్ కోసం కంపెనీ ఈస్ట్ కోస్ట్ రైల్వే నుంచి లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ (LoA) ఈ కంపెనీ దక్కించుకుంది.

జిందాల్ స్టెయిన్‌లెస్: ఇండోనేషియాకు చెందిన నికెల్ పిగ్ ఐరన్ కంపెనీలో 49% వాటాను కొనుగోలు చేసినట్లు జిందాల్ స్టెయిన్‌లెస్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది.

RPP ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్: రూ.148.08 కోట్ల విలువైన కొత్త ప్రాజెక్ట్‌ కోసం లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్‌ను RPP ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ అందుకుంది. ఈ ప్రాజెక్ట్ 31 అక్టోబర్, 2024 నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు.

DB కార్పొరేషన్: D B Corp కంపెనీ గ్రూప్ CFO గా పదవీ విరమణ చేయనున్న ప్రద్యుమ్న మిశ్రా స్థానంలో ఏప్రిల్ 1 నుంచి లలిత్ జైన్‌ని నియమించారు. జైన్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా 2023 ఏప్రిల్‌ 1 నుంచి బాధ్యతలు చేపడతారు.

వేదాంత: వేదాంత ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23కి ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ. 20.50 చొప్పున ఐదో మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. డివిడెండ్ మొత్తం రూ. 7,621 కోట్లు.

సౌత్ ఇండియన్ బ్యాంక్: వ్యక్తిగత కారణాల వల్ల, బ్యాంక్‌ మేనేజింగ్ డైరెక్టర్ & CEO పదవిలో తనను మరో దఫా నియమించవద్దన్న మురళీ రామకృష్ణన్‌ను అభ్యర్థనను బ్యాంక్ బోర్డు ఓకే చేసింది.

జైడస్ లైఫ్ సైన్సెస్: యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (USFDA) నుంచి లోపెరమైడ్ హైడ్రోక్లోరైడ్ క్యాప్సూల్స్ కోసం జైడస్ లైఫ్ సైన్సెస్ తుది ఆమోదం పొందింది. తీవ్రమైన నాన్‌ స్పెసిఫిక్ డయేరియా, ఇన్‌ఫ్లమేటరీ బొవెల్‌ వ్యాధితో సంబంధం ఉన్న దీర్ఘకాలిక డయేరియా నియంత్రణ, రోగ లక్షణ ఉపశమనం కోసం లోపెరమైడ్ హైడ్రోక్లోరైడ్ క్యాప్సూల్స్‌ను ఉపయోగిస్తారు.

బ్రిటానియా: 2022-23 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర డివిడెండ్ చెల్లింపును పరిశీలించేందుకు బ్రిటానియా బోర్డ్ 2023 ఏప్రిల్ 4న జరగనుంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 29 Mar 2023 07:52 AM (IST) Tags: Share Market Stock Market Vedanta SBI Card Hindustan Zinc Jindal Stainless

సంబంధిత కథనాలు

Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్లో వణుకు - రూ.88వేలు తగ్గిన బిట్‌కాయిన్‌

Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్లో వణుకు - రూ.88వేలు తగ్గిన బిట్‌కాయిన్‌

Stock Market News: టర్న్‌ అరౌండ్‌ అయిన సెన్సెక్స్‌, నిఫ్టీ - ఎరుపెక్కిన ఐటీ ఇండెక్స్‌!

Stock Market News: టర్న్‌ అరౌండ్‌ అయిన సెన్సెక్స్‌, నిఫ్టీ - ఎరుపెక్కిన ఐటీ ఇండెక్స్‌!

LIC Policy: రోజుకు ₹45 పెట్టుబడితో ₹25 లక్షలు మీ సొంతం

LIC Policy: రోజుకు ₹45 పెట్టుబడితో ₹25 లక్షలు మీ సొంతం

BoB: ఫోన్‌తో స్కాన్‌ చేసి డబ్బు తీసుకోవచ్చు, ఏటీఎం కార్డ్‌ అక్కర్లేదు

BoB: ఫోన్‌తో స్కాన్‌ చేసి డబ్బు తీసుకోవచ్చు, ఏటీఎం కార్డ్‌ అక్కర్లేదు

Monsoon Stocks: మాన్‌సూన్‌ ముందు కొనాల్సిన మంచి స్టాక్స్‌ - లాభాలను వర్షించొచ్చు!

Monsoon Stocks: మాన్‌సూన్‌ ముందు కొనాల్సిన మంచి స్టాక్స్‌ - లాభాలను వర్షించొచ్చు!

టాప్ స్టోరీస్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!

Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!

Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్‌జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక

Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్‌జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!