అన్వేషించండి

Buyback Action: ప్రస్తుతం ఓపెన్‌లో ఉన్న 5 బైబ్యాక్‌ ఆఫర్‌లు, వీటిలో ఏ కంపెనీ షేర్లు మీ దగ్గర ఉన్నాయి?

సాధారణంగా షేర్‌ బైబ్యాక్ ఒక పాజిటివ్‌ ట్రిగ్గర్‌లా పని చేస్తుంది, షేర్‌ ధరను పెంచుతుంది.

Buyback Action: షేర్ బైబ్యాక్ ‍‌(share buyback) అనేది ఒక కార్పొరేట్ యాక్షన్‌. ఓపెన్‌ మార్కెట్‌లో ఫ్లోటింగ్‌లో ఉన్న సొంత షేర్ల సంఖ్యను తగ్గించడానికి ఒక కంపెనీ చేపట్టే చర్య ఇది. కంపెనీ మీద షేర్‌హోల్డర్లలో నమ్మకం పెంచడానికి కూడా బైబ్యాక్ ప్రకటించవచ్చు. లేదా, కంపెనీలో తమ బలం పెంచుకోవడానికి ప్రమోటర్లు బైబ్యాక్ ఆఫర్‌ తీసుకురావచ్చు. కారణం ఏదైనా, సాధారణంగా షేర్‌ బైబ్యాక్ ఒక పాజిటివ్‌ ట్రిగ్గర్‌లా పని చేస్తుంది, షేర్‌ ధరను పెంచుతుంది. బైబ్యాక్ తర్వాత, ఓపెన్‌ మార్కెట్‌లో ఉన్న ఆ కంపెనీ షేర్ల సంఖ్య (సప్లై) తగ్గి, ఆటోమేటిక్‌గా వాటికి డిమాండ్‌ పెరుగుతుంది.

ప్రస్తుతం ఓపెన్‌లో ఉన్న బైబ్యాక్ స్కీమ్‌ల లిస్ట్‌ ఇది:

ఇండియామార్ట్ ఇంటర్‌మేష్ (Indiamart Intermesh)
ఇండియామార్ట్ ఇంటర్‌మేష్ బైబ్యాక్ గత నెల (ఆగష్టు) 31న ప్రారంభమైంది, ఈ నెల (సెప్టెంబర్) 6వ తేదీ వరకు ఓపెన్‌లో ఉంటుంది. బైబ్యాక్ సైజ్‌ రూ. 500 కోట్లు. అంటే, 500 కోట్ల రూపాయల బడ్జెట్‌కు మించకుండా, ఎన్ని షేర్లు వస్తే అన్ని షేర్లను కంపెనీ కొంటుంది. ఒక్కో షేరుకు బైబ్యాక్ ప్రైస్‌గా రూ. 4,000ను కంపెనీ నిర్ణయించింది. ఒక్కో షేర్‌ను 4 వేల రూపాయలకు మించకుండా షేర్‌ హోల్డర్ల నుంచి తీసుకుంటుంది. ఇవాళ (శుక్రవారం, 01 సెప్టెంబర్‌ 2023) మధ్యాహ్నం 2.30 గంటల సమయానికి ఇండియామార్ట్ ఇంటర్‌మేష్ షేర్‌ ధర 1.24% పెరిగి రూ. 3,099 వద్ద కదులుతోంది.

ఎఫ్‌డీసీ (FDC)
ఫార్మాస్యూటికల్స్ కంపెనీ FDC బైబ్యాక్ ఆఫర్‌ కూడా ఆగస్ట్ 31న స్టార్ట్‌ అయింది, సెప్టెంబర్ 6న క్లోజ్‌ అవుతుంది. ఈ కంపెనీ ప్రకటించిన బైబ్యాక్ పరిమాణం రూ. 155 కోట్లు. బైబ్యాక్ ధర ఒక్కో షేరుకు రూ. 500గా కంపెనీ నిర్ణయించింది. ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటల సమయానికి FDC షేర్‌ ప్రైస్‌ 0.14% తగ్గి రూ. 380 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

కేఆర్‌బీఎల్‌ (KRBL)
రైస్ ప్రాసెసింగ్, ఎగుమతి చేసే కంపెనీ KRBL బైబ్యాక్ స్కీమ్‌ ఆగస్టు 31, 2023న ప్రారంభమైంది, సెప్టెంబర్ 6, 2023న ముగుస్తుంది. బైబ్యాక్ కోసం రూ. 325 కోట్ల బడ్జెడట్‌ను కంపెనీ కేటాయించింది. ఒక్కో షేరును రూ. 500కు మించకుండా కొనడానికి డెసిషన్‌ తీసుకుంది. ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటల సమయానికి KRBL స్టాక్‌ 0.31% నష్టంతో రూ. 401.35 వద్ద ఉంది.

పిరమాల్ ఎంటర్‌ప్రైజెస్ ‍‌(Piramal Enterprises)
నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ (NBFC) అయిన పిరమాల్ ఎంటర్‌ప్రైజెస్ బైబ్యాక్ కూడా ఆగస్ట్ 31న ఓపెన్‌ అయింది, సెప్టెంబర్ 6న క్లోజ్‌ అవుతుంది. బైబ్యాక్ కోసం రూ. 1,750 కోట్లను కంపెనీ కేటాయించింది. బైబ్యాక్ కింద ధర ఒక్కో షేరు ధరను రూ. 1,250గా నిర్ణయించింది. ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటల సమయానికి పిరమాల్ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు 3.02% లాభంతో రూ. 1,085.15 వద్ద ఉన్నాయి.

సీఎల్‌ ఎడ్యుకేట్ (CL Educate)
ఈ కంపెనీ బైబ్యాక్ స్కీమ్‌ ఆగస్టు 21న ప్రారంభమైంది. ఈ ఆఫర్‌ సుదీర్ఘంగా సాగి నవంబర్ 28న క్లోజ్‌ అవుతుంది. బైబ్యాక్ సైజ్‌ కేవలం రూ. 15 కోట్లు. బైబ్యాక్ ధరగా ఒక్కో షేరుకు రూ. 94ను కంపెనీ డిసైడ్‌ చేసింది. ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటల సమయానికి CL ఎడ్యుకేట్ షేర్లు 0.45% గ్రీన్‌ కలర్‌తో రూ. 78.65 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: G20, క్రికెట్ ప్రపంచ కప్, మిస్ వరల్డ్ పోటీలు - పండగ చేసుకుంటున్న హోటల్‌ స్టాక్స్‌

Join Us on Telegram: https://t.me/abpdesamofficial 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
Game Changer Dhop Song: రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్.. డీప్‌గా ఎక్కేస్తోన్న డోప్.. అస్సలు దిగట్లే!
రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్‌తో డీప్‌గా ఎక్కేస్తోన్న ‘గేమ్ చేంజర్’ డోప్.. అస్సలు దిగట్లే!
Sri Simha Koduri : పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Embed widget