Stocks to watch 14 October 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - Infosys, HDFC Lifeపై ఓ కన్నేయండి
మన మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
Stocks to watch today, 14 October 2022: ఇవాళ (శుక్రవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 282 పాయింట్లు లేదా 1.66 శాతం గ్రీన్ కలర్‌లో 17,239 వద్ద ట్రేడవుతోంది. మన మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ Q2 ఫలితాలు ప్రకటించనున్న మేజర్ కంపెనీలు: బజాజ్ ఆటో, శ్రీ సిమెంట్, టాటా ఎల్‌క్సీ, ఒబెరాయ్ రియాల్టీ, ఫెడరల్ బ్యాంక్, జస్ట్ డయల్, స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్, ప్లాస్టిబ్లెండ్స్ ఇండియా, మనీబాక్స్ ఫైనాన్స్, అమల్, క్షితిజ్ పాలీలైన్ మరియు డెల్టన్ కేబుల్స్
నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
ఇన్ఫోసిస్: భారతదేశంలోని రెండో అతి పెద్ద IT సేవల కంపెనీ సెప్టెంబర్ త్రైమాసికం ఏకీకృత నికర లాభం 11 శాతం పెరిగి రూ.6,021 కోట్లకు చేరుకుంది. రూ.9,300 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్ ప్రకటించింది. ఒక్కో షేరుకు రూ.16.50 మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది.
HDFC లైఫ్ ఇన్సూరెన్స్: ఎక్సైడ్ లైఫ్‌ను విలీనం చేసుకోవడానికి HDFC లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి (HDFC లైఫ్) బీమా రంగ నియంత్రణ సంస్థ IRDAI తుది ఆమోదం తెలిపింది. ఈ ఏడాది జనవరిలో, ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 100 శాతం వాటాను దాని మాతృ సంస్థ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ నుంచి రూ.6,687 కోట్లకు HDFC లైఫ్ కొనుగోలు చేసింది.
భెల్ (BHEL): దేశంలో కోల్ గ్యాసిఫికేషన్ ఆధారిత ప్లాంట్ల ఏర్పాటు కోసం కోల్ ఇండియా (CIL) మరియు NLC ఇండియాతో (NLCIL) ఈ హెవీ ఎలక్ట్రికల్ ప్లైయర్ ఒప్పందం కుదుర్చుకుంది. BHEL - CIL ఒప్పందం ప్రకారం, కోల్ గ్యాసిఫికేషన్ ఆధారిత ప్లాంట్లను ఇవి రెండూ కలిసి ఏర్పాటు చేస్తాయి. లిగ్నైట్ ఆధారిత గ్యాసిఫికేషన్ పైలట్ ప్లాంట్‌ను NLCIL ఏర్పాటు చేస్తుంది.
మైండ్‌ట్రీ: సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ IT కంపెనీ ఏకీకృత నికర లాభం ఏడాది ప్రాతిపదికన 27.5 శాతం పెరిగి రూ.508.7 కోట్లకు చేరుకుంది. సీక్వెన్షియల్‌గా చూస్తే, జూన్ త్రైమాసికం కంటే లాభం దాదాపు 8 శాతం ఎక్కువ. Q2 ఆదాయం రూ.3,400.4 కోట్లకు చేరుకుంది. సీక్వెన్షియల్ త్రైమాసికంతో పోలిస్తే 8.9 శాతం, గత ఏడాది ఇదే కాలం కంటే 31.5 శాతం పెరిగింది.
ఆనంద్ రాఠీ వెల్త్: ఈ నాన్ బ్యాంక్ వెల్త్ సొల్యూషన్స్ కంపెనీ సెప్టెంబరు త్రైమాసిక పన్ను తర్వాతి లాభం (PAT) 41 శాతం పెరిగి రూ.43 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.30.4 కోట్ల PAT నమోదు చేసింది.
ఏంజెల్ వన్: సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ బ్రోకరేజ్ సంస్థ లాభం 17.7 శాతం సీక్వెన్షియల్ వృద్ధితో రూ.213.6 కోట్లకు చేరింది. ఏకీకృత మొత్తం ఆదాయం 9 శాతం QoQ వృద్ధితో రూ.745.9 కోట్లకు చేరుకుంది. ఇది, Q2FY23లో దాదాపు 1.2 మిలియన్ల క్లయింట్లను జోడించింది.
బంధన్ బ్యాంక్: 2025 నాటికి, సెక్యూర్డ్ లోన్ల ఎక్స్‌పోజర్‌ను 70 శాతానికి పెంచడం ద్వారా తన అసెట్ బేస్‌ను వైవిధ్యపరచనున్నట్లు తెలిపింది. తన భౌగోళిక ఉనికిని కూడా ఈ ప్రైవేట్ బ్యాంక్ వైవిధ్యపరుస్తుంది.
పెన్నార్ ఇండస్ట్రీస్: రాజస్థాన్‌లోని భడ్లాలో ప్రతిపాదించిన 500 MW AC, 625 MW DC సోలార్ PV ప్రాజెక్ట్ కోసం NTPC రెన్యువబుల్ ఎనర్జీ లిమిటెడ్ (NTPC REL) నుంచి ఒక ఆర్డర్ గెలుచుకున్నట్లు ఈ ఇంజినీరింగ్ & నిర్మాణ సంస్థ తెలిపింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.