అన్వేషించండి

Share Market Opening Today 24 November 2023: మార్కెట్‌లో మూడు రోజులుగా అదే సీన్‌ - రైజింగ్‌లో ఫార్మా స్టాక్స్‌

ఫార్మా ఇండెక్స్ 1 శాతం పెరిగింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT), ఆయిల్ & గ్యాస్ స్టాక్స్‌లో అమ్మకాలు కనిపిస్తున్నాయి.

Stock Market Today News in Telugu: భారత స్టాక్ మార్కెట్ ఈ రోజు (శుక్రవారం, 24 నవంబర్‌ 2023) మళ్లీ ఫ్లాట్‌గానే ప్రారంభమైంది, మూడు రోజులుగా ఇదే తంతు కొనసాగుతోంది. ప్రి-ఓపెన్ సమయంలోనూ సెన్సెక్స్ & నిఫ్టీ ఫ్లాట్ ట్రేడ్‌ను చూపాయి. 

ఈ వారం చివరి ట్రేడింగ్ రోజున, బిజినెస్‌ ప్రారంభంలో హెడ్‌లైన్‌ ఇండెక్స్‌లు సెన్సెక్స్, నిఫ్టీ మిక్స్‌డ్‌ సిగ్నల్స్‌ ఇచ్చాయి. ఫార్మా ఇండెక్స్ 1 శాతం పెరిగింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT), ఆయిల్ & గ్యాస్ స్టాక్స్‌లో అమ్మకాలు కనిపిస్తున్నాయి. టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) ఎక్స్-బైబ్యాక్ తేదీ ఈ రోజు కావడంతో, ఈ టెక్‌ కంపెనీ షేర్లలో కదలిక ఉంది.

ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...
నిన్న (గురువారం, 23 నవంబర్‌ 2023) 66,017 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 17 పాయింట్లు తగ్గి 66,000 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. గత సెషన్‌లో 19,802 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 07 పాయింట్లు పెరిగి 19,809 వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. నిఫ్టీ బ్యాంక్‌ 3 పాయింట్లు పెరిగి 43,452.75 స్థాయి దగ్గర స్టార్ట్‌ అయింది.

ఈ రోజు మార్కెట్‌ ప్రారంభంలో.. బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌లోని 1,615 షేర్లు గ్రీన్‌ మార్క్‌లో ఉన్నాయి, 434 షేర్లు రెడ్‌ మార్క్‌లో కనిపించాయి. 121 షేర్లలో ఎలాంటి మార్పు మారలేదు. 

ఈ రోజు మార్కెట్‌ ప్రారంభంలో... నిఫ్టీ 50 ప్యాక్‌లోని 32 స్టాక్స్‌ లాభపడగా, 18 స్టాక్స్‌ క్షీణిస్తున్నాయి. నిఫ్టీ గెయినర్స్‌లో.. సిప్లా, దివీస్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, NTPC ఉన్నాయి. నిఫ్టీ లూజర్స్‌ లిస్ట్‌లో... TCS, BPCL, కోటక్ మహీంద్ర బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, భారతి ఎయిర్‌టెల్ షేర్లు చేరాయి. 

నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 1 శాతం పెరిగింది. లుపిన్, దివీస్ లేబొరేటరీస్, జైడస్ లైఫ్‌సైన్సెస్‌ షేర్లలోని ఉత్సాహం ఫార్మా ఇంటెక్స్‌ను పైకి చేర్చింది.

ఉదయం 10.15 గంటల సమయానికి, బీఎస్‌ఈ సెన్సెక్స్ 21.75 పాయింట్లు లేదా 0.033% తగ్గి 65,996 వద్ద; నిఫ్టీ 1.90 పాయింట్లు లేదా 0.0096% పెరిగి 19,803.90 వద్ద ట్రేడవుతున్నాయి. 

టెక్నికల్‌ డేటా ప్రకారం, నిఫ్టీకి 19,681 స్థాయి వద్ద సపోర్ట్‌ లభిస్తుందని అంచనా. ఆప్షన్స్‌ డేటా 19300-20000 ట్రేడింగ్ పరిధిని సూచిస్తోంది, 20500 కీలకమైన రెసిస్టెన్స్‌గా పని చేస్తుంది.

ఈ సంవత్సరం మిడ్-క్యాప్‌ & స్మాల్-క్యాప్స్‌ భారీ ఆధిపత్యాన్ని కనబరిచాయి. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు (YTD) నిఫ్టీ 8.82% మాత్రమే పెరిగితే... అదే సమయంలో నిఫ్టీ మిడ్‌-క్యాప్ ఇండెక్స్ & నిఫ్టీ స్మాల్‌-క్యాప్ ఇండెక్స్ వరుసగా 33.38% & 41.66% పెరిగాయి.

గ్లోబల్‌ మార్కెట్స్‌
థాంక్స్ గివింగ్‌ సందర్భంగా US మార్కెట్లు గురువారం పని చేయలేదు, ఈ రోజు హాఫ్‌ డే పని చేస్తాయి.

ఆసియా మార్కెట్ల విషయానికి వస్తే.. జపాన్‌కు చెందిన నికాయ్‌ ఈ ఉదయం 1 శాతం పెరిగింది. జపాన్‌లో ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌ నెలలోని 3 శాతం నుంచి అక్టోబర్‌లో 3.3 శాతానికి పెరిగింది. దీంతో, అక్కడి సెంట్రల్ బ్యాంక్ దాని అల్ట్రా-లూజ్ పాలసీని పక్కనబెట్టి, వడ్డీ రేట్లను పెంచవచ్చని మార్కెట్‌ అంచనా వేసింది. దక్షిణ కొరియాకు చెందిన కోస్పి 0.14 శాతం క్షీణించగా, హాంకాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ 1.56 శాతం క్షీణించింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

మరో ఆసక్తికర కథనం: ఆధార్‌ ఫ్రీ అప్‌డేషన్‌ గడువు దగ్గర పడుతోంది - మీ వివరాలన్నీ ఉచితంగా మార్చుకోవచ్చు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
Costly Weddings: పెళ్లైన తర్వాత హనీమూన్‌కు వెళ్తారా, ఇన్‌కమ్‌ టాక్స్‌ ఆఫీస్‌కు వెళ్తారా? నిర్ణయం మీ చేతుల్లోనే
పెళ్లైన తర్వాత హనీమూన్‌కు వెళ్తారా, ఇన్‌కమ్‌ టాక్స్‌ ఆఫీస్‌కు వెళ్తారా? నిర్ణయం మీ చేతుల్లోనే
Game Changer : టైం వచ్చినప్పుడు బ్లాస్ట్ అవుతాడు... రామ్ చరణ్, 'గేమ్ ఛేంజర్' గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టిన డైరెక్టర్ శంకర్
టైం వచ్చినప్పుడు బ్లాస్ట్ అవుతాడు... రామ్ చరణ్, 'గేమ్ ఛేంజర్' గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టిన డైరెక్టర్ శంకర్
Fatal Accident In Jaipur: జైపూర్‌లో ఆయిల్ ట్యాంక‌ర్‌ను ఢీకొన్న ట్ర‌క్కు..పెట్రోల్ బంకులో పేలుడు.. 8 మంది స‌జీవ ద‌హ‌నం
జైపూర్‌లో ఆయిల్ ట్యాంక‌ర్‌ను ఢీకొన్న ట్ర‌క్కు..పెట్రోల్ బంకులో పేలుడు.. 8 మంది స‌జీవ ద‌హ‌నం
Om Prakash Chautala: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా కన్నుమూత
Om Prakash Chautala: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా కన్నుమూత
Embed widget