అన్వేషించండి

Share Market Opening Today: ఈ రోజు చాపీ ట్రేడ్‌ - 71400 వద్ద సెన్సెక్స్, 21500 వద్ద నిఫ్టీ పోరాటం

ఈ రోజు కూడా IT స్టాక్స్‌ పైపైకి పాకుతున్నాయి. BSE టాప్ గెయినర్స్‌లో టెక్నాలజీ స్టాక్స్‌ ఉన్నాయి.

Stock Market News Today in Telugu: గ్లోబల్‌ సిగ్నల్స్‌ బలహీనంగా ఉండడంతో భారత స్టాక్ మార్కెట్లు ఈ రోజు (బుధవారం, 10 జనవరి 2024) ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. కీలక స్థాయుల దగ్గర పట్టు నిలబెట్టుకోవడానికి సెన్సెక్స్ & నిఫ్టీ పోరాడుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 125 పాయింట్ల వరకు పడిపోయింది. బ్యాంక్‌ నిఫ్టీ మరీ ఎక్కువగా పడిపోకుండా ICICI బ్యాంక్, HDFC బ్యాంక్ నుంచి మద్దతు లభించింది. ఈ రోజు కూడా IT స్టాక్స్‌ పైపైకి పాకుతున్నాయి. BSE టాప్ గెయినర్స్‌లో టెక్నాలజీ స్టాక్స్‌ ఉన్నాయి.

రేపటి నుంచి Q3 FY24 ఫలితాల సీజన్ ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో, ఇండియన్‌ ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు అస్థిరంగా కదులుతున్నాయి.

ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...
గత సెషన్‌లో (మంగళవారం) 71,386 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 3 పాయింట్ల నామమాత్రపు క్షీణతతో 71,383 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. నిన్న 21,545 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 15.55 పాయింట్లు పతనమై 21,529 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 

బ్రాడర్‌ ఇండెక్స్‌లు ఈ రోజు ఎరుపు రంగులోకి జారిపోయాయి. BSE మిడ్ క్యాప్ ఇండెక్స్‌ 0.5 శాతం క్షీణించగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌ 0.1 శాతం తగ్గింది.

ప్రి-ఓపెనింగ్‌ సెషన్‌
మార్కెట్ ప్రి-ఓపెనింగ్‌ సెషన్‌లో, సెన్సెక్స్ 24 పాయింట్లు పడిపోయి 71,362 స్థాయి వద్ద; నిఫ్టీ 18.15 పాయింట్లు క్షీణించి 21,526 వద్ద ట్రేడయ్యాయి.

మార్కెట్‌ ఓపెనింగ్‌ టైమ్‌లో... BSEలో 2,942 షేర్లు ట్రేడ్ అవుతుండగా, వీటిలో 1,711 షేర్లు బుల్లిష్ మార్క్‌తో ట్రేడవుతున్నాయి. 1,127 స్టాక్స్‌ క్షీణించాయి.

సెన్సెక్స్ షేర్ల పరిస్థితి
సెన్సెక్స్‌30 ప్యాక్‌లోని 13 స్టాక్స్‌ లాభపడగా, 17 నష్టాలను ఎదుర్కొంటున్నాయి. HCL టెక్ 1 శాతం, టైటన్ 0.61 శాతం, నెస్లే 0.56 శాతం, ICICI బ్యాంక్ 0.42 శాతం, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 0.34 శాతం, TCS 0.27 శాతం చొప్పున లాభపడ్డాయి. ఫ్లిప్‌ సైడ్‌లో.. NTPC, యాక్సిస్‌ బ్యాంక్‌, పవర్‌ గ్రిడ్‌ నష్టపోయాయి.

ఈ రోజు ఉదయం 10.10 గంటల సమయానికి, BSE సెన్సెక్స్‌ 49.14 పాయింట్లు లేదా 0.06% తగ్గి 71,337.07 దగ్గర; NSE నిఫ్టీ 30.25 పాయింట్లు లేదా 0.14% తగ్గి 21,514.60 వద్ద ట్రేడవుతున్నాయి. 

గ్లోబల్ మార్కెట్ల పరిస్థితి 
మార్చిలో ఫెడ్ రేటు తగ్గింపు ఆశలు సన్నగిల్లడంతో నిన్న US మార్కెట్లు తగ్గాయి. గురువారం యూఎస్‌ డిసెంబర్‌ నెల ద్రవ్యోల్బణం డేటా కూడా వెలువడుతుంది. గత కొన్ని రోజుల నుంచి, బెంచ్‌మార్క్‌ 10-ఇయర్స్‌ బాండ్ ఈల్డ్ 4 శాతం మార్కు చుట్టూ తిరుగుతోంది. ఈ నేపథ్యంలో పెట్టుబడిదార్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. మంగళవారం, యూఎస్‌ మార్కెట్లలో... డౌ జోన్స్‌, S&P 500 వరుసగా 0.42 శాతం & 0.15 శాతం పడిపోయాయి, నాస్‌డాక్ కాంపోజిట్ 0.09 శాతం లాభపడింది. 

ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. జపాన్ నికాయ్‌ 1.7 శాతం పెరిగింది. ఆస్ట్రేలియా S&P/ASX 200, దక్షిణ కొరియా కోప్సీ 0.6 శాతం వరకు డౌన్‌ అయ్యాయి. హ్యాంగ్ సెంగ్ కోలుకుని 0.3 శాతం పెరిగింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: : తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget