Share Market Opening Today: ఎగ్జిట్ పోల్స్ తర్వాత మార్కెట్‌లో పూనకాలు - సెన్సెక్స్ 2600 పాయింట్లు, నిఫ్టీ 800 పాయింట్లు జంప్
Stock Market Opening Bell: బీఎస్ఈ మార్కెట్ విలువ రూ. 423.94 లక్షల కోట్లకు చేరుకుంది. శుక్రవారం సెషన్‌లో ఇది రూ. 412.23 లక్షల కోట్లుగా ఉంది. ఇన్వెస్టర్ల ఆదాయాలు రూ.11 లక్షల కోట్లకు పైగా పెరిగాయి.
Stock Market News Today in Telugu: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ తర్వాత స్టాక్ మార్కెట్ పూనకంతో ఊగిపోయింది. ఓపెనింగ్ టైమ్‌లోనే రికార్డ్ స్థాయిలో (Stock markets at record levels) హై జంప్ చేసింది. BSE సెన్సెక్స్ 2,621.98 పాయింట్లు లేదా 3.55 శాతం వృద్ధితో 76,583 స్థాయి వద్ద ప్రారంభమైంది. ఇది మరో రికార్డ్ స్థాయి (Sensex at fresh all-time high). NSE నిఫ్టీ కూడా 807.20 పాయింట్లు లేదా 3.58 శాతం అద్భుత లాభంతో 23,337.90 వద్ద ప్రారంభమైంది. ఇది కూడా రికార్డే (Nifty at fresh all-time high). రెండు హెడ్‌లైన్ ఇండెక్స్‌లు దుమ్మురేపడంతో స్టాక్ మార్కెట్ చరిత్రాత్మక గరిష్ట స్థాయికి చేరుకుంది. గత సెషన్‌లో (శుక్రవారం) BSE సెన్సెక్స్ 73,961 దగ్గర; NSE నిఫ్టీ 22,530 వద్ద క్లోజ్ అయ్యాయి.
రికార్డ్ స్థాయిలో BSE మార్కెట్ క్యాపిటలైజేషన్
బీఎస్ఈ మార్కెట్ విలువ (BSE Market Capitalisation) రూ. 423.94 లక్షల కోట్లకు చేరుకుంది. శుక్రవారం సెషన్‌లో ఇది రూ. 412.23 లక్షల కోట్లుగా ఉంది. మార్కెట్ ప్రారంభమైన వెంటనే ఇన్వెస్టర్ల ఆదాయాలు రూ. 11 లక్షల కోట్లకు పైగా పెరిగాయి. ఓపెనింగ్ టైమ్‌లో, బీఎస్‌ఈలో 3,100 షేర్లు ట్రేడవుతుండగా అందులో 2,670 షేర్లు లాభాల్లో ఉన్నాయి. 328 షేర్లు నష్టాల్లోకి నడిచాయి. 102 షేర్లు ఎలాంటి మార్పు లేకుండా ట్రేడవుతున్నాయి.
మార్కెట్‌లోని అస్థిరతను సూచించే ఇండియా VIX 20 శాతానికి పైగా క్షీణించింది.
విస్తృత మార్కెట్లలో... నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.5 శాతం & స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.73 శాతం చొప్పున పెరిగాయి.
రంగాల వారీగా చూస్తే.. అన్ని సెక్టార్లు గ్రీన్ జోన్‌లో కదులుతున్నాయి. నిఫ్టీ మీడియా ఇండెక్స్ 1.5 శాతం లాభాలతో అన్నిటికంటే ముందు నిలిచింది. నిఫ్టీ PSU బ్యాంక్, ఫార్మా మెటల్, ఆటో రంగాలు కూడా 0.50 శాతం పైగా బలపడ్డాయి.
రంగాల వారీగా చూస్తే.. అన్ని సెక్టార్లు గ్రీన్ జోన్‌లో కదులుతున్నాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 5 శాతం, నిఫ్టీ రియాల్టీ 4 శాతం, నిఫ్టీ బ్యాంక్ 3 శాతం పెరిగాయి.
సెన్సెక్స్ 30 ప్యాక్‌లోని మొత్తం 30 షేర్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. పవర్ గ్రిడ్ 7.08 శాతం పెరిగి అగ్రస్థానంలో ఉంది. NTPC 6.14 శాతం, M&M 5.23 శాతం, L&T 5.15 శాతం, SBI దాదాపు 5 శాతం జంప్ చేశాయి.
నిఫ్టీ50 ప్యాక్‌లోని 50 షేర్లలో 48 లాభాలతో ట్రేడవుతుండగా, 2 షేర్లు మాత్రమే క్షీణతలో ఉన్నాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్‌లో... అదానీ పోర్ట్స్ 8.67 శాతం, శ్రీరామ్ ఫైనాన్స్ 7.04 శాతం పెరిగాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ 6.90 శాతం, పవర్ గ్రిడ్ 6.77 శాతం, ఎన్‌టీపీసీ 5.54 శాతం ఎగబాకాయి. ఐషర్ మోటార్స్, LTI మైండ్‌ట్రీ మాత్రమే నష్టపోయాయి.
2019లోనూ ఉప్పెన
2019లో, బీజేపీ 300కుపైగా సీట్లతో విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినప్పుడు కూడా స్టాక్ మార్కెట్ 1.45 శాతం పెరిగింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: ఆసియాలో అత్యంత సంపన్నుడు అదానీ - ఆస్తుల విలువ తెలిస్తే కళ్లు తిరుగుతాయ్