X

Stock Market Update: 2 రోజుల్లో రూ.6.5 లక్షల కోట్లు పెరిగిన సంపద..! సెన్సెక్స్‌ 1000 +, నిఫ్టీ 293+

బెంచ్‌మార్క్‌ సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీ మరోసారి గరిష్ఠ స్థాయిలను అందుకున్నాయి. మంగళ, బుధవారాల్లో మార్కెట్లు పుంజుకోవడంతో ఇన్వెస్టర్ల సంపద రూ.6.5 లక్షల కోట్లు పెరిగింది.

FOLLOW US: 

వరుసగా రెండో రోజు 'బుల్‌' రంకెలు వేసింది! రిజర్వు బ్యాంకు కీలక వడ్డీరేట్లలో మార్పు చేయకపోవడం, ఒమిక్రాన్‌ భయం తగ్గడం, జీడీపీ వృద్ధిపై ఆశలతో భారత స్టాక్‌ మార్కెట్లు బుధవారం పైపైకి పరుగులు తీశాయి. మదుపర్లకు సంపదను పంచిపెట్టాయి. బెంచ్‌మార్క్‌ సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీ మరోసారి గరిష్ఠ స్థాయిలను అందుకున్నాయి. మంగళ, బుధవారాల్లో మార్కెట్లు పుంజుకోవడంతో ఇన్వెస్టర్ల సంపద రూ.6.5 లక్షల కోట్లు పెరిగింది.

క్రితం రోజు 57,663 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు భారీ గ్యాప్‌అప్‌తో 58,158 వద్ద ఆరంభమైంది. అక్కడి నుంచి మదుపర్లు కొనుగోళ్లకు దిగడంతో సూచీ పైపైకి పరుగులు తీసింది. 58,702 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. చివరికి 1016 పాయింట్ల లాభంతో 58,649 వద్ద ముగిసింది.

నిన్న 17,176 వద్ద మొదలైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ నేడు 17,315 వద్ద ఆరంభమైంది. 17,308 వద్ద కనిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత 17,484 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకొని చివరికి 293 పాయింట్ల లాభంతో 17,469 వద్ద ముగిసింది.

బ్యాంకు నిఫ్టీలో కొటక్‌ బ్యాంకు మినహా మిగతావన్నీ రాణించాయి. దాంతో 37,052 వద్ద సూచీ ఆరంభమైంది. కొద్దిసేపు ఒడుదొడులకు లోనైన సూచీ 36,905 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత పుంజుకొని 37,384 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకొని చివరికి 666 పాయింట్ల లాభంతో 37,284 వద్ద ముగిసింది.

నిఫ్టీలో బజాజ్‌ ఫైనాన్స్‌, మారుతీ సుజుకి, హిందాల్కో, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ లాభాల్లో ముగిశాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, కొటక్‌ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, దివిస్ ల్యాబ్‌, ఐఓసీ నష్టపోయాయి. నిఫ్టీ ఆటో, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్‌ రెండు శాతానికి పైగా పెరగ్గా మిగతావన్నీ లాభాల్లోనే ముగిశాయి.

Also Read: IPOs This Week: డబ్బుల వర్షమే..! ఈ వారం ఐపీవోకు 4 కంపెనీలు ..! వివరాలు ఇవే

Also Read: EPF Interest Credit: ఈపీఎఫ్‌వో 8.5% వడ్డీ చెల్లించింది.. మీకు ఎంతొచ్చిందో ఇలా చెక్‌ చేసుకోండి!

Also Read: Airtel vs Jio vs VI Plans: జియో, ఎయిర్‌టెల్‌, విలో ఏ ప్లాన్‌కు ఎలాంటి బెనిఫిట్స్‌ ఉన్నాయంటే!

Also Read: Corporate FD Rates: బ్యాంకుల కన్నా ఎక్కువ వడ్డీ వస్తున్న ఎఫ్‌డీలివి! కాస్త ఎక్కువ రాబడే..!

Also Read: RBI Monetary Policy: కీలక వడ్డీ రేట్లు యథాతథం.. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడి

Also Read: 2000 Note : రూ. 2 వేల నోటు త్వరలోనే కనుమరుగు ! ఎవరికీ తెలియకుండానే కేంద్రం ఉపసంహరించుకుంటోందా ?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: rbi sensex Nifty Stock Market Update Closing Bell Bank nifty

సంబంధిత కథనాలు

Petrol-Diesel Price 29 January 2022: వాహనదారులకు స్వల్ప ఊరట.. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. అక్కడ భారీగా పెరిగింది.. లేటెస్ట్ రేట్లు ఇవీ

Petrol-Diesel Price 29 January 2022: వాహనదారులకు స్వల్ప ఊరట.. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. అక్కడ భారీగా పెరిగింది.. లేటెస్ట్ రేట్లు ఇవీ

Gold Silver Price Today: గుడ్ న్యూస్.. భారీగా పతనమైన బంగారం ధర, రూ.1400 మేర దిగొచ్చిన వెండి.. లేటెస్ట్ రేట్లు ఇవీ

Gold Silver Price Today: గుడ్ న్యూస్.. భారీగా పతనమైన బంగారం ధర, రూ.1400 మేర దిగొచ్చిన వెండి.. లేటెస్ట్ రేట్లు ఇవీ

Budget 2022 Traditions: ఈ సారి బడ్జెట్‌ హల్వా లేదండోయ్‌! మారుతున్న సంప్రదాయాలు!!

Budget 2022 Traditions: ఈ సారి బడ్జెట్‌ హల్వా లేదండోయ్‌! మారుతున్న సంప్రదాయాలు!!

Metaverse Meaning: మెటావర్స్.. ఓ మాయా ప్రపంచం.. సింపుల్‌గా చెప్పాలంటే వర్చువల్ జిందగీ!

Metaverse Meaning: మెటావర్స్.. ఓ మాయా ప్రపంచం.. సింపుల్‌గా చెప్పాలంటే వర్చువల్ జిందగీ!

Stock Market Update: ఆరంభ లాభాలు ఆవిరి! సెన్సెక్స్‌ ఉదయం 800+, సాయంత్రం -76

Stock Market Update: ఆరంభ లాభాలు ఆవిరి! సెన్సెక్స్‌ ఉదయం 800+, సాయంత్రం -76
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

NTR & Allu Arjun: ఎన్టీఆర్ 30 ఓపెనింగ్‌కు అతిథిగా అల్లు అర్జున్!

NTR & Allu Arjun: ఎన్టీఆర్ 30 ఓపెనింగ్‌కు అతిథిగా అల్లు అర్జున్!

Ratha Sapthami 2022: ఏడు జన్మల పాపాలు, ఏడు రకాలైన వ్యాధులు నశించాలంటే రథసప్తమి ఇలా చేయాలట….

Ratha Sapthami 2022: ఏడు జన్మల పాపాలు, ఏడు రకాలైన వ్యాధులు నశించాలంటే రథసప్తమి ఇలా  చేయాలట….

First Newspaper in India: దేశంలో మొట్టమొదటి న్యూస్ పేపర్ ఎలా పుట్టిందో తెలుసా.. ధర చాలా ఎక్కువే

First Newspaper in India: దేశంలో మొట్టమొదటి న్యూస్ పేపర్ ఎలా పుట్టిందో తెలుసా.. ధర చాలా ఎక్కువే

Malavika Mohanan: బికినీలు... బీచ్‌లు... సరదాలు... మాళవిక కొత్త ఫొటోలు!

Malavika Mohanan: బికినీలు... బీచ్‌లు... సరదాలు... మాళవిక కొత్త ఫొటోలు!