By: ABP Desam | Updated at : 20 Jan 2023 08:09 AM (IST)
Edited By: Arunmali
స్టాక్స్ టు వాచ్ - 20 జనవరి 2023
Stocks to watch today, 20 January 2023: ఇవాళ (శుక్రవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 21 పాయింట్లు లేదా 0.12 శాతం గ్రీన్ కలర్లో 18,135 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ, రిలయన్స్ సహా చాలా కంపెనీలు వాటి Q3 నంబర్లను పోస్ట్ చేస్తాయి. కాబట్టి, రంగాల వారీగా కాకుండా, స్టాక్స్ వారీగా ఇవాళ మార్కెట్లో యాక్షన్స్ ఉంటాయి.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
హిందుస్థాన్ యూనిలీవర్ (HUL): 2022 డిసెంబర్ త్రైమాసికానికి రూ. 2,505 కోట్ల నికర లాభాన్ని ఈ కంపెనీ ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 12% పెరిగింది. నికర విక్రయాలు 16% పెరిగి రూ. 14,986 కోట్లకు చేరాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్: ఇవాళ Q3FY23 నంబర్లను ప్రకటిస్తుంది. టెలికాం & రిటైల్ వర్టికల్స్‌లో స్థిరమైన పనితీరుతో పాటు ప్రధాన వ్యాపారమైన ఇంధనం వ్యాపారంలో మెరుగుదల కారణంగా Q2 సంఖ్యల కంటే Q3 ఆదాయాలు మెరుగ్గా ఉంటాయని అంచనా. ఏకీకృత నికర లాభం QoQ 12% పెరిగి రూ. 15,382 కోట్లకు చేరుకోవచ్చని మార్కెట్ అంచనా వేసింది, అయితే YoY 17% తగ్గుతుందని భావిస్తున్నారు. ఆదాయం గత ఏడాది కంటే 17% పెరిగి రూ. 2.23 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. అయితే QoQలో 4% తగ్గవచ్చు.
బంధన్ బ్యాంక్: విశ్లేషకుల అంచనాల ప్రకారం, బంధన్ బ్యాంక్ నికర లాభం కూడా ఏడాది ప్రాతిపదికన (YoY) రూ. 859 కోట్ల నుంచి 65-84% క్షీణించే అవకాశం ఉంది. బ్యాంక్ బలమైన రుణ వృద్ధిని నివేదిస్తుందని అంచనా. అయితే నికర వడ్డీ ఆదాయం తగ్గుతుందని భావిస్తున్నారు.
AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: డిసెంబర్ త్రైమాసికానికి రికార్డ్ స్థాయి నికర లాభం రూ. 393 కోట్లును నివేదించింది. డిసెంబర్ త్రైమాసికంలో వార్షికంగా 30% వృద్ధి, మెరుగైన ఆస్తుల నాణ్యత, కేటాయింపులలో క్షీణత కారణంగా రికార్డ్ లాభాలను సొంతం చేసుకుంది. గత త్రైమాసికంలో స్థూల మొండి బకాయిలు 2.60% నుంచి ఇప్పుడు 1.81%కి తగ్గాయి.
L&T టెక్నాలజీ సర్వీసెస్: కంపెనీ ఏకీకృత నికర లాభం సంవత్సరానికి (YoY) 22%, త్రైమాసికానికి (QoQ) 7.5% పెరిగి రూ. 304 కోట్లకు చేరుకుంది. ఆదాయం ఏడాదికి 21.4%, త్రైమాసికానికి 3% పెరిగి రూ. 2,049 కోట్లకు చేరుకుంది. మొత్తం FY23 కోసం, డాలర్ పరంగా ఆదాయ వృద్ధి మార్గదర్శకాన్ని 15.5-16.5% నుంచి 15%కి ఈ కంపెనీ తగ్గించింది.
హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్: డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఈ కంపెనీ రూ. 57 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇది దాదాపు 18% వృద్ధి. ఆదాయం గత ఏడాది కంటే 29% పెరిగి రూ. 366 కోట్లకు చేరుకుంది.
సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్: అమెరికా కంపెనీ కాన్సర్ట్ ఫార్మాస్యూటికల్స్‌ను $576 మిలియన్లకు కొనుగోలు చేస్తోంది. తద్వారా, బట్టతల చికిత్స కోసం ఒక ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్న ఔషధం సన్ ఫార్మా సొంతం అవుతుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Sukanya Samriddhi Yojana: మీ కుమార్తెకు సురక్షిత భవిష్యత్ + మీకు పన్ను మినహాయింపు - ఈ స్కీమ్‌తో రెండూ సాధ్యం
Tata Cars Price Hikes: టాటా మోటార్స్ కార్ల ధరలు పెరుగుతున్నాయి, ఫిబ్రవరి నుంచి రేట్ల వాత
Hyderabad G-20 Startup 20 Inception : స్టార్టప్ వ్యవస్థను మరింతగా ప్రోత్సహించడం కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటి- కిషన్ రెడ్డి
LIC Adani Shares: అదానీ వల్ల మీకు-నాకే కాదు, ఎల్ఐసీకి కూడా భారీ నష్టం, రెండ్రోజుల్లో ₹16,580 కోట్లు పోయాయి
Bank Strike: జనవరి 30, 31 తేదీల్లో బ్యాంకులు పని చేస్తాయా, సమ్మెపై ఏ నిర్ణయం తీసుకున్నారు?
Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !
RGV Backstabbing Tweet : పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు, నాదెండ్ల వెన్నుపోటు? - వర్మ కలలో చెప్పిన దేవుడు
Minister Roja On Lokesh : లోకేశ్ కాదు పులకేశి, అడుగుపెడితే ప్రాణాలు గాల్లోనే- మంత్రి రోజా సెటైర్లు
Minister Harish Rao : వరంగల్ హెల్త్ సిటీ దేశానికే ఒక మోడల్, దసరా నాటికి నిర్మాణం పూర్తి- మంత్రి హరీశ్ రావు