అన్వేషించండి

Stock Market update: సెన్సెక్స్‌, నిఫ్టీ వరుసగా పతనం..! కారణాలేంటంటే?

వరుసగా మూడో రోజు భారత స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి. యూఎస్‌ ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపు, ద్రవ్యోల్బణం పెరుగుదల, సెంటిమెంట్‌ బలహీనంగా ఉండటంతో మదుపర్లు విక్రయాలకు దిగారు.

భారత స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో సెషన్‌ నష్టాల్లోనే ముగిశాయి. గురువారం సూచీలకు అమ్మకాల సెగ తగిలింది. దాంతో పాటు పేటీఎం ఐపీవో హిట్టవ్వలేదు. 9 శాతం డిస్కౌంట్‌తో ఆ కంపెనీ షేర్లు నమోదయ్యాయి. అంతర్జాతీయంగా సెంటిమెంట్‌ బలహీనంగా ఉండటం, ద్రవ్యోల్బణం భయాలు, యూఎస్‌ ఫెడ్‌ రేట్ల పెంపు వంటివి మదుపర్లపై ప్రభావం చూపించాయి. దాంతో ఉదయం ఫ్లాట్‌గా ఆరంభమైన సూచీలు భారీగా పతనం అయ్యాయి.

క్రితం రోజు 60,008 వద్ద ముగిసిన బీఎస్‌ఈ నేడు 59,968 వద్ద ఆరంభమైంది. 60,177 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత మదుపర్లు విక్రయాలు చేపట్టడంతో ఇంట్రాడే కనిష్ఠమైన 59,423ను తాకింది. చివరికి 372 పాయింట్ల నష్టంతో 59,636 వద్ద ముగిసింది. క్రితం రోజు 17,898 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ నేటి ఉదయం 17,890 వద్ద మొదలైంది. 17,688 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత కాస్త కోలుకొని 133 పాయింట్ల నష్టంతో 17,764 వద్ద ముగిసింది.

నష్టాలకు కారణాలు

  • ఎస్‌బీఐ, పవర్‌ గ్రిడ్‌ కార్ప్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐఓసీ, దివిస్‌ ల్యాబ్‌ లాభపడగా టాటా మోటార్స్, టెక్‌ మహీంద్రా, ఎం అండ్‌ ఎం, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఎల్‌ అండ్‌ టీ నష్టాల్లో ముగిశాయి.
  • గృహ నిర్మాణ డేటా విడుదల కావడంతో అమెరికా మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. ముడి పదార్థాల ధరలు పెరగడం, తగినంత మంది కార్మికులు లేకపోవడంతో నిర్మాణాలు మందకొడిగా సాగుతున్నాయి. పైగా యూరోజోన్‌లో ద్రవ్యోల్బణం ప్రకంపనల ప్రభావం ఆసియా మార్కెట్లపై పడింది. జపాన్‌ నిక్కీ, హాంగ్‌సెంగ్‌ పతనం అయ్యాయి. భారత మార్కెట్లపై దీని ప్రభావం ఉంది.
  • యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్లు పెంచుతుందన్న అంచనాలు ఇంకా ఇన్వెస్టర్ల మనసుల్లోనే ఉన్నాయి. దాంతో సురక్షితమైన ప్రభుత్వ బాండ్లు, బంగారం, యెన్‌పై మదుపర్లులు పెట్టుబడులు పెట్టారు.
  • బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో దాదాపు అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి. నిఫ్టీ ఆటో సూచీ 3 కన్నా ఎక్కువ శాతమే నష్టపోయింది. బీఎస్‌ఈ మెటల్‌, నిఫ్టీ ఐటీ రెండుకు పైగా నేలచూపులు చూశాయి

Also Read: Cryptocurrency: క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత.. బిల్లు పెట్టనున్న కేంద్ర ప్రభుత్వం! మరి ఆర్థిక లావాదేవీలు చెల్లుతాయా?

Also Read: Government Deposit Scheme: నెలకు రూ.12,500 పెట్టుబడి పెడితే రూ.కోటి మీ సొంతం.. ఏంటా పథకం?

Also Read: New Hyundai Creta: హ్యుండాయ్ క్రెటా కొత్త వేరియంట్.. అదిరిపోయే డిజైన్.. ఎలా ఉందంటే?

Also Read: EPFO Equity Investment: స్టాక్‌మార్కెట్లో ఈపీఎఫ్‌వో లాభాల పంట.. రూ.40,000 కోట్ల రాబడి

Also Read: Petrol-Diesel Price, 18 November: వాహనదారులకు ఊరట.. ఇక్కడ స్థిరంగా ఇంధన ధరలు.. ఈ నగరాల్లో మాత్రం పెరుగుదల

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR : కేటీఆర్‌కు హైకోర్టులో రిలీఫ్ - లాయర్‌ను ఏసీబీ ఆఫీసుకు తీసుకెళ్లేందుకు అనుమతి - కానీ ..
కేటీఆర్‌కు హైకోర్టులో రిలీఫ్ - లాయర్‌ను ఏసీబీ ఆఫీసుకు తీసుకెళ్లేందుకు అనుమతి - కానీ ..
AP Inter Exams 2025: ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం, ఫస్టియర్ పరీక్షలు తొలగింపు - ఇక వారికి నో టెన్షన్
ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం, ఫస్టియర్ పరీక్షలు తొలగింపు - ఇక వారికి నో టెన్షన్
KTR News: కేటీఆర్‌పై వరుస కేసులు, బీఆర్ఎస్ అగ్రనేతపై ఏసీబీకి మరో ఫిర్యాదు
కేటీఆర్‌పై వరుస కేసులు, బీఆర్ఎస్ అగ్రనేతపై ఏసీబీకి మరో ఫిర్యాదు - అసలేం జరుగుతోంది?
HMPV tests cost: హెచ్ఎంపీవీ వైరస్ టెస్టులకు ఎంత ఖర్చు అవుతుంది ? ఎలాంటి ట్రీట్‌మెంట్ అందుబాటులో ఉంది ?
హెచ్ఎంపీవీ వైరస్ టెస్టులకు ఎంత ఖర్చు అవుతుంది ? ఎలాంటి ట్రీట్‌మెంట్ అందుబాటులో ఉంది ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Indias Largest Green Hydrogen Project | దేశంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ విశాఖలో | ABP DesamAjith Kumar Racing Car Crashes | రేసింగ్ ప్రాక్టీస్ లో అజిత్ కు ఘోర ప్రమాదం | ABP DesamKTR Quash Petition Dismissed | కేటీఆర్ క్వాష్ పిటీషన్ ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు | ABP DesamAllu Arjun met Sri Tej | శ్రీతేజ్ ను ఆసుపత్రిలో పరామర్శించిన అల్లు అర్జున్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR : కేటీఆర్‌కు హైకోర్టులో రిలీఫ్ - లాయర్‌ను ఏసీబీ ఆఫీసుకు తీసుకెళ్లేందుకు అనుమతి - కానీ ..
కేటీఆర్‌కు హైకోర్టులో రిలీఫ్ - లాయర్‌ను ఏసీబీ ఆఫీసుకు తీసుకెళ్లేందుకు అనుమతి - కానీ ..
AP Inter Exams 2025: ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం, ఫస్టియర్ పరీక్షలు తొలగింపు - ఇక వారికి నో టెన్షన్
ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం, ఫస్టియర్ పరీక్షలు తొలగింపు - ఇక వారికి నో టెన్షన్
KTR News: కేటీఆర్‌పై వరుస కేసులు, బీఆర్ఎస్ అగ్రనేతపై ఏసీబీకి మరో ఫిర్యాదు
కేటీఆర్‌పై వరుస కేసులు, బీఆర్ఎస్ అగ్రనేతపై ఏసీబీకి మరో ఫిర్యాదు - అసలేం జరుగుతోంది?
HMPV tests cost: హెచ్ఎంపీవీ వైరస్ టెస్టులకు ఎంత ఖర్చు అవుతుంది ? ఎలాంటి ట్రీట్‌మెంట్ అందుబాటులో ఉంది ?
హెచ్ఎంపీవీ వైరస్ టెస్టులకు ఎంత ఖర్చు అవుతుంది ? ఎలాంటి ట్రీట్‌మెంట్ అందుబాటులో ఉంది ?
Nara Lokesh On PM Modi Tour: ప్రధాని మోదీ ఏపీకి రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఇస్తున్నారు: నారా లోకేశ్
ప్రధాని మోదీ ఏపీకి రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఇస్తున్నారు: నారా లోకేశ్
Telangana News: తెలంగాణలో మందుబాబులకు బిగ్‌షాక్‌- కింగ్‌ఫిషర్ సరఫరా నిలిపివేత
తెలంగాణలో మందుబాబులకు బిగ్‌షాక్‌- కింగ్‌ఫిషర్ సరఫరా నిలిపివేత
HDFC Bank: మీరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో లోన్‌ తీసుకున్నారా?, మీ EMI తగ్గింది చూసుకున్నారా?
మీరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో లోన్‌ తీసుకున్నారా?, మీ EMI తగ్గింది చూసుకున్నారా?
ISRO Chairman : ఇస్రో కొత్త ఛైర్మన్ గా వి. నారాయణన్ - జనవరి 14 నుంచి రెండేళ్ల వరకు ఆయనే
ఇస్రో కొత్త ఛైర్మన్ గా వి. నారాయణన్ - జనవరి 14 నుంచి రెండేళ్ల వరకు ఆయనే
Embed widget