అన్వేషించండి

Stock Market News: వారెన్‌ బఫెట్‌ స్టైల్లో పెట్టుబడి పెడతారా? ఇవిగో ఐదు స్టాక్స్‌

మేనేజ్‌మెంట్‌ నాణ్యత, కంపెనీ వృద్ధి అవకాశాలను నిర్ధరించుకున్న తర్వాత మాత్రమే ఆయా కంపెనీ షేర్లను బఫెట్‌ కొంటారు.

Stock Market News: బెంజమిన్ గ్రాహం పూర్వ విద్యార్థి, బెర్క్‌షైర్ హాత్‌వే CEO, స్టాక్‌ మార్కెట్‌లో అత్యంత విజయవంతమైన పెట్టుబడిదారుడు వారెన్‌ బఫెట్‌ (Warren Buffett). స్టాక్‌ మార్కెట్‌ ఫాలో అయ్యే వాళ్లకు బఫెట్‌ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మేనేజ్‌మెంట్‌లో నాణ్యత, కంపెనీ వృద్ధి అవకాశాలను నిర్ధరించుకున్న తర్వాత మాత్రమే ఆయా కంపెనీ షేర్లను బఫెట్‌ కొంటారు. వాటిలోనూ, వాల్యూ బయింగ్స్‌కు (ఉండాల్సిన ధర కన్నా ఇప్పుడు తక్కువ ధరకు దొరికే క్వాలిటీ స్టాక్స్‌) ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ పెట్టుబడి విధానాన్ని దీనిని 'బఫెటాలజీ'గా పిలుస్తుంటారు.

MarketSmith చెబుతున్న ప్రకారం... వారెన్ బఫెట్ పెట్టుబడి శైలికి సరిగ్గా సరిపోయే 5 స్టాక్స్‌ ఇవి:

షాఫ్లర్ ఇండియా (Schaeffler India)
ఫండమెంటల్‌గా... రూ. 6,596 కోట్ల ఆపరేటింగ్‌ రెవెన్యూతో, అత్యుత్తమ వార్షిక ఆదాయ వృద్ధి, 47% నమోదు చేసింది. ప్రి-టాక్స్ మార్జిన్ 15%, ROE 17% గా ఉంది. ఈ కంపెనీకి రుణ రహితం, బలమైన బ్యాలెన్స్ షీట్‌ ఉంది. టెక్నికల్‌గా... ఈ స్టాక్ దాని 50 DMA కంటే దిగువన, 200 DMA కంటే దాదాపు 11% పైన ట్రేడ్‌ అవుతోంది. 50 DMA స్థాయిని దాటితే, మంచి ర్యాలీ కనిపించవచ్చు.

రాజ్‌రతన్ గ్లోబల్ వైర్ (Rajratan Global Wire)
ఫండమెంటల్‌గా చూస్తే... రూ. 945.39 కోట్ల ఆపరేటింగ్‌ రెవెన్యూతో, ఔట్‌ స్టాండింగ్‌ రెవెన్యూ గ్రోత్‌ 63% నమోదు చేసింది. ప్రి-టాక్స్ మార్జిన్ 17%, ROE 36%. డెట్-టు-ఈక్విటీ రేషియో 16% వద్ద రీజనబుల్‌గా ఉంది. టెక్నికల్‌గా... ఈ స్టాక్ దాని 50 DMA కంటే దిగువన, 200 DMA కంటే దాదాపు 12% పైన ట్రేడ్‌ అవుతోంది. 50 DMA స్థాయిని దాటితే, బెటర్‌మెంట్‌ కనిపించవచ్చు.

HG ఇన్‌ఫ్రా ఇంజినీరింగ్ (HG Infra Engineering)
ఫండమెంటల్‌గా... రూ. 3,917.73 కోట్ల ఆపరేటింగ్‌ రెవెన్యూతో, అత్యుత్తమ వార్షిక ఆదాయ వృద్ధి 44% నమోదు చేసింది. ప్రి-టాక్స్ మార్జిన్ 14%, ROE 26%. డెట్-టు-ఈక్విటీ రేషియో 67%గా ఉంది, ఇది కొంచెం ఎక్కువ. టెక్నికల్‌గా... ఈ స్టాక్ కీలక మూవింగ్‌ యూవరేజ్‌లకు దగ్గరగా ట్రేడ్‌ అవుతోంది. మీనింగ్‌ఫుల్‌ మూవ్‌ కోసం ఈ స్థాయలను ఇది దాటాల్సి ఉంటుంది.

శ్రీ రాయలసీమ హై-స్ట్రెంత్ హైపో (Sree Rayalaseema Hi-Strength Hypo)
ఫండమెంటల్‌గా... రూ. 1,623.32 కోట్ల ఆపరేటింగ్‌ రెవెన్యూతో, అత్యుత్తమ వార్షిక ఆదాయ వృద్ధి 39% నమోదు చేసింది. ప్రి-టాక్స్ మార్జిన్ 11%, ROE 18%. ఈ కంపెనీకి అప్పులు లేవు. బలమైన బ్యాలెన్స్ షీట్‌ ఉంది. సాంకేతికంగా... ఈ స్టాక్ దాని కీలక మూవింగ్‌ యావరేజ్‌ల కంటే దిగువన ట్రేడ్ అవుతోంది. వాటిని దాటితే ఇక పరుగో పరుగు.

గోల్డియం ఇంటర్నేషనల్ (Goldiam International)
ఫండమెంటల్‌గా... రూ. 590.64 కోట్ల ఆపరేటింగ్‌ రెవెన్యూతో, ఔట్‌ స్టాండింగ్‌ రెవెన్యూ గ్రోత్‌ 72% నమోదు చేసింది. ప్రి-టాక్స్ మార్జిన్ 22%, ROE 20%. కంపెనీ రుణ రహితం, ఆదాయ వృద్ధిని నివేదించడానికి వీలుగా బలమైన బ్యాలెన్స్ షీట్‌ ఉంది. సాంకేతికంగా... ఈ స్టాక్ దాని 200 DMAకి దగ్గరగా, 50 DMA కంటే 10% పైన కదులుతోంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
Telangana News: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
AP News: ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
IPL 2024: మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Delhi Capitals vs Gujarat Titans Highlights | రషీద్ ఖాన్ ట్రై చేసినా.. విజయం దిల్లీదే | ABP DesamPawan Kalyan From Pithapuram | Public Opinion | పిఠాపురంలో ప్రజలు ఎటు వైపు..? | ABP DesamCM Revanth Reddy vs Harish Rao | రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరించిన హరీశ్ రావు | ABP DesamPawan Kalyan Dance in Nomination Ryally | కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి నామినేషన్ లో పవన్ చిందులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
Telangana News: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
AP News: ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
IPL 2024: మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
KCR News: ఈ దద్దమ్మలకు దమ్ములేదు, వాళ్ల మెడలు వంచి హామీలు అమలు చేయిస్త - కేసీఆర్
ఈ దద్దమ్మలకు దమ్ములేదు, వాళ్ల మెడలు వంచి హామీలు అమలు చేయిస్త - కేసీఆర్
Medak BRS Candidate :  రూ. వంద కోట్లిస్తా -  మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వినూత్న హామీ !
రూ. వంద కోట్లిస్తా - మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వినూత్న హామీ !
Yadadri Power Plant: యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
Actor Naresh On Pawan Kalyan :  సూపర్ స్టార్ కృష్ణను రాజకీయాల్లోకి లాగవద్దు - పవన్ కు నరేష్ విజ్ఞప్తి
సూపర్ స్టార్ కృష్ణను రాజకీయాల్లోకి లాగవద్దు - పవన్ కు నరేష్ విజ్ఞప్తి
Embed widget