Hotel Stocks: G20, క్రికెట్ ప్రపంచ కప్, మిస్ వరల్డ్ పోటీలు - పండగ చేసుకుంటున్న హోటల్ స్టాక్స్
బుల్స్ ముందస్తుగానే హోటల్ స్టాక్స్‌లోకి చెక్-ఇన్ అవుతున్నాయి.
Hotel Stocks: 2023లో మిగిలిన ఈ నాలుగు నెలల్లో, ప్రపంచం మొత్తం ఇండియా టూర్‌కు వస్తోంది. ఈ నెలలో G20 సమ్మిట్; అక్టోబర్, నవంబర్ నెలల్లో ICC క్రికెట్ ప్రపంచ కప్, డిసెంబర్‌లో మిస్ వరల్డ్ పోటీలు ఉన్నాయి. అతిథుల కోసం ఇప్పటికే హోటల్ రూమ్స్ బుక్ అయిపోయాయి. ఈ హై-ప్రొఫైల్ గ్లోబల్ ఈవెంట్‌లతో హోటళ్ల ఆదాయం పెరుగుతుంది కాబట్టి, హోటల్ స్టాక్స్‌కు కొంత కాలం నుంచి డిమాండ్ పెరిగింది. బుల్స్ ముందస్తుగానే హోటల్ స్టాక్స్‌లోకి చెక్-ఇన్ అవుతున్నాయి.
G20 సమ్మిట్‌కు హాజరయ్యేందుకు వస్తున్న సౌదీ అరేబియా ప్రతినిధి బృందానికి గురుగావ్‌లోని లీలా హోటల్ ఆతిథ్యం ఇవ్వనుందన్న రిపోర్ట్స్‌తో, ది లీలా లగ్జరీ హోటల్ చైన్‌ను హోల్డ్ చేస్తున్న స్మాల్ క్యాప్ హోటల్ స్టాక్ HLV, గురువారం (31 ఆగస్టు 2023) రోజు 20% పెరిగి 52 వారాల గరిష్ట స్థాయి రూ.16.26కి చేరుకుంది.
తాజ్, వివంత, జింజర్ వంటి బ్రాండ్స్‌తో బిజినెస్ చేస్తున్న భారతదేశపు అతి పెద్ద హాస్పిటాలిటీ గ్రూప్ ఇండియన్ హోటల్స్ (IHCL) షేర్లు గత 6 నెలల్లో 35% పెరిగి కొత్త రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అదేవిధంగా, ఒబెరాయ్ గ్రూప్‌నకు చెందిన ఫ్లాగ్ షిప్ కంపెనీ అయిన EIH, చాలెట్ హోటల్స్, లెమన్ ట్రీ హోటల్స్ కూడా గురువారం తాజా గరిష్టాలను తాకాయి.
సాధారణంగా, రుతుపవనాల ప్రభావం కారణంగా, Q2 సీజన్ హాస్పిటాలిటీ రంగానికి అత్యంత బలహీనమైన త్రైమాసికంగా ఉంటుంది. అయితే, ఈ నెల 9, 10 తేదీల్లో న్యూదిల్లీలో జరగనున్న 18వ G20 సమ్మిట్‌తో దిల్లీ, NCR ప్రాంతంలోని హోటళ్లలో ఫుల్ జోష్ కనిపిస్తోంది. నేషనల్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం, ఈ ఈవెంట్ జరిగే తేదీల్లో టాప్ లగ్జరీ హోటళ్లలో రూమ్ రెంట్ ఒక రాత్రికి సగటున రూ. 40,000గా ఉంది.
భారతదేశం G20 ప్రెసిడెన్సీ, హాస్పిటాలిటీ రంగంలోని ప్లేయర్లకు రూ. 850 కోట్ల ఆదాయ అవకాశంగా మారింది. G20 ప్రెసిడెన్సీ కింద, మన దేశం, దేశవ్యాప్తంగా 59 వేర్వేరు ప్రాంతాల్లో 200 సమావేశాలకు ఆతిథ్యం ఇస్తోంది, 20 దేశాల నుంచి 1.5 లక్షల మంది ప్రతినిధులు పాల్గొంటారని అంచనా.
హోటల్ స్టాక్స్ పెర్ఫార్మెన్స్:
IHCL --- గత వారం రోజుల్లో 6% --- గత నెల రోజుల్లో 8% --- గత ఆరు నెలల్లో 37% --- గత ఏడాది కాలంలో 49% పెరిగింది.
EIH --- గత వారం రోజుల్లో 6% --- గత నెల రోజుల్లో 19% --- గత ఆరు నెలల్లో 60% --- గత ఏడాది కాలంలో 57% లాభాలు తెచ్చిచ్చింది.
ఛాలెట్ హోటల్స్ --- గత వారం రోజుల్లో 4% --- గత నెల రోజుల్లో 12% --- గత ఆరు నెలల్లో 49% --- గత ఏడాది కాలంలో 67% రిటర్న్ ఇచ్చింది.
లెమన్ ట్రీ హోటల్స్ --- గత వారం రోజుల్లో 2% --- గత నెల రోజుల్లో 12% --- గత ఆరు నెలల్లో 38% --- గత ఏడాది కాలంలో 52% ర్యాలీ చేసింది.
మహీంద్ర హాలిడేస్ --- గత వారం రోజుల్లో −2% --- గత నెల రోజుల్లో 17% --- గత ఆరు నెలల్లో 45% --- గత ఏడాది కాలంలో 50% గెయిన్ అయింది.
ITDC --- గత వారం రోజుల్లో 1% --- గత నెల రోజుల్లో 13% --- గత ఆరు నెలల్లో 22%--- గత ఏడాది కాలంలో −1% రిటర్న్ ఇచ్చింది.
ఓరియంట్ హోటల్స్ --- గత వారం రోజుల్లో 10% --- గత నెల రోజుల్లో 1% --- గత ఆరు నెలల్లో 17% --- గత ఏడాది కాలంలో 37% ప్రాఫిట్స్ అందించింది.
తాజ్ GVK హోటల్స్ --- గత వారం రోజుల్లో 5% --- గత నెల రోజుల్లో −13% --- గత ఆరు నెలల్లో 25% --- గత ఏడాది కాలంలో 40% పెరిగింది.
EIH అసోసియేటెడ్ హోటల్స్ --- గత వారం రోజుల్లో 3% --- గత నెల రోజుల్లో −1% --- గత ఆరు నెలల్లో 26% --- గత ఏడాది కాలంలో 14% ర్యాలీ చేసింది.
HLV --- గత వారం రోజుల్లో 18% --- గత నెల రోజుల్లో 15% --- గత ఆరు నెలల్లో 58% --- గత ఏడాది కాలంలో 62% రిటర్న్ ఇచ్చింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: జూన్ క్వార్టర్‌లో ఫుల్ స్పీడ్‌తో దూసుకెళ్లిన జీడీపీ ఇంజిన్ - ఇంధనంలా పని చేసిన వ్యవసాయం, ఆర్థికం
Join Us on Telegram: https://t.me/abpdesamofficial