By: ABP Desam | Updated at : 28 Dec 2021 04:15 PM (IST)
stock_market_update
భారత స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో సెషన్లో సానుకూలంగా ముగిశాయి. బెంచ్‌మార్క్ సూచీలు లాభాల్లోనే ముగిశాయి. ఐటీ, ఆటో, క్యాపిటల్ గూడ్స్ సూచీలు లాభపడ్డాయి. సెన్సెక్స్ 477 పాయింట్లు లాభపడగా నిఫ్టీ 17,233 వద్ద ముగిసింది.
క్రితం రోజు 57,420 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 57,751 వద్ద మొదలైంది. ఆ తర్వాత 57,952 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. 57,650 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి పడిపోయిన సూచీ చివరికి 477 పాయింట్ల లాభంతో 57,897 వద్ద ముగిసింది.
సోమవారం 17,086 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 17,177 వద్ద ఆరంభమైంది. కొనుగోళ్లు పుంజుకోవడంతో 17,250 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆ తర్వాత 17,161 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని అందుకున్న సూచీ 147 పాయింట్ల లాభంతో 17,233 వద్ద ముగిసింది.
బ్యాంకు నిఫ్టీ మాత్రం కాస్త ఒడుదొడులకు లోనైంది. ఉదయం 35,308 వద్ద ఆరంభమైన సూచీ 35,352 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. 35,037 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ చివరికి 125 పాయింట్ల లాభంతో 35,183 వద్ద ముగిసింది.
నిఫ్టీలో సన్‌ఫార్మా, ఆసియన్ పెయింట్స్, ఎం అండ్ ఎం, అల్ట్రాసెమ్, ఎన్‌టీపీసీ లాభపడ్డాయి. పవర్ గ్రిడ్, ఇండస్ ఇండ్ బ్యాంక్ స్వల్పంగా నష్టపోయాయి. నిఫ్టీ 50లో 48 కంపెనీలు లాభపడ్డాయి. ఈ రోజే మార్కెట్లలో సుప్రియా లైఫ్ సైన్స్ 55 ప్రీమియంతో రూ.425 వద్ద నమోదైంది. చివరికి 389 వద్ద ముగిసింది.
Also Read: 28 Days Validity: అమ్మో.. 28 రోజుల వ్యాలిడిటీ వెనుక ఇంత కథా.. రూ.వేల కోట్ల ఆదాయం!
Also Read: Four Day Work Week: 4 రోజులే పని.. పెరగనున్న బేసిక్ పే.. మారనున్న సాలరీ స్ట్రక్చర్!
Also Read: Cyber Crime: మీ మొబైల్ ఫోన్ సేఫేనా! పూర్తి వివరాలు కోసం క్లిక్ చేయండి
Also Read: డ్రగ్స్ కేసు భయంతో యువనటి ఆత్మహత్య.. అధికారులు డబ్బులు డిమాండ్ చేయడంతో దారుణం.. చివర్లో ట్విస్ట్
Rs 2,000 Exchange Deadline: రూ. 2000 నోట్లు మార్చుకోలేదా, అయితే మీకు RBI శుభవార్త - చివరి తేదీ ఇదే
Bank Locker Rule: లాకర్‌లో దాచిన ఆస్తి మొత్తానికి బ్యాంక్ బాధ్యత ఉండదు, కొత్త రూల్స్ గురించి తెలుసుకోండి
Latest Gold-Silver Price 30 September 2023: పసిడి పతనం కంటిన్యూస్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Rs 2000 Notes: రూ.2 వేల నోట్లను మార్చుకోవడానికి ఈ రోజే లాస్ట్ డేట్, ఈ గడువు పొడిగిస్తారా?
Petrol-Diesel Price 30 September 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
Vasireddy Padma : ఆ టీడీపీ నేతను అరెస్ట్ చేయండి - డీజీపీకి వాసిరెడ్డి పద్మ లేఖ !
Esha Gupta Casting Couch : ట్రాప్ చేయాలని చూశారు, మేకప్ ఆర్టిస్ట్‌ను నా రూమ్‌కు పిలిచి నిద్రపోయా
బీజేపీ వైఖరి నచ్చకే NDA నుంచి బయటకు వచ్చేశాం, AIDMK నేత కీలక వ్యాఖ్యలు
Shri Lakshmi Satish Photos: RGV కంట్లో పడిన బ్యూటిఫుల్ లేడీ ఎవరో తెలుసా!
/body>