(Source: ECI/ABP News/ABP Majha)
Share Market Opening: స్టాక్ మార్కెట్‌లో ఫ్లాట్ మూమెంట్, పండగ ముందు పెద్దగా ఊపు లేదు
Stock Markets: మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌ల్లో కొనసాగుతున్న ర్యాలీ నుంచి మార్కెట్‌కు కొద్దిగా సపోర్ట్ లభిస్తోంది.
Share Market Opening on 09 November 2023: దీపావళి పండుగకు ముందు ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో పెద్దగా హుషారు కనిపించడం లేదు. గ్లోబల్‌లా సానుకూల సంకేతాలు ఏవీ లేకపోవడంతో, ఈ రోజు (గురువారం) దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ఓపెన్ అయింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌ల్లో కొనసాగుతున్న ర్యాలీ నుంచి మార్కెట్‌కు కొద్దిగా సపోర్ట్ లభిస్తోంది. రేపటి నుంచి దీపావళి 5 రోజుల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఎంపిక చేసిన కొన్ని స్టాక్స్‌లో మాత్రం పండుగ ఎఫెక్ట్ కనిపిస్తోంది, మార్కెట్ ట్రెండ్‌తో సంబంధం అవి బాగా పెరుగుతున్నాయి.
ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...
నిన్న (బుధవారం) 64,976 వద్ద ఆగిన BSE సెన్సెక్స్, ఈ రోజు 50 పాయింట్ల లాభంతో 65,025 స్థాయి వద్ద తిరిగి ప్రారంభమైంది. నిన్న 19,443 పాయింట్ల వద్ద క్లోజ్ అయిన NSE నిఫ్టీ, ఈ రోజు 14 పాయింట్ల స్వల్ప వృద్ధితో 19,457 స్థాయి వద్ద స్టార్ అయింది.
అడ్వాన్స్-డిక్లైన్ రేషియో
మార్కెట్ అడ్వాన్స్-డిక్లైన్ రేషియోను పరిశీలిస్తే... ఓపెనింగ్ టైమ్‌కి BSEలో మొత్తం 2,848 షేర్లు ట్రేడ్ అవుతున్నాయి. వీటిలో 1,666 షేర్లు లాభపడగా, 1,067 షేర్లు నష్టంలో ఉన్నాయి. 115 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.
నిఫ్టీ షేర్ల పిక్చర్
ఈ రోజు మార్కెట్ ప్రారంభంలో, నిఫ్టీ 50 ప్యాక్‌లోని 21 స్టాక్స్ గ్రీన్ మార్క్‌లో ట్రేడవుతుండగా, 29 స్టాక్స్ క్షీణించాయి. మార్కెట్ టాప్ గెయినర్స్‌లో, M &M 1.72 శాతం, అపోలో హాస్పిటల్స్ 1.34 శాతం లాభపడ్డాయి. హీరో మోటోకార్ప్ 1.13 శాతం బలపడింది. టాటా మోటార్స్, BPCL షేర్లు 0.60 శాతం చొప్పున పెరిగాయి.
ప్రి-మార్కెట్ పరిస్థితి
మార్కెట్ ప్రి-ఓపెనింగ్ సెషన్‌లో, సెన్సెక్స్ 27.47 పాయింట్లు పెరిగి 65,003 స్థాయి వద్ద & నిఫ్టీ 31.20 పాయింట్లు లేదా 0.16 శాతం పెరిగి 19,474 స్థాయి వద్ద ఉన్నాయి.
ఉదయం 10 గంటల సమయానికి, సెన్సెక్స్ ఫ్లాట్‌గా, 1.77 పాయింట్లు లేదా 0.0027 శాతం గ్రీన్ కలర్‌లో 64,977 వద్ద కదులుతోంది. నిఫ్టీ 6.10 పాయింట్లు లేదా 0.031 శాతం రెడ్ కలర్‌లో 19,437 స్థాయి దగ్గర ట్రేడ్ అవుతోంది.
మిశ్రమంగా US స్టాక్స్
వడ్డీ రేట్ల పెంపుపై సంకేతాలు, ట్రెజరీ ఈల్డ్స్ ట్రెండ్ కోసం ఫెడరల్ రిజర్వ్ అధికారుల వ్యాఖ్యలపై పెట్టుబడిదార్లు ఫోకస్ పెట్టడంతో, S&P 500 & నాస్‌డాక్ బుధవారం స్వల్పంగా లాభపడ్డాయి.
లాభాల్లో ఆసియా మార్కెట్లు
US ఈక్విటీలు రెండు సంవత్సరాల గరిష్ట స్థాయి లాభాలకు చేరడంతో, ఈ రోజు ఓపెనింగ్‌లో ఆసియా మార్కెట్లు అప్‌ట్రెండ్‌లో ఉన్నాయి. వడ్డీ రేట్లు గరిష్ట స్థాయికి చేరుకున్నాయని, ఇక పెరగవని మార్కెట్లు ఆశలు పెట్టుకున్నాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial