అన్వేషించండి

Update Aadhar Card: ఆధార్‌ ఫ్రీ అప్‌డేషన్‌ గడువు దగ్గర పడుతోంది - మీ వివరాలన్నీ ఉచితంగా మార్చుకోవచ్చు!

Aadhaar Update: పోర్టల్‌లోకి వెళ్లి, ఆన్‌లైన్‌ ద్వారా, మీ ఇంటి చిరునామా, మీ పేరు మొదలైన సమాచారాన్ని ఆధార్ కార్డ్‌లో అప్‌డేట్ చేయవచ్చు.

How Update Aadhar Details In Telugu: ఆధార్ కార్డ్‌లోని వివరాలను పూర్తి ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు చివరి తేదీ ‍‌(Last Date For Update Aadhaar Card For Free) దగ్గర పడుతోంది. ఫ్రీ అప్‌డేషన్‌ గడువును ఈ ఏడాది డిసెంబర్‌ 14వ తేదీ (14 December 2023) వరకు భారత ప్రభుత్వం గతంలోనే పెంచింది. అంతకు ముందు సెప్టెంబరు 14, 2023 వరకూ గడువు ఉండేది. ప్రజలకు మరో ఛాన్స్‌ ఇచ్చిన ప్రభుత్వం, ఈ గడువును 3 నెలలు పెంచింది. 

ఆధార్‌లో ఏయే వివరాలను ఫ్రీగా మార్చుకోవచ్చు?

మీ ఆధార్‌ కార్డ్‌లో... మీ పుట్టిన తేదీ తప్పుగా ఉన్నా, పేరులో స్పెల్లింగ్‌ మిస్టేక్స్‌ ఉన్నా, జెండర్‌లో తప్పు దొర్లినా, మీ అడ్రస్‌, మొబైల్‌ నెంబర్‌, ఈ-మెయిల్‌ ఐడీ మారినా (Name, Address, DoB, Gender, Mobile & Email ID Details Change in Aadhaar) ఇప్పుడు ఫ్రీగా అప్‌డేట్‌ చేసుకోవచ్చు. అయితే, గడువు దగ్గర పడుతోందన్న విషయాన్ని గుర్తుంచుకోండి.

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఉడాయ్‌ (UIDAI - Unique Identification Authority of India) UIDAI వెబ్‌సైట్ ప్రకారం.. ఆధార్ కార్డ్‌లో కచ్చితమైన సమాచారాన్ని ఉంచడం సంబంధిత పౌరుడి బాధ్యత. ఆధార్ కార్డ్‌ డిటైల్స్‌ అప్‌డేషన్‌ చేయడానికి తగిన రుజువు పత్రాలను అప్‌లోడ్ చేయాలి. మీ ఆధార్ కార్డ్‌ను ఉచితంగా అప్‌డేట్ చేయడానికి, https://myaadhaar.uidai.gov.in లింక్‌ ద్వారా ఉడాయ్‌ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లవచ్చు. 

UIDAI పోర్టల్‌లోకి వెళ్లి, ఆన్‌లైన్‌ ద్వారా, మీ ఇంటి చిరునామా, మీ పేరు మొదలైన సమాచారాన్ని ఆధార్ కార్డ్‌లో అప్‌డేట్ చేయవచ్చు. దీని కోసం వినియోగదార్లు తమ ఆధార్ నంబర్, రిజిస్టర్డ్‌ మొబైల్ నంబర్ దగ్గర పెట్టుకోవాలి. రిజిస్టర్డ్‌ మొబైల్ నంబర్‌కు వచ్చే OTPని ఉపయోగించి, చిరునామా సహా ఇతర వివరాలను మార్చవచ్చు.

ఆఫ్‌లైన్‌/ఆధార్‌ కేంద్రం/CSC కి వెళ్లి ఆధార్‌ సమాచారాన్ని అప్‌డేట్‌ చేయాలనుకుంటే మాత్రం 25 రూపాయల ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.

ఆధార్ వివరాలను ఫ్రీగా ఎలా అప్‌డేట్ చేయాలి? (How Update Aadhar Details For Free?)

  • ముందుగా myaadhaar.uidai.gov.in లింక్‌ ద్వారా ఆధార్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి, మీ ఆధార్‌ నంబర్‌తో లాగిన్ అవ్వాలి.
  • మీ పేరు/లింగం/పుట్టిన తేదీ, చిరునామా ఆప్షన్లు ఎంచుకోండి. అప్‌డేట్ ఆధార్ ఆప్షన్‌ ఎంచుకోండి
  • ఇప్పుడు, చిరునామా లేదా ఇతర సమాచారాన్ని అప్‌డేట్‌ చేయడానికి అక్కడ కనిపించే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత, స్కాన్ చేసిన ప్రూఫ్‌ కాపీలను అప్‌లోడ్ చేసి, డెమోగ్రాఫిక్ డేటాను (Demographic data) అప్‌డేట్‌ చేయండి. ఇప్పుడు మీకు ఒక అక్నాలెడ్జ్‌మెంట్‌ నంబర్ (URN) వస్తుంది. ఆ నెంబర్‌ను సేవ్‌ చేసుకోండి. ఆధార్‌ అప్‌డేషన్‌ స్టేటస్‌ తనిఖీ చేయడానికి ఆ నెంబర్‌ ఉపయోగపడుతుంది.

ఆధార్ అప్‌డేషన్‌ ప్రాసెస్‌ను ఎలా ట్రాక్ చేయాలి? (How to Track Aadhaar Updation Process?)

ఆధార్ కార్డ్‌లో మార్పుల కోసం మీరు రిక్వెస్ట్‌ చేసిన తర్వాత, మీకు URN నంబర్ వస్తుంది. అది మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది, మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు కూడా SMS ద్వారా అందుతుంది. మీరు https://ssup.uidai.gov.in/checkSSUPStatus/checkupdatestatus లింక్‌ ద్వారా పోర్టల్‌లోకి వెళ్లి, మీ ఆధార్ కార్డ్ వివరాల అప్‌డేషన్‌ స్థితిని ట్రాక్ చేయవచ్చు.

డెమోగ్రాఫిక్ డేటాను ఎప్పుడు అప్‌డేట్‌ చేయాలి? ‍‌(When should demographic data be updated?)

మన దేశంలో వివాహానంతరం మహిళ ఇంటి పేరు మారుతుంది. ఇలాంటి సందర్భంలో మార్పులు చేయాలి. పుట్టిన తేదీ, పేరు, చిరునామాలో తప్పులు దొర్లినా మీ ఆధార్ డిటెయిల్స్‌ అప్‌డేట్‌ చేయాలి.

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆
*T&C Apply

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
Viral News: పవన్‌తో బొత్స ఆలింగనం- సైలెంట్‌గా పక్కకు తప్పుకున్న పెద్దిరెడ్డి సహా వైసీపీ ఎమ్మెల్సీలు
పవన్‌తో బొత్స ఆలింగనం- సైలెంట్‌గా పక్కకు తప్పుకున్న పెద్దిరెడ్డి సహా వైసీపీ ఎమ్మెల్సీలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Devaki Nandana Vasudeva Review - దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
Viral News: పవన్‌తో బొత్స ఆలింగనం- సైలెంట్‌గా పక్కకు తప్పుకున్న పెద్దిరెడ్డి సహా వైసీపీ ఎమ్మెల్సీలు
పవన్‌తో బొత్స ఆలింగనం- సైలెంట్‌గా పక్కకు తప్పుకున్న పెద్దిరెడ్డి సహా వైసీపీ ఎమ్మెల్సీలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Devaki Nandana Vasudeva Review - దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Game Changer First Review : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
Australia Vs India 1st Test Scorecard: పెర్త్‌ టెస్టులో టీమిండియా బోల్తా - 150 పరుగులకే ఆలౌట్‌- టాప్ స్కోరర్‌గా నితీశ్‌
పెర్త్‌ టెస్టులో టీమిండియా బోల్తా - 150 పరుగులకే ఆలౌట్‌- టాప్ స్కోరర్‌గా నితీశ్‌
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Embed widget