By: ABP Desam | Updated at : 16 Mar 2022 11:06 AM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్
Share Market: భారత స్టాక్ మార్కెట్లు (Indian Stock Markets) నేడు జోష్‌లో కనిపిస్తున్నాయి. ఆరంభం నుంచే సూచీలు దూకుడు కనబరుస్తున్నాయి. నాటోలో చేరేందుకు ఉక్రెయిన్ నిరాకరించడం మదుపర్లలో సానుకూల సెంటిమెంటును పెంచింది. బహుశా రష్యా ఇక యుద్ధం తీవ్రతను తగ్గించే అవకాశాలు ఉండటంతో పెట్టుబడులు పెరుగుతున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 800 +, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 230+ పాయింట్ల లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
BSE Sensex
క్రితం సెషన్లో 55,776 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) నేడు 56,553 వద్ద భారీ లాభాల్లో మొదలైంది. అప్పట్నుంచి కొనుగోళ్లు పెరగడంతో సూచీ మరింత పైకి వెళ్తోంది. 56,389 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకిన సూచీ 56,761 వద్ద గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 819 పాయింట్ల లాభంతో 56,596 వద్ద కదలాడుతోంది.
NSE Nifty
మంగళవారం 16,663 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) బుధవారం 16,876 వద్ద ఆరంభమైంది. మదుపర్లు విపరీతంగా కొనుగోళ్లకు ఎగబడటంతో భారీ లాభాల్లో పయనిస్తోంది. 16,837 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకిన సూచీ 16,942 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం 235 పాయింట్ల లాభంతో 16,897 వద్ద కొనసాగుతోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంకు (Nifty Bank) 35,555 వద్ద మొదలైంది. 35,461 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 35,806 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం 644 పాయింట్ల లాభంతో 35,666 వద్ద కొనసాగుతోంది. ఏయూ బ్యాంక్ తప్ప మిగతా అన్ని బ్యాంకుల షేర్లు లాభాల్లో ఉన్నాయి.
Gainers and Lossers
నిఫ్టీలో 47 కంపెనీల షేర్లు లాభాల్లో 3 నష్టాల్లో ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫిన్ సర్వ్, అల్ట్రాటెక్ సెమ్ భారీ లాభాల్లో ఉన్నాయి. సిప్లా, టాటా కన్జూమర్, సన్‌ఫార్మా స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. అన్ని రంగాల సూచీలు ఆకుపచ్చ రంగులో కళకళలాడుతున్నాయి. ఆటో, బ్యాంక్, ఐటీ, మెటల్, పవర్ రియాల్టీ 1-2 శాతం మెరుగయ్యాయి.
16.03.2022
— BSE India (@BSEIndia) March 16, 2022
Pre-opening sensex update pic.twitter.com/Jkg8crTnEq
@bseindia reached a landmark of 10 crore (100 million) registered investor accounts. Congratulations India ! @PMOIndia @narendramodi @narendramodi_in @nsitharaman @FinMinIndia @SEBI_India @BSEStARMF @BSEInstitute pic.twitter.com/zLtHIjJAlU
— Ashish Chauhan (@ashishchauhan) March 16, 2022
Cash Deposits Rules: ప్రజలకు అలర్ట్! రేపట్నుంచి మారుతున్న నగదు డిపాజిట్ రూల్స్
Cryptocurrency Prices Today: బిట్‌కాయిన్ ఓకే! ఆ రెండో కాయిన్ మాత్రం భయపెడుతోంది!
Stock Market News: సూచీల నేల చూపులు! సెన్సెక్స్ 303, నిఫ్టీ 99 డౌన్ - ఫెడ్ మినిట్స్ కోసం వెయిటింగ్!
Top Gainer May 22, 2022 : స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్, నిఫ్టీ టాప్ గెయినర్స్
Top Loser Today May 22, 2022 స్టాక్ మార్కెట్ సెన్సెక్స్, నిఫ్టీ టాప్ లాసర్స్ జాబితా
Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి
Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Samudram Chittabbai: చక్కని విలేజ్ ప్రేమ కథ ‘సముద్రం చిట్టబ్బాయి’, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
Income Earners: నెలకు రూ.25వేలు జీతమా! కంగ్రాట్స్ - ఇండియా టాప్-10లో ఉన్నట్టే!