అన్వేషించండి

Stock Market News: నిన్న నష్టం - నేడు రూ.3 లక్షల కోట్లు లాభం! జోష్‌లో సెన్సెక్స్‌, నిఫ్టీ

Stock Market @ 12 PM: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) గురువారం భారీ లాభాల్లో మొదలయ్యాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 16,878 వద్ద కొనసాగుతోంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 660 పాయింట్ల లాభాల్లో ఉంది.

Stock Market @ 12 PM: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) గురువారం భారీ లాభాల్లో మొదలయ్యాయి. బెంచ్‌మార్క్‌ సూచీలు ఉదయం నుంచీ జోరుగా సాగుతున్నాయి. ఆర్బీఐ రెపో రేట్ల పెంపుతో బుధవారం నష్టపోయిన మార్కెట్లు మరుసటి రోజే కోలుకున్నాయి. ఆర్బీఐ నిర్ణయాల తాలూకు ఫలితాలను అంచనా వేయడంతో మదుపర్లు మళ్లీ కొనుగోళ్లు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 16,878 వద్ద కొనసాగుతోంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 660 పాయింట్ల లాభాల్లో ఉంది. బుధవారం రూ.7 లక్షల కోట్లు నష్టపోయిన  మదుపర్లు నేడు రూ.3 లక్షల కోట్లు ఆర్జించారు. 

BSE Sensex

క్రితం సెషన్లో 55,669 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 56,255 వద్ద భారీ లాభాల్లో  మొదలైంది. ఉదయం నుంచే కొనుగోళ్ల సందడి కొనసాగింది. 56,566 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. 55,976 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం 660 పాయింట్ల లాభంతో 56,337 వద్ద కొనసాగుతోంది.

NSE Nifty

బుధవారం 16,677 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 16,854 వద్ద ఓపెనైంది. ఉదయం నుంచి దూకుడుగా కదలాడింది. 16,945 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకుంది.  16,778 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం 200 పాయింట్ల లాభంతో 16,878 వద్ద కొనసాగుతోంది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ లాభాల్లో కొనసాగుతోంది. ఉదయం 35,705 వద్ద మొదలైంది. 35,550 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 35,934 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో 503 పాయింట్ల లాభంతో 35,764 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 40 కంపెనీలు లాభపడగా 10 నష్టాల్లో ముగిశాయి. టాటా స్టీల్‌, హీరో మోటోకార్ప్‌, ఓఎన్‌జీసీ, ఇన్ఫీ, టెక్‌ మహీంద్రా షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. టాటా కన్జూమర్‌, నెస్లే ఇండియా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బ్రిటానియా, అపోలో హాస్పిటల్స్‌ స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. రియాల్టీని మినహాయిస్తే మిగతా రంగాల సూచీలన్నీ లాభాల్లో ఉన్నాయి. ఆటో, బ్యాంక్‌, మెటల్‌, క్యాపిటల్‌ గూడ్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, పీఎస్‌యూ బ్యాంక్‌, పవర్‌ సూచీలు 1-2 శాతం ఎగిశాయి.

టాప్ హెడ్ లైన్స్

Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
FMCG Price Hike: ధరలు పెంచడానికి రెడీ అవుతున్న ఎఫ్‌ఎంసిజి బ్రాండ్లు! మీ ఇంటి బడ్జెట్‌పై ఎఫెక్ట్‌! 
ధరలు పెంచడానికి రెడీ అవుతున్న ఎఫ్‌ఎంసిజి బ్రాండ్లు! మీ ఇంటి బడ్జెట్‌పై ఎఫెక్ట్‌! 
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
PMFME Scheme: ఫుడ్ బిజినెస్ చేసేవారికి గుడ్ న్యూస్.. రూ. 10 లక్షల రుణంపై 35% సబ్సిడీ.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
ఫుడ్ బిజినెస్ చేసేవారికి రూ. 10 లక్షల రుణంపై 35% సబ్సిడీ.. ఎలా అప్లై చేసుకోవాలంటే

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Claude Vs ChatGPT: చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Embed widget