Stock Market Holiday: స్టాక్ మార్కెట్‌కు సోమవారం కూడా సెలవే - 3 రోజుల తర్వాతే ట్రేడింగ్ ప్రారంభం
Stock Market Holidays: ఈసారి సోమవారం రోజున (నవంబర్ 27, 2023) కూడా భారతీయ మార్కెట్‌కు సెలవు వచ్చింది. ఆ రోజున, మిగిలిన గ్లోబల్ మార్కెట్లన్నీ పని చేస్తాయి.
Stock Market Holidays in November 2023: శని, ఆదివారాలతో పాటు కొన్ని కీలక పండుగలు, జాతీయ సందర్భాల్లో స్టాక్ మార్కెట్‌కు సెలవు ఉంటుంది. సాధారణంగా, విద్యాసంస్థలు, బ్యాంకులకు ఇచ్చినన్ని సెలవులు షేర్ మార్కెట్‌కు ఇవ్వకపోయినా... గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం, దసరా, దీపావళి వంటి ప్రత్యేక రోజుల్లో ట్రేడింగ్‌ను నిలిపేస్తారు.
స్టాక్ మార్కెట్‌కు వరుసగా 3 రోజులు సెలవులు
ఇప్పుడు, ఇండియన్ స్టాక్ మార్కెట్‌కు వరుసగా 3 రోజులు హాలిడేస్ వచ్చాయి. శనివారం (నవంబర్ 25, 2023), ఆదివారం (నవంబర్ 26, 2023) రోజుల్లో ఇండియన్ మార్కెట్ సహా ప్రపంచ మార్కెట్లన్నీ సెలవు తీసుకుంటాయి. ఈసారి సోమవారం రోజున (నవంబర్ 27, 2023) కూడా భారతీయ మార్కెట్‌కు సెలవు వచ్చింది. ఆ రోజున, మిగిలిన గ్లోబల్ మార్కెట్లన్నీ పని చేస్తాయి.
సోమవారం రోజున గురునానక్ జయంతి (Guru Nanak Jayanti 2023 Holiday) సందర్భంగా జాతీయ సెలవు దినం ప్రకటించారు. కాబట్టి, సోమవారం నాడు బాంబే స్టాక్ ఎక్సేంజ్ BSE, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ NSEలో ట్రేడింగ్ జరగదు. ఈక్విటీ సెగ్మెంట్, డెరివేటివ్ సెగ్మెంట్, SLB సెగ్మెంట్ సహా అన్ని విభాగాల్లో ప్రొసీడింగ్స్ ఉండవు.
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ MCX (Multi Commodity Exchange) కూడా ఉదయం సెషన్‌లో మూతపడుతుంది, ఈవెనింగ్ సెషన్‌లో ఓపెన్ అవుతుంది. అంటే, సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి 11:30 గంటల వరకు MCX లో ఈవెనింగ్ సెషన్ నడుస్తుంది. దేశంలోని అతి పెద్ద అగ్రికల్చరల్ కమొడిటీ ఎక్సేంజ్ NCDEX (Agricultural Commodity Exchange) రెండు సెషన్లలోనూ క్లోజ్ అవుతుంది.
డిసెంబర్ నెలలోనూ లాంగ్ వీకెండ్
గురునానక్ జయంతి సెలవుతో, నవంబర్ నెలలో స్టాక్ మార్కెట్ వార్షిక సెలవులు ముగుస్తాయి. ఈ ఏడాదిలో మరొక్క సెలవు మిగిలి ఉంది, అది క్రిస్మస్ పండుగ. డిసెంబర్ 25న, క్రిస్మస్ సందర్భంగా (Christmas 2023 Holiday) స్టాక్ మార్కెట్‌కు సెలవు ఉంటుంది. ఈ ఏడాది క్రిస్మస్ కూడా సోమవారమే (Christmas December 25, 2023 Monday) వచ్చింది. అప్పుడు కూడా లాంగ్ వీకెండ్‌ను చూస్తాం. డిసెంబర్ 23న శనివారం, 24 ఆదివారం, 25న సోమవారం క్రిస్మస్ సందర్భంగా వరుసగా మూడు రోజులు మార్కెట్లు పని చేయవు.
మొత్తం క్యాలెండర్ ఇయర్‌లో (2023) ఇండియన్ స్టాక్ మార్కెట్‌కి 15 వార్షిక సెలవులు (శని, ఆదివారాలు కాకుండా) వచ్చాయి, గత సంవత్సరం కంటే రెండు ఎక్కువ. ఈ ఏడాది శని, ఆదివారాల్లోనే నాలుగు ప్రత్యేక సెలవులు కలిసిపోయాయి. అవి.. మహాశివరాత్రి, ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్), మొహర్రం, దీపావళి. ఈ పండుగలు శని, ఆదివారాల్లో రాకుంటే, ఆయా రోజుల్లోనూ ట్రేడింగ్ (non-trading days) నిలిపేస్తారు.
లాంగ్ వీకెండ్‌కు ముందు, శుక్రవారం (నవంబర్ 24, 2023) నాడు మన మార్కెట్‌లో ఫ్లాట్‌గా ట్రేడ్ అయ్యాయి. IT & FMCG స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి వల్ల.. హెడ్‌లైన్ సూచీలు S&P BSE సెన్సెక్స్, నిఫ్టీ 50 లోయర్ సైడ్‌లో క్లోజ్ అయ్యాయి. NSE నిఫ్టీ 7.30 పాయింట్లు లేదా 0.037% తగ్గి 19,795 స్థాయి వద్ద ముగిసింది. BSE సెన్సెక్స్ 47.77 పాయింట్లు లేదా 0.072% కిందకు దిగి 65,970 స్థాయిలో ముగిసింది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply
మరో ఆసక్తికర కథనం: షాక్ కొడుతున్న గోల్డ్ రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే