Adani Group: అడక్కుండానే వరాలు ఇస్తున్న అదానీ స్టాక్స్, రెండు రోజుల ర్యాలీతో రూ.12 లక్షల కోట్ల మైల్‌స్టోన్
ఈ రెండు సెషన్లలో అదానీ గ్రూప్‌లోని ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు దాదాపు 18% లాభపడ్డాయి.
Stock market news in Telugu: అసెంబ్లీ ఎన్నికల్లో బీజీపీ బంపర్ మెజారిటీతో గెలిచిన తర్వాత, సోమవారం తారస్థాయికి దూసుకెళ్లిన ఇండియన్ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (మంగళవారం) కూడా అదే స్పీడ్ కంటిన్యూ చేస్తున్నాయి. ఈ లాభాల వానలో అదానీ స్టాక్స్ తడిసి ముద్దవుతున్నాయి.
కేవలం ఈ రెండు సెషన్లలోనే అదానీ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ ఏకంగా 30% పెరిగింది. గ్రూప్ మార్కెట్ క్యాప్ (market capitalization of the Adani Group stocks) ఈ రోజు రూ. 12 లక్షల కోట్ల మార్కును దాటింది.
ఈ ఏడాది జనవరిలో అమెరికన్ షార్ట్-సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) రిపోర్ట్ తర్వాత భారీగా పడిపోయిన అదానీ గ్రూప్ షేర్లు, ఆ తర్వాత రూ. 12 లక్షల కోట్ల మార్కును టచ్ చేయడం ఇదే మొదటిసారి.
ఇన్వెస్టర్లకు లాభాలు కురిపించిన అదానీ షేర్లు
ఈ రెండు సెషన్లలో, అదానీ గ్రూప్‌లోని ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు దాదాపు 18% లాభపడ్డాయి. ఈ రోజు (Adani Enterprises share price today) ఈ స్టాక్ 10% పెరిగింది, 6 నెలల గరిష్ట స్థాయి రూ. 2,784.30కి చేరింది.
అదానీ గ్రూప్ ATM అయిన అదానీ పోర్ట్స్ ఈ రోజు కొత్త 52 వారాల గరిష్ట స్థాయి రూ. 968.90ని తాకింది (Adani Ports share price today), దాదాపు 10% లాభపడింది.
ఈ ప్యాక్‌లో అదానీ గ్రీన్ ఎనర్జీ టాప్ గెయినర్‌గా ఉంది. ఈ స్టాక్ దాదాపు 19% పెరిగి 6 నెలల గరిష్ట స్థాయి రూ.1,341.6కి (Adani Green Energy share price today) చేరుకుంది.
అదానీ పవర్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ విల్మార్ కూడా 6-14% పైగా లాభపడ్డాయి. గ్రూప్‌లోని సిమెంట్ కంపెనీలు ACC, అంబుజా సిమెంట్స్ వరుసగా 4%, 5% పెరిగాయి.
అదానీ స్టాక్స్ ఈ ఒక్క రోజే గ్రూప్ మొత్తం మార్కెట్ విలువకు రూ. 84,410 కోట్లు యాడ్ చేశాయి. దీంతో, అదానీ గ్రూప్ మార్కెట్ క్యాప్ రూ.12.79 లక్షల కోట్లకు చేరుకుంది.
అదానీ గ్రూప్ మీద హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై సుప్రీంకోర్టులో విచారణ పూర్తయింది. నవంబర్ 24న, న్యాయస్థానం తన తీర్పును రిజర్వ్ చేసింది. అప్పట్నుంచి అదానీ గ్రూప్ షేర్లు ర్యాలీ చేస్తున్నాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: రూపాయి నెత్తిన మరో దరిద్రమైన రికార్డ్ - ఇదే ఇప్పటివరకు ఉన్న చెత్త పరిస్థితి