Stocks to watch 27 January 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - అదానీ గ్రూప్ స్టాక్స్‌తో జాగ్రత్త
మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
Stocks to watch today, 27 January 2023: ఇవాళ (శుక్రవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 71 పాయింట్లు లేదా 0.40 శాతం గ్రీన్ కలర్‌లో 18,024 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
టాటా మోటార్స్: 2022 డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ. 2,958 కోట్లకు చేరింది. మార్కెట్ అంచనా వేసిన రూ. 285 కోట్ల లాభం కంటే ఈ సంఖ్య చాలా ఎక్కువ. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలోని రూ. 1,516 కోట్ల నష్టం నుంచి చాలా బలంగా కోలుకుంది. కార్యకలాపాల ఏకీకృత ఆదాయం సంవత్సరానికి 22.5% పెరిగి రూ. 88,489 కోట్లకు చేరుకుంది.
డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్: 2022 డిసెంబర్ త్రైమాసికంలో, ఈ డ్రగ్‌మేకర్ స్ట్రీట్ అంచనాలను అధిగమించి నికర లాభాన్ని 77% వృద్ధితో రూ.1,247 కోట్లకు పెంచుకుంది. ఆదాయం 27% పెరిగి రూ. 6,770 కోట్లకు చేరుకుంది. డిసెంబర్ త్రైమాసికంలో, కంపెనీ స్థూల మార్జిన్ 53.8% నుంచి 59.2%కి పెరిగింది.
అదానీ ఎంటర్‌ప్రైజెస్: ఈ కంపెనీ రూ. 20,000 కోట్ల ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (FPO) ఇవాళ (శుక్రవారం, 27 జనవరి 2023) సబ్‌స్క్రిప్షన్ కోసం ఓపెన్ అవుతుంది. అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (ADIA), అల్ మెహ్వార్ ఇన్వెస్ట్‌మెంట్స్, సిటీ గ్రూప్ గ్లోబల్, మోర్గాన్ స్టాన్లీ, గోల్డ్‌మన్ సాచ్స్, LIC, HDFC లైఫ్ ఇన్సూరెన్స్, SBI పెన్షన్ ఫండ్ వంటి ప్రముఖ కంపెనీలు సహా 30కి పైగా సంస్థాగత పెట్టుబడిదార్ల నుంచి ఈ కంపెనీ దాదాపు రూ. 6,000 కోట్లను సమీకరించింది. FPO ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ. 3,112- 3,276. అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ ఇన్వెస్టర్లు ఒక్క రోజులో రూ. 1 లక్ష కోట్ల మేర కోల్పోయారు.
వేదాంత: డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికం, 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల ఆదాయాలను పరిగణనలోకి తీసుకుని ఆమోదించడానికి కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఇవాళ సమావేశమవుతుంది.
బజాజ్ ఫైనాన్స్: డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఆదాయాలను పరిశీలించడానికి, ఆమోదించడానికి ఈ NBFC డైరెక్టర్ల బోర్డు ఇవాళ సమావేశమవుతుంది. నికర వడ్డీ ఆదాయంలో (NII) మెరుగుదలతో కంపెనీ 30% పైగా ఆరోగ్యకరమైన లాభ వృద్ధిని నివేదిస్తుందని మార్కెట్ అంచనా వేస్తోంది. అయితే, పెరిగిన ఖర్చుల కారణంగా నికర వడ్డీ మార్జిన్ (NIM) తగ్గవచ్చు.
వేదాంత: 2022 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికం, ఈ ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల ఆదాయాలను పరిగణనలోకి తీసుకుని ఆమోదించడానికి కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఇవాళ సమావేశమవుతుంది.
వొడాఫోన్ ఐడియా: మొబైల్ టవర్ విక్రేత ఏటీసీ టెలికాం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు రూ.1,600 కోట్ల విలువైన డిబెంచర్లు జారీ చేసే ప్రతిపాదనపై చర్చించేందుకు వొడాఫోన్ ఐడియా డైరెక్టర్ల బోర్డు మంగళవారం సమావేశం కానుంది. డిబెంచర్ల జారీకి గత డిసెంబర్‌లో వాటాదారులు ఆమోదించిన తర్వాత, ఆప్షనల్లీ కన్వర్టబుల్ డిబెంచర్లు (OCD) జారీ చేయడానికి చివరి తేదీని ఫిబ్రవరి 28 వరకు పొడిగించేందుకు Vodafone Idea, ATC అంగీకరించాయి.
మారుతి సుజుకి: 2030 నాటికి బలమైన EV పోర్ట్‌ఫోలియోను నిర్మించడానికి గట్టి ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇండియన్ మార్కెట్లో కనీసం అర డజను ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేయబోతోంది. వీటితో పాటు CNG, బయోగ్యాస్, ఇథనాన్‌తో నడిచే కార్బన్ న్యూట్రల్ ఇంటర్నల్ కంబన్షన్ ఇంజిన్ వాహనాలను కూడా మార్కెట్‌కు పరిచయం చేస్తుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.