By: ABP Desam | Updated at : 21 Dec 2021 04:20 PM (IST)
Edited By: Ramakrishna Paladi
share bazar
రెండు రోజుల నష్టాల నుంచి స్టాక్ మార్కెట్లు కాస్త తేరుకున్నాయి. ఆసియా మార్కెట్లు లాభాల్లో మొదలవ్వడం, సెంటిమెంటు బాగుండటం, మదుపర్లు తిరిగి కొనుగోళ్లు చేపట్టడంతో సెన్సెక్స్ 497, నిఫ్టీ 156 పాయింట్లు లాభపడ్డాయి. మిగతా సూచీలూ సానుకూలంగానే ట్రేడ్ అయ్యాయి.
క్రితం రోజు 55,822 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 56,320 వద్ద మొదలైంది. గ్యాప్‌అప్‌తో ఆరంభమైన సూచీ ఒకానొక దశలో ఇంట్రాడే గరిష్ఠమైన 56,900ను తాకింది. ఆ తర్వాత 56,047 వద్ద కనిష్ఠానికి పడిపోయి చివరికి 497 పాయింట్ల లాభంతో 56,319 వద్ద ముగిసింది.
సోమవారం 16,614 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ నేడు 16,773 వద్ద ఆరంభమైంది. మదుపర్లు కొనుగోళ్లకు దిగడంతో 16,936 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకొంది. ఆ తర్వాత 16,688 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ 156 పాయింట్ల లాభంతో 16,770 వద్ద ముగిసింది.
బ్యాంకు నిఫ్టీలో 7 కంపెనీలు లాభాల్లో 5 కంపెనీలు నష్టాల్లో ముగిశాయి. ఉదయం 34,863 వద్ద మొదలైన సూచీ 35,050 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. అట్నుంచి 34,389 వద్ద కనిష్ఠాన్ని తాకి చివరికి 168 పాయింట్ల లాభంతో 34,607 వద్ద ముగిసింది.
నిఫ్టీలో 39 కంపెనీలు లాభపడగా 11 నష్టపోయాయి. హెచ్‌సీఎల్ టెక్, విప్రో, యూపీఎల్, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్ లాభపడ్డాయి. పవర్‌గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టాటా కన్జూమర్స్, సిప్లా నష్టాల్లో ముగిశాయి. అన్ని రంగాల సూచీలూ నేడు సానుకూలంగానే ముగిశాయి. రియాలిటీ, క్యాపిటల్ గూడ్స్, ఫార్మా, ఎనర్జీ, ఐటీ, మెటల్ 1-3 శాతం పెరిగాయి.
స్టాక్ మార్కెట్లో ఈ రోజు లిస్టైన సీఈ ఇన్ఫో మ్యాప్‌మైఇండియా లిమిటెడ్ సూపర్ హిట్టైంది. రూ.360 లాభంతో రూ.1393 వద్ద ముగిసింది. ఒకానొక దశలో రూ.1590 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకొంది.
Also Read: Life Insurance Plan Tips: ఏ ఇన్సూరెన్స్ తీసుకోవాలో తికమక పడుతున్నారా? ఈ 4 స్టెప్స్ చూడండి మరి!
Also Read: SBI FD Rates: గుడ్‌న్యూస్..! ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేటు పెంచిన ఎస్‌బీఐ
Also Read: New Online Payment Rules: జనవరి 1 నుంచి ఆన్‌లైన్ పేమెంట్ నిబంధనల్లో మార్పు.. తెలియకపోతే కష్టం!
Also Read: Multibagger stock: ఐదేళ్లు: ఈ షేరులో లక్షకు రూ.5 లక్షల లాభం!
Also Read: Stock Market: రూ.2,61,812 కోట్లు పతనమైన టాప్-10 కంపెనీల మార్కెట్ విలువ
Radhakishan Damani: స్టాక్ మార్కెట్ పతనం - డీమార్ట్ ఓనర్‌కు రూ.50వేల కోట్ల నష్టం!
Stock Market News: వరుసగా రెండో వీకెండ్ లాభాలే లాభాలు! సెన్సెక్స్ 632+, నిఫ్టీ 182+
Cryptocurrency Prices: బిట్‌కాయిన్ కాస్త నయం! ఎథీరియమ్ అల్ల కల్లోలం!
Stock Market News: బలపడ్డ రూపాయి.. భారీ లాభాల్లో ఓపెనైన సెన్సెక్స్, నిఫ్టీ
Petrol-Diesel Price, 27 May: పెట్రోల్, డీజిల్ ధరల్లో కొనసాగుతున్న హెచ్చుతగ్గులు - నేడు ఈ నగరాల్లో పెరుగుదల
F3 Movie Review - 'ఎఫ్ 3' రివ్యూ: వెంకటేష్, వరుణ్ తేజ్ నవ్వించారా? ఫ్రస్ట్రేషన్ తెప్పించారా?
Nikhat Zareen : హైదరాబాద్ కు నిఖత్ జరీన్, శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం
Anna Hazare President Candidate KCR Plan: రాష్ట్రపతి అభ్యర్థిగా అన్నా హజారే ! కేసీఆర్ చెబుతున్న సంచలనం అదేనా ?
Honor Killing In Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో దారుణం- మతాంతర వివాహం చేసుకుందని కుమార్తె గొంతు కోసి హత్య చేసిన తండ్రి