అన్వేషించండి

Share Market Opening Today: కీలక లెవెల్స్‌ దాటిన బెంచ్‌మార్క్‌ సూచీలు - ఫోకస్‌లో బ్యాంక్‌ స్టాక్స్‌

BSE మిడ్‌ క్యాప్ & స్మాల్‌ క్యాప్ ఇండెక్స్‌ 0.7 శాతం చొప్పున పెరిగాయి.

Stock Market News Today in Telugu: ఆసియా మార్కెట్లు ఇచ్చిన సపోర్ట్‌తో ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్లు ఈ రోజు (సోమవారం, 29 ఏప్రిల్‌ 2024) హైజంప్‌ చేశాయి. బ్యాంకింగ్ షేర్లు మార్కెట్‌కు మద్దతుగా నిలిచాయి. ట్రేడ్‌ ఓపెనింగ్‌ టైమ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్‌ కీలకమైన 74,000 స్థాయిని దాటగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 22,500 మార్క్‌ను ఓవర్‌టేక్‌ చేసింది.

ఈ రోజు మన మార్కెట్ ఇలా ప్రారంభమైంది...

గత సెషన్‌లో (శుక్రవారం) 73,730 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 252.59 పాయింట్లు లేదా 0.34 శాతం పెరుగుదలతో 73,982.75 దగ్గర (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. శుక్రవారం 22,419 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 55.60 పాయింట్లు లేదా 0.25 శాతం లాభంతో 22,475.55 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 

విస్తృత మార్కెట్లలో... BSE మిడ్‌ క్యాప్ & స్మాల్‌ క్యాప్ ఇండెక్స్‌ 0.7 శాతం చొప్పున పెరిగాయి.

ప్రారంభ ట్రేడింగ్‌లో, సెన్సెక్స్‌ 30 ప్యాక్‌లో 20 స్టాక్స్‌ గ్రీన్‌ జోన్‌లో ట్రేడ్ అవుతుంటే, 3 స్టాక్స్‌ మాత్రమే క్షీణించాయి. సెన్సెక్స్‌ను పటిష్ట పరచడంలో బ్యాంకింగ్ షేర్లదే ప్రధాన పాత్ర. సెన్సెక్స్‌ టాప్‌ గెయినర్స్‌లో... టెక్ మహీంద్రా 1.80 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.75 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.27 శాతం, మారుతి సుజుకి 1.26 శాతం, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 1.16 శాతం, ఎన్‌టీపీసీ 1.15 శాతం లాభపడ్డాయి. మరోవైపు, సెన్సెక్స్‌ టాప్‌ లూజర్స్‌లో ITC, బజాజ్ ఫిన్‌సర్వ్, M&M, HCL టెక్ షేర్లు కనిపించాయి.

నిఫ్టీ50 ప్యాక్‌లో.. 42 షేర్లు బలపడగా, 8 షేర్లు బలహీనపడ్డాయి. అయితే, మార్కెట్ ప్రారంభమైన 15 నిమిషాల తర్వాత 29 స్టాక్స్‌ లాభాల్లో, 21 స్టాక్స్‌ నష్టాల్లో కనిపించాయి. నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌లో... ఐసీఐసీఐ బ్యాంక్ 1.75 శాతం, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 1.60 శాతం, దివీస్ ల్యాబ్ 1.45 శాతం, మారుతి సుజుకి 1.11 శాతం చొప్పున పెరిగాయి. నిఫ్టీ టాప్‌ లూజర్స్‌లో... హెచ్‌సీఎల్ టెక్ 4.66 శాతం, ఎం&ఎం 1.38 శాతం, శ్రీరామ్ ఫైనాన్స్ 1.15 శాతం పతనంతో ట్రేడవుతున్నాయి.

మరోవైపు, ఇండిగో షేరు 52-వారాల గరిష్ట స్థాయికి చేరుకుంది. యెస్ బ్యాంక్ 7 శాతం లాభపడగా, బీఎస్‌ఈ స్టాక్ 16 శాతం పడిపోయింది.

ఈ రోజు Q4 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: అల్ట్రాటెక్ సిమెంట్, ట్రెంట్, KPIT టెక్నాలజీస్, పూనావాలా ఫిన్‌కార్ప్, టాటా కెమికల్స్, బిర్లాసాఫ్ట్, PNB హౌసింగ్ ఫైనాన్స్, కేఫిన్‌ టెక్నాలజీస్, కెన్ ఫిన్ హోమ్స్, షాపర్స్ స్టాప్, వెసువియస్ ఇండియా, స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్, రోసారి బయోటెక్, UCO బ్యాంక్, జిల్లెట్ ఇండియా.

ఈ రోజు ఉదయం 10.15 గంటల సమయానికి, BSE సెన్సెక్స్‌ 499.81 పాయింట్లు లేదా 0.68% పెరిగి 74,229.97 దగ్గర; NSE నిఫ్టీ 97.30 పాయింట్లు లేదా 0.43% పెరిగి 22,517.25 వద్ద ట్రేడవుతున్నాయి. 

గ్లోబల్‌ మార్కెట్లు
ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లలో, తైవాన్ 1.3 శాతం పెరిగింది. హాంగ్ సెంగ్ 0.53  శాతం, కోస్పి 0.86 శాతం, ASX200 0.47 శాతం చొప్పున ర్యాలీ చేశాయి. స్ట్రెయిట్స్ టైమ్స్ 0.4 శాతం తగ్గింది. నికాయ్‌లో ట్రేడింగ్‌కు ఈ రోజు సెలవు.

అమెరికన్‌ మార్కెట్లలో, శుక్రవారం, గూగుల్ పేరెంట్ ఆల్ఫాబెట్ అందించిన బూస్ట్‌తో నాస్‌డాక్ 2% దూసుకెళ్లింది.

యూఎస్‌ ఇన్‌ఫ్లేషన్‌ డేటా మార్కెట్‌ అంచనాల కంటే కొద్దిగా పెరగడంతో, అమెరికన్‌ బెంచ్‌మార్క్‌ 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ స్వల్పంగా తగ్గి 4.663 శాతం వద్ద ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ $89 దిగువకు చేరింది. పసిడి వెలుగు కూడా తగ్గింది, ఔన్సుకు $2,341 దగ్గర ఉంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: ఐసీఐసీఐ నుంచి ఐడీఎఫ్‌సీ వరకు - బ్యాంక్‌ కస్టమర్లకు అలెర్ట్‌, ఛార్జీల మోత మోగబోతోంది

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress Protest : తెలంగాణ రాజ్‌భవన్ ముట్టడికి సీఎం, డీసీఎం యత్నం- అడ్డుకున్న పోలీసులు- రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేస్తామన్న రేవంత్
తెలంగాణ రాజ్‌భవన్ ముట్టడికి సీఎం, డీసీఎం యత్నం- అడ్డుకున్న పోలీసులు- రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేస్తామన్న రేవంత్
Are Kapu Community Leaders Suffocating In YSRCP: జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
Bhu Bharati Act 2024: తెలంగాణలో అసెంబ్లీలో భూభారతి బిల్లు- దోచుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని మంత్రి హెచ్చరిక 
తెలంగాణలో అసెంబ్లీలో భూభారతి బిల్లు- దోచుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని మంత్రి హెచ్చరిక 
Ravichandran Ashwin Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ - గబ్బా టెస్టు తర్వాత సంచలన ప్రకటన
అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ - గబ్బా టెస్టు తర్వాత సంచలన ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రేవంత్ రెడ్డీ..  నీ వీపు పగలడం పక్కా..!Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress Protest : తెలంగాణ రాజ్‌భవన్ ముట్టడికి సీఎం, డీసీఎం యత్నం- అడ్డుకున్న పోలీసులు- రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేస్తామన్న రేవంత్
తెలంగాణ రాజ్‌భవన్ ముట్టడికి సీఎం, డీసీఎం యత్నం- అడ్డుకున్న పోలీసులు- రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేస్తామన్న రేవంత్
Are Kapu Community Leaders Suffocating In YSRCP: జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
Bhu Bharati Act 2024: తెలంగాణలో అసెంబ్లీలో భూభారతి బిల్లు- దోచుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని మంత్రి హెచ్చరిక 
తెలంగాణలో అసెంబ్లీలో భూభారతి బిల్లు- దోచుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని మంత్రి హెచ్చరిక 
Ravichandran Ashwin Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ - గబ్బా టెస్టు తర్వాత సంచలన ప్రకటన
అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ - గబ్బా టెస్టు తర్వాత సంచలన ప్రకటన
IND vs AUS 3rd Test Match: డ్రాగా ముగిసిన
డ్రాగా ముగిసిన "గబ్బా" టెస్టు - 1-1తో సిరీస్‌ సమానం- కపిల్ రికార్డు బ్రేక్ చేసిన బుమ్రా
Zika Virus In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో జికా వైరస్‌ కలకలం- నెల్లూరు బాలుడికి వ్యాధి లక్షణాలు!
ఆంధ్రప్రదేశ్‌లో జికా వైరస్‌ కలకలం- నెల్లూరు బాలుడికి వ్యాధి లక్షణాలు!
Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
Embed widget