అన్వేషించండి

Stock Market Update: మార్కెట్లలో 'బడ్జెట్‌' కిక్కు! జీడీపీ అంచనాలతో రెచ్చిపోయిన బుల్స్‌!!

జీడీపీని 8-8.85% అంచనా వేయడం, బడ్జెట్లో ఆర్థిక వ్యవస్థకు లాభం చేకూర్చే చర్యలు ఉంటాయన్న సంకేతాలు, ఆసియా, ఐరోపా మార్కెట్లు మెరుగ్గా ఓపెనవ్వడంతో బెంచ్‌మార్క్‌ సూచీలు గరిష్ఠ స్థాయిల్లోనే కదలాడాయి.

బడ్జెట్‌ ముందు రోజు భారత స్టాక్‌ మార్కెట్లు కళకళలాడాయి. 2023 ఆర్థిక ఏడాదిలో జీడీపీని 8-8.85 శాతంగా అంచనా వేయడం, బడ్జెట్లో ఆర్థిక వ్యవస్థకు లాభం చేకూర్చే చర్యలు ఉంటాయన్న సంకేతాలు, ఆసియా, ఐరోపా మార్కెట్లు మెరుగ్గా ఓపెనవ్వడం ఇందుకు దోహదం చేశాయి. ఉదయం నుంచీ బెంచ్‌మార్క్‌ సూచీలు గరిష్ఠ స్థాయిల్లోనే కదలాడాయి.  ఒకానొక దశలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 900+, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 270+ వరకు లాభాల్లో ఉండటం గమనార్హం.

క్రితం రోజు 57,200 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 57,845 వద్ద భారీ గ్యాప్‌అప్‌తో మొదలైంది. వెంటనే 58,125 స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత ఇంట్రాడే కనిష్ఠమైన 57,746ను తాకిన సూచీ మళ్లీ పుంజుకొని 58,257 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకుంది. చివరకు 813 పాయింట్ల లాభంతో 58,014 వద్ద ముగిసింది.

శుక్రవారం 17,101 వద్ద ముగిసిన ఎన్ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 17,301 వద్ద గ్యాప్‌అప్‌తో ఆరంభమైంది. చూస్తుండగానే 17,380 స్థాయి అందుకుంది. 17,264 వద్ద కనిష్ఠాన్ని తాకినప్పటికీ కొనుగోళ్లు పుంజుకోవడంతో 17,410 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకొంది. మొత్తంగా 237 పాయింట్ల లాభంతో 17,339 వద్ద ముగిసింది.

నిఫ్టీ బ్యాంక్‌ మాత్రం ఒడుదొడుకుల మధ్య సాగింది. ఉదయం 38,091 వద్ద ఆరంభమైన సూచీ 38,217 వద్దకు ఎగిసింది.  గంటన్నరకే 37,647 వద్ద కనిష్ఠానికి చేరుకుంది. మళ్లీ అక్కడ మద్దతు తీసుకొంది. కొనుగోళ్లు పుంజుకోవడంతో 38,217 వద్ద ఇంట్రాడే గరిష్ఠ స్థాయికి చేరుకుంది. చివరికి 287 పాయింట్ల లాభంతో 37,975 వద్ద ముగిసింది.

నిఫ్టీలో 44 కంపెనీలు లాభాల్లో 6 నష్టాల్లో ముగిశాయి. టెక్‌ మహీంద్రా షేరు ఏకంగా 5.13 శాతం ఎగిసింది. టాటా మోటార్స్‌, విప్రో, బీపీసీఎల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ లాభపడ్డాయి. ఇండస్‌ ఇండ్‌బ్యాంక్‌, కొటక్‌ బ్యాంక్‌, కోల్‌ ఇండియా, యూపీఎల్‌, హింద్‌ యూనిలివర్‌ నష్టాల్లో ముగిశాయి. ఆటో, ఫార్మా, ఐటీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, పీఎస్‌యూ బ్యాంక్‌, రియాలిటీ రంగాల సూచీలు 1-3 శాతం వరకు లాభపడ్డాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

DCC Presidents In Telangana: తెలంగాణలో 33 జల్లాలకు డిసిసి అధ్యక్షుల నియామకం, 3 కార్పోరేషన్లకు సైతం
తెలంగాణలో 33 జల్లాలకు డిసిసి అధ్యక్షుల నియామకం, 3 కార్పోరేషన్లకు సైతం
Kuppam Nara Bhuvaneshwari: చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న నారా భువనేశ్వరి - కుప్పంలో మూడు రోజుల పాటు ప్రజలతో మమేకం !
చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న నారా భువనేశ్వరి - కుప్పంలో మూడు రోజుల పాటు ప్రజలతో మమేకం !
Amaravati farmers: త్వరలో అమరావతి గెజిట్ -  సమస్యలు 6 నెలల్లో పరిష్కరిస్తాం -  రైతులకు కేంద్రమంత్రి పెమ్మసాని హామీ
త్వరలో అమరావతి గెజిట్ - సమస్యలు 6 నెలల్లో పరిష్కరిస్తాం - రైతులకు కేంద్రమంత్రి పెమ్మసాని హామీ
Nagarjuna Akkineni: అన్నపూర్ణకు డిప్యూటీ సీఎం... తెలంగాణ అభివృద్ధికి నాగార్జున సాయం కోరిన బట్టి
అన్నపూర్ణకు డిప్యూటీ సీఎం... తెలంగాణ అభివృద్ధికి నాగార్జున సాయం కోరిన బట్టి
Advertisement

వీడియోలు

Why South Africa Bow down to PM Modi | వైరల్ గా మారిన ప్రధాని మోదీ ఆహ్వాన వేడుక | ABP Desam
India vs South Africa 2nd Test Match | రెండో టెస్ట్ నుంచి శుభమన్ గిల్ అవుట్
Australia Vs England 1st Test Ashes 2025 |  యాషెస్‌లో చెలరేగిన బౌలర్లు
Gambhir Warning to Team India | టీమిండియా ప్లేయర్లకు గంభీర్ వార్నింగ్ ?
Asia Cup Rising Stars 2025 | సెమీ ఫైనల్ లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
DCC Presidents In Telangana: తెలంగాణలో 33 జల్లాలకు డిసిసి అధ్యక్షుల నియామకం, 3 కార్పోరేషన్లకు సైతం
తెలంగాణలో 33 జల్లాలకు డిసిసి అధ్యక్షుల నియామకం, 3 కార్పోరేషన్లకు సైతం
Kuppam Nara Bhuvaneshwari: చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న నారా భువనేశ్వరి - కుప్పంలో మూడు రోజుల పాటు ప్రజలతో మమేకం !
చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న నారా భువనేశ్వరి - కుప్పంలో మూడు రోజుల పాటు ప్రజలతో మమేకం !
Amaravati farmers: త్వరలో అమరావతి గెజిట్ -  సమస్యలు 6 నెలల్లో పరిష్కరిస్తాం -  రైతులకు కేంద్రమంత్రి పెమ్మసాని హామీ
త్వరలో అమరావతి గెజిట్ - సమస్యలు 6 నెలల్లో పరిష్కరిస్తాం - రైతులకు కేంద్రమంత్రి పెమ్మసాని హామీ
Nagarjuna Akkineni: అన్నపూర్ణకు డిప్యూటీ సీఎం... తెలంగాణ అభివృద్ధికి నాగార్జున సాయం కోరిన బట్టి
అన్నపూర్ణకు డిప్యూటీ సీఎం... తెలంగాణ అభివృద్ధికి నాగార్జున సాయం కోరిన బట్టి
Defender Car Loan EMI Payment: డిఫెండర్ కారు కొనేందుకు 4 సంవత్సరాల లోన్ తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి.. మొత్తం ధర ఎంత
డిఫెండర్ కారు కొనేందుకు 4 సంవత్సరాల లోన్, EMI ఎంత చెల్లించాలి.. మొత్తం ధర ఎంత
Raju Weds Rambai Colletions : 'రాజు వెడ్స్ రాంబాయి' హిట్ బొమ్మ - ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా?
'రాజు వెడ్స్ రాంబాయి' హిట్ బొమ్మ - ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా?
Maoists surrender: మావోయిస్టులకు  మరో భారీ ఎదురుదెబ్బ - తెలంగాణ డీజీపీ ఎదుట 37 మంది లొంగుబాటు !
మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ - తెలంగాణ డీజీపీ ఎదుట 37 మంది లొంగుబాటు !
Delhi Crime News: పాకిస్తాన్ కుట్ర విఫలం! డ్రోన్లతో భారత్‌లోకి ఆయుధాలు స్మగ్లింగ్.. నలుగురి అరెస్టు
పాకిస్తాన్ కుట్ర విఫలం! డ్రోన్లతో భారత్‌లోకి ఆయుధాలు స్మగ్లింగ్.. నలుగురి అరెస్టు
Embed widget