Share Market Opening Today: నిఫ్టీ సరికొత్త రికార్డ్, 75,000 దాటిన సెన్సెక్స్ - లీడింగ్‌లో బజాజ్ ట్విన్స్
BSE మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.54 శాతం & స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.29 శాతం చొప్పున పెరిగాయి.
Stock Market News Today in Telugu: భారతీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (శుక్రవారం, 03 మే 2024) గ్రాండ్‌గా ఓపెన్ అయ్యాయి. హెవీ వెయిట్ షేర్లు మంచి ప్రారంభాన్ని అందించాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా అద్భుతమైన లాభాల నడుమ ఓపెన్ అయింది. నిఫ్టీ సరికొత్త ఆల్ టైమ్ హై లెవెల్‌ను (Nifty at fresh all-time high) నమోదు చేసింది, 22,794.70 స్థాయిని తాకింది. సెన్సెక్స్ కీలకమైన 75,000 శిఖరాన్ని మరోమారు అధిరోహించింది.
ఈ రోజు మన మార్కెట్ ఇలా ప్రారంభమైంది...
గత సెషన్‌లో (గురువారం) 74,611 దగ్గర క్లోజ్ అయిన BSE సెన్సెక్స్, ఈ రోజు 406.71 పాయింట్లు లేదా 0.55 శాతం పెరుగుదలతో 75,017.82 దగ్గర (BSE Sensex Opening Today) ఓపెన్ అయింది. గురువారం 22,648 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 18.15 పాయింట్లు లేదా 0.52 శాతం లాభంతో 22,766.35 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది.
విస్తృత మార్కెట్లలో... BSE మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.54 శాతం & స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.29 శాతం చొప్పున పెరిగాయి.
నిఫ్టీ50 ప్యాక్‌లో.. 42 షేర్లు బలపడగా, 8 షేర్లు డీలాపడ్డాయి. ఆర్‌బీఐ నుంచి ఉపశమనం పొందిన బజాజ్ ఫైనాన్స్ షేర్లు 8 శాతం లాభంలో ఉన్నాయి. బజాజ్ ఫిన్‌సర్వ్ కూడా రాణించింది, 4.5 శాతం పైగా పెరిగింది. ఒఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, శ్రీరామ్ ఫైనాన్స్ కూడా బలప్రదర్శన చేస్తున్నాయి. మరోవైపు... కోల్ ఇండియా, హీరోమోటోకార్ప్ టాప్ లూజర్స్‌లో ఉన్నాయి.
రంగాల వారీగా చూస్తే.. నిఫ్టీ ఐటీ తప్ప అన్ని సెక్టార్లు పచ్చగా ఉన్నాయి. ఫైనాన్షియల్, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ మెటల్ లాభాల్లో ముందంజలో ఉన్నాయి.
సెన్సెక్స్ టాప్ గెయినర్స్‌లో... బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఎం&ఎం, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్‌టీపీసీ లాభాల్లో ముందంజలో ఉన్నాయి. మరోవైపు... పవర్‌గ్రిడ్, భారతి ఎయిర్‌టెల్, టెక్ మహీంద్ర నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
రూ.410 లక్షల కోట్లు దాటిన బీఎస్ఈ మార్కెట్ క్యాప్
బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ (BSE Market Capitalisation) రూ.410 లక్షల కోట్లు దాటింది, రూ.410.62 లక్షల కోట్లకు చేరుకుంది. బిజినెస్ ప్రారంభంలో BSEలో 3,020 షేర్లు ట్రేడ్ అవుతుండగా... 1,991 షేర్లు గ్రీన్‌లో, 897 షేర్లు రెడ్‌లో కనిపించాయి. 132 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. 50 స్టాక్స్ 52 వారాల గరిష్ట స్థాయికి, 6 స్టాక్స్ 52 వారాల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. 110 షేర్లు అప్పర్ సర్క్యూట్‌లో, 36 షేర్లపై లోయర్ సర్క్యూట్‌లో ఆగిపోయాయి.
ఈ రోజు Q4 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: టైటన్, బ్రిటానియా ఇండస్ట్రీస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, గోద్రెజ్ ప్రాపర్టీస్, MRF, మంగళూరు రిఫైనరీ, కార్బోరండమ్ యూనివర్సల్, ఐనాక్స్ విండ్, ఆప్టస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్, ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్, రేమండ్, గో ఫ్యాషన్ ఇండియా, ఆర్తి డ్రగ్స్, తత్వ చింతన్ ఫార్మా కెమికల్, HFCL.
ఈ రోజు ఉదయం 10.15 గంటల సమయానికి, BSE సెన్సెక్స్ 20.42 పాయింట్లు లేదా 0.02% పెరిగి 74,631.53 దగ్గర; NSE నిఫ్టీ 29.05 పాయింట్లు లేదా 0.13% పెరిగి 22,677.25 వద్ద ట్రేడవుతున్నాయి.
గ్లోబల్ మార్కెట్లు
ఆసియా-పసిఫిక్ మార్కెట్లలో, ఈ ఉదయం.. దక్షిణ కొరియా కోస్పి 0.39 శాతం, స్మాల్ క్యాప్ కోస్‌డాక్ 0.52 శాతం పెరిగాయి. హాంగ్‌కాంగ్‌లోని హ్యాంగ్ సెంగ్ సూచీ 1.56 శాతం పైకి చేరింది. ఆస్ట్రేలియాలోని S&P/ASX 200 ఇండెక్స్ 0.42 శాతం పెరిగింది. జపాన్ & చైనా మార్కెట్లకు ఈ రోజు సెలవు.
US ఎంప్లాయ్‌మెంట్ డేటా అంచనాలతో, గురువారం, అమెరికన్ మార్కెట్లు సానుకూలంగా ఉన్నాయి. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.85 శాతం ర్యాలీ చేసింది. S&P 500 0.91 శాతం, నాస్‌డాక్ కాంపోజిట్ 1.51 శాతం లాభపడ్డాయి.
యూఎస్ మానిటరీ పాలసీని ఇన్వెస్టర్లు జీర్ణించుకోవడంతో అమెరికన్ బెంచ్‌మార్క్ 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ తగ్గింది, 4.59 శాతం వద్ద ఉంది. అమెరికాలో ఆర్థిక ఆందోళనల కారణంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ స్వల్పంగా పెరిగింది, $84 వద్దకు చేరింది. యూఎస్‌లో వడ్డీ రేట్ల నుంచి మరిన్ని హింట్స్ కోసం ఇన్వెస్టర్లు ఎదురు చూస్తుండడంతో గ్లోబల్ మార్కెట్‌లో గోల్డ్ రేటు ఔన్సుకు $2,310 దగ్గరకు చేరింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి