అన్వేషించండి

Share Market Opening Today: స్టాక్‌ మార్కెట్‌లో ప్రారంభ లాభాలు ఆవిరి, సపోర్ట్‌గా నిలిచిన నిఫ్టీ స్టాక్స్‌

హెడ్‌లైన్‌ ఇండెక్స్‌లు సెన్సెక్స్ & నిఫ్టీ ప్రారంభ సమయం నుంచే అస్థిరంగా కదిలాయి.

Stock Market News Today in Telugu: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ రోజు (సోమవారం, 12 ఫిబ్రవరి 2024) పాజిటివ్‌గా ప్రారంభమైంది. అయితే.. గ్లోబల్‌ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలతో పాటు కీలకమైన ఆర్థిక డేటా ఈ రోజు రిలీజ్‌ అవుతుంది. రిటైల్ ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ఈ సాయంత్రం విడుదలవుతాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్ల జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. హెడ్‌లైన్‌ ఇండెక్స్‌లు సెన్సెక్స్ & నిఫ్టీ ప్రారంభ సమయం నుంచే అస్థిరంగా కదిలాయి. అయితే, నిఫ్టీ స్టాక్స్‌ కాస్త సపోర్ట్‌గా నిలిచాయి.

గత వారం, MPC సమావేశం తర్వాత, ద్రవ్యోల్బణం విషయంలో ఇంకా అనిశ్చితి ఉందని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. అందువల్లే వరుసగా ఆరోసారి రెపో రేటును స్థిరంగా ఉంచాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. 

ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...

గత సెషన్‌లో (శుక్రవారం) 71,595 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 127 పాయింట్లు పెరిగి 71,722.31 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. శుక్రవారం 21,782 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 18 పాయింట్లు పెరిగి 21,800.80 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 

విస్తృత మార్కెట్లలో, BSE మిడ్‌ క్యాప్ ఇండెక్స్‌ 0.2 శాతం, స్మాల్‌ క్యాప్ సూచీ కూడా 0.2 శాతం వరకు పెరిగాయి.

సెన్సెక్స్‌లో, మార్కెట్‌ ఓపెనింగ్‌ టైమ్‌లో... విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్ షేర్లు 1.5% పైగా పెరిగాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర, టిసీఎస్ కూడా టాప్‌ గెయినర్స్‌లో ఉన్నాయి. పవర్ గ్రిడ్ 1% పైగా క్షీణించింది. భారతి ఎయిర్‌టెల్, ఎన్‌టీపీసీ, హీరో మోటో, ఓఎన్‌జీసీ, కోల్ ఇండియా టాప్‌ లూజర్స్‌ లిస్ట్‌లో ఉన్నాయి. నిఫ్టీలో డా.రెడ్డీస్, దివీస్ ల్యాబ్స్ లాభపడ్డాయి.

జెన్సోల్ ఇంజనీరింగ్ షేర్‌ ప్రైస్‌ 5% పెరిగింది. హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్ తయారీ కోసం PLI స్కీమ్ బిడ్‌ను గెలుచుకోవడం దీనికి కారణం. 

Q3 లాభం 265% YoY జంప్ చేసి రూ.26 కోట్లకు చేరడంతో, మామాఎర్త్‌ మాతృసంస్థ హోసన కన్స్యూమర్ షేర్లు 9% పెరిగాయి. 

ఆశించిన స్థాయిలో డిసెంబర్‌ క్వార్టర్‌ ఫలితాలు లేకపోవడంతో, అపెక్స్‌ ఫ్రోజన్‌ ఫుడ్స్‌ స్టాక్‌ 13% తగ్గింది.

ఈ రోజు ఉదయం 09.55 గంటల సమయానికి, BSE సెన్సెక్స్‌ 191.64 పాయింట్లు లేదా 0.27% తగ్గి 71,403.85 దగ్గర; NSE నిఫ్టీ 52.85 పాయింట్లు లేదా 0.24% తగ్గి 21,729.65 వద్ద ట్రేడవుతున్నాయి. 

ఈ రోజు Q3 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: 63మూన్స్, ఆల్ కార్గో లాజిస్టిక్స్, అవధ్ షుగర్, BASF, భారత్ ఫోర్జ్, BLS ఇంటర్నేషనల్ సర్వీసెస్, కెమ్‌ప్లాస్ట్‌ సన్మార్, కోల్ ఇండియా, ఎడెల్వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్,
మజగాన్‌డాక్ షిప్ బిల్డర్స్, సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్, NHPC.

శని, ఆదివారాల్లో ప్రకటించిన Q3 ఫలితాల ఆధారంగా ఈ రోజు రియాక్ట్‌ అయ్యే స్టాక్స్‌: ONGC, ఫిలాటెక్స్ ఫ్యాషన్, ఆంధ్రా పెట్రోకెమ్, గ్లోబల్ సర్ఫేసెస్, MM ఫోర్జింగ్స్, థెమిస్ మెడికేర్, అరబిందో ఫార్మా, అంబర్ ఎంటర్‌ప్రైజెస్, మనోరమ ఇండస్ట్రీస్, TVS ఎలక్ట్రానిక్స్, జగ్రాన్ ప్రకాశన్, ఆటోలైన్ ఇండస్ట్రీస్, ఎల్‌ప్రో ఇంటర్నేషనల్, అప్‌డాక్స్ సర్వీస్, అప్‌డాక్స్ సర్వీస్ ఫ్లెయిర్ రైటింగ్, అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్, V2 రిటైల్, మవనా షుగర్స్, అడ్వాన్స్‌డ్ ఎంజైమ్ టెక్, దివీస్ ల్యాబ్స్, నెప్జెన్ కెమికల్స్, బంధన్ బ్యాంక్, సెల్లో వరల్డ్, హ్యాపీ ఫోర్జింగ్స్, శ్రీ రేణుకా షుగర్స్, స్టవ్ క్రాఫ్ట్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, మిశ్రా ధాతు నిగమ్, జూబిలెంట్ ఇండస్ట్రీస్, ITDC, IFCI.

గ్లోబల్ మార్కెట్లు
ఆసియా మార్కెట్లలో, ఈ ఉదయం.. ఆస్ట్రేలియా ASX200 0.18 శాతం క్షీణించింది. లూనార్‌ న్యూ ఇయర్‌ సందర్భంగా జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, చైనా, తైవాన్‌ స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు పని చేయవు. శుక్రవారం నాడు, అమెరికన్‌ స్టాక్స్‌ మిశ్రమంగా ముగిశాయి. S&P 500 0.57 శాతం పెరిగి తొలిసారిగా కీలకమైన 5,000 స్థాయిని అధిగమించింది. నాస్‌డాక్ 1.25 శాతం ర్యాలీ చేయగా, డౌ జోన్స్ 0.14 శాతం తగ్గింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Weather Latest Update: మరో 5 రోజులు భారీ వర్షాలు, 40 - 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు కూడా
మరో 5 రోజులు భారీ వర్షాలు, 40 - 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు కూడా
Revanth Reddy: తెలంగాణ ఆదాయం పెంచడంపై రేవంత్ రెడ్డి రివ్యూ, అధికారులకు కీలక ఆదేశాలు
తెలంగాణ ఆదాయం పెంచడంపై రేవంత్ రెడ్డి రివ్యూ, అధికారులకు కీలక ఆదేశాలు
IPL 2024:  ఎస్ఆర్‌హెచ్, గుజరాత్ మ్యాచ్ రద్దు - ప్లేఆఫ్స్‌కు సన్‌రైజర్స్!
ఎస్ఆర్‌హెచ్, గుజరాత్ మ్యాచ్ రద్దు - ప్లేఆఫ్స్‌కు సన్‌రైజర్స్!
Vidya Vasula Aham Review - విద్య వాసుల అహం రివ్యూ: AHA OTTలో కొత్త సినిమా... ఎలా ఉందంటే?
విద్య వాసుల అహం రివ్యూ: AHA OTTలో కొత్త సినిమా... ఎలా ఉందంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Chandragiri TDP MLA Candidate Pulivarthi Nani | చంద్రగిరి ఇది..పులివెందుల కానివ్వను | ABP DesamNattikumar About IPAC | జగన్ లేని వైసీపీ లాంటిదే ప్రశాంత్ కిషోర్ లేని ఐప్యాక్ | ABP DesamPalnadu Police Recover Petrol bombs | మారణాయుధాలు పట్టుకున్న పల్నాడు పోలీసులు | ABP DesamHeavy Rains in Hyderabad | చెరువులను తలపించేలా హైదరాబాద్‌లో రహదారులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Weather Latest Update: మరో 5 రోజులు భారీ వర్షాలు, 40 - 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు కూడా
మరో 5 రోజులు భారీ వర్షాలు, 40 - 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు కూడా
Revanth Reddy: తెలంగాణ ఆదాయం పెంచడంపై రేవంత్ రెడ్డి రివ్యూ, అధికారులకు కీలక ఆదేశాలు
తెలంగాణ ఆదాయం పెంచడంపై రేవంత్ రెడ్డి రివ్యూ, అధికారులకు కీలక ఆదేశాలు
IPL 2024:  ఎస్ఆర్‌హెచ్, గుజరాత్ మ్యాచ్ రద్దు - ప్లేఆఫ్స్‌కు సన్‌రైజర్స్!
ఎస్ఆర్‌హెచ్, గుజరాత్ మ్యాచ్ రద్దు - ప్లేఆఫ్స్‌కు సన్‌రైజర్స్!
Vidya Vasula Aham Review - విద్య వాసుల అహం రివ్యూ: AHA OTTలో కొత్త సినిమా... ఎలా ఉందంటే?
విద్య వాసుల అహం రివ్యూ: AHA OTTలో కొత్త సినిమా... ఎలా ఉందంటే?
చనిపోయిన ఆత్మీయుల వస్త్రాలు, ఇతర వస్తువులు వాడుకోవచ్చా? శాస్త్రం ఏం చెబుతోంది?
చనిపోయిన ఆత్మీయుల వస్త్రాలు, ఇతర వస్తువులు వాడుకోవచ్చా? శాస్త్రం ఏం చెబుతోంది?
T Safe App: టీ సేఫ్‌తో మీ ప్రయాణం సేఫ్, తెలంగాణ పోలీసుల బాసట - ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు
టీ సేఫ్‌తో మీ ప్రయాణం సేఫ్, తెలంగాణ పోలీసుల బాసట - ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు
Krishnamma OTT Streaming: కృష్ణమ్మ ఓటీటీ రిలీజ్... షాక్ ఇచ్చిన సత్యదేవ్, థియేటర్లలో విడుదలైన ఏడు రోజులకే!
కృష్ణమ్మ ఓటీటీ రిలీజ్... షాక్ ఇచ్చిన సత్యదేవ్, థియేటర్లలో విడుదలైన ఏడు రోజులకే!
ITR 2024: ఫామ్‌-16లో ఏం ఉంటుంది, ఐటీఆర్‌ ఫైలింగ్‌లో ఈ డాక్యుమెంట్‌ ఎందుకు కీలకం?
ఫామ్‌-16లో ఏం ఉంటుంది, ఐటీఆర్‌ ఫైలింగ్‌లో ఈ డాక్యుమెంట్‌ ఎందుకు కీలకం?
Embed widget