By: ABP Desam | Updated at : 25 Jan 2023 08:11 AM (IST)
Edited By: Arunmali
స్టాక్స్ టు వాచ్ - 25 జనవరి 2023
Stocks to watch today, 25 January 2023: ఇవాళ (బుధవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 18 పాయింట్లు లేదా 0.15 శాతం రెడ్ కలర్‌లో 18,176 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్ మార్కెట్ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
టాటా మోటార్స్: 2022 డిసెంబర్ త్రైమాసికంలో ఈ వాహన తయారీ సంస్థ చాలా బలంగా బౌన్స్ అయింది, రూ. 285 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలోని రూ. 1,516 కోట్ల నష్టం, త్రైమాసికం క్రితం రూ. 945 కోట్ల నష్టం నుంచి కోలుకుని లాభాలు ఆర్జించింది. ఏకీకృత అమ్మకాలు సంవత్సరానికి (YoY) 14%, సీక్వెన్షియల్‌గా 3% పెరిగి రూ. 82,738 కోట్లకు చేరుకున్నాయి.
బజాజ్ ఆటో: 2022 డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో 2-వీలర్ & 3-వీలర్ విభాగాల్లో వాల్యూమ్స్ తగ్గుదల, ప్రమోషన్లపై పెరిగిన వ్యయం సీక్వెన్షియల్‌గా దెబ్బ తీసే అవకాశం ఉంది. ఆదాయం సంవత్సరానికి 2%, సీక్వెన్షియల్‌గా 13% తగ్గి రూ. 8,852 కోట్లకు చేరుకోవచ్చన్నది మార్కెట్ అంచనా. నికర లాభం సంవత్సరానికి 11.3% పెరిగి రూ. 1,351 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది, కానీ సీక్వెన్షియల్‌గా 12% తగ్గొచ్చు.
సిప్లా: డిసెంబర్ త్రైమాసికం & గత తొమ్మిది నెలల ఆదాయాలను పరిగణనలోకి తీసుకుని ఆమోదించడానికి కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశమవుతుంది. US మార్కెట్లో మెరుగైన పనితీరు నేపథ్యంలో రాబడిలో బలమైన వృద్ధిని నమోదు చేస్తుందని, నికర లాభం రెండంకెలలో పెరుగుతుందని అంచనా.
డా. రెడ్డీస్ లాబొరేటరీస్: డిసెంబరుతో ముగిసిన త్రైమాసికం & గత తొమ్మిది నెలల ఆదాయాలను పరిగణనలోకి తీసుకుని ఆమోదించడానికి కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశమవుతుంది. కంపెనీ ఆదాయం, లాభం రెండింటిలోనూ బలమైన రెండంకెల వృద్ధిని నివేదించవచ్చు.
నజారా టెక్నాలజీస్: డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం 76% పెరిగి రూ. 18 కోట్లకు చేరుకుంది. ఆదాయం 69% పైగా పెరిగి రూ. 315 కోట్లకు చేరుకుంది.
రైల్ వికాస్ నిగమ్: దక్షిణ రైల్వే నుంచి ఈ కంపెనీ రూ. 38.4 కోట్ల విలువైన ఆర్డర్‌ను పొందింది.
త్రివేణి ఇంజినీరింగ్: డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ. 147 కోట్లుగా నమోదైంది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో ఇది రూ. 130 కోట్లుగా ఉంది. గత ఏడాది రూ. 1,240 కోట్లుగా ఉన్న ఆదాయం ఇప్పుడు రూ. 1,660 కోట్లకు పెరిగింది. చక్కెర వ్యాపారం కోసం రూ. 90 కోట్ల పెట్టుబడులు, పవర్ ట్రాన్స్‌మిషన్ వ్యాపారం కోసం రూ. 100 కోట్ల పెట్టుబడికి డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది.
మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్: డిసెంబర్ త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం సంవత్సరానికి 5.5% క్షీణించి రూ. 226.5 కోట్లకు చేరుకుంది. అయితే, కార్యకలాపాల ఆదాయం 5% పెరిగి రూ. 1,072 కోట్లకు చేరుకుంది.
పిడిలైట్ ఇండస్ట్రీస్: డిసెంబర్ త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం సంవత్సరానికి 15% తగ్గి రూ. 304.2 కోట్లకు చేరుకుంది. ఆదాయం కేవలం 5.2% పెరిగి రూ. 2997.6 కోట్లుగా నమోదైంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Income Tax Saving Tips: పన్ను భారం తగ్గించుకోవాలా! ఇలా మీ తల్లిదండ్రుల సాయం తీసుకుంటే చాలు!
Stock Market Crash: రక్తమోడుతున్న స్టాక్ మార్కెట్లు - లక్షల కోట్ల నష్టంతో ఇన్వెస్టర్ల కన్నీరు!
Bal Jeevan Bima Yojana: పిల్లల కోసం పోస్టాఫీస్ పథకం - రోజుకు 6 రూపాయలు కట్టి రూ.లక్ష తిరిగి పొందండి
Cryptocurrency Prices: ఎర్రబారిన క్రిప్టోలు - రూ.5వేలు పడిపోయిన బిట్‌కాయిన్
RBI e-rupee: పండ్లు కొని డిజిటల్ రూపాయిల్లో చెల్లించిన ఆనంద్ మహీంద్ర, వీడియో వైరల్
Tarak ratna Health Update : మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తారకరత్న, కుప్పం నుంచి గ్రీన్ ఛానల్
APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! మెయిన్స్‌కు 6,455 మంది ఎంపిక!
Perni Nani : అన్నీ మంచి చేస్తే రోడ్డెందుకు ఎక్కాల్సి వచ్చింది ? లోకేష్‌కు పేర్ని నాని కౌంటర్ !
Pawan Kalyan: ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా - వివాదాస్పద టాపిక్ టచ్ చేసిన బాలయ్య - పవర్ ప్రోమో చూశారా?