Stock Market News: 2022లో అట్టడుగుక్కి పడిపోయిన 31 స్టాక్స్, ఇప్పుడు వీటిలో కొన్ని మీ సుడి తిప్పొచ్చు!
ఈ జాబితాలో ఉన్న చాలా పేర్లు ఇటీవలే మార్కెట్‌లోకి ప్రవేశించిన కంపెనీలవి. ఫైనాన్షియల్ టెక్నాలజీ (Fintech) కంపెనీలు కూడా ఈ వెనుకబాటు లిస్ట్‌లో ఉన్నాయి.
Stock Market News: 2022లో అంతర్జాతీయ అస్థిరతల మధ్య భారత మార్కెట్లు పెద్దగా రాణించలేదు. ముఖ్యంగా మిడ్ క్యాప్ (mid cap stocks) & స్మాల్ క్యాప్ (small cap stocks) సెగ్మెంట్లలోని స్టాక్స్ తీవ్రంగా దెబ్బ తిన్నాయి. 2022లో, తక్కువలో తక్కువగా 31 స్టాక్స్ జీవిత కాల కనిష్టాలకు (all-time lows) పడిపోయాయి.
ఈ జాబితాలో ఉన్న చాలా పేర్లు ఇటీవలే మార్కెట్‌లోకి ప్రవేశించిన కంపెనీలవి. ఫైనాన్షియల్ టెక్నాలజీ (Fintech) కంపెనీలు కూడా ఈ వెనుకబాటు లిస్ట్‌లో ఉన్నాయి. ఇవి ఇప్పటి వరకు కొంచం కూడా కోలుకోలేదు.
జూన్‌లో 14 స్టాక్స్ బతుకు బస్టాండ్
2022 జూన్‌లో, బెంచ్‌మార్క్ సూచీలు 52 వారాల కనిష్టానికి చేరినప్పుడు దాదాపు 14 స్క్రిప్స్ ఆల్ టైమ్ కనిష్ట స్థాయులను తాకాయి. వాటిలో... GR ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్, నజారా టెక్నాలజీస్, క్యాంపస్ యాక్టివ్‌వేర్, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC), కళ్యాణ్ జువెలర్స్, లాటెంట్ వ్యూ అనలిటిక్స్, RBL బ్యాంక్, శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ AMC, ఆప్టస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్ ఇండియా, నువోకో విస్టాస్ కార్పొరేషన్, విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, సఫైర్ ఫుడ్స్ ఇండియా, ఏథర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి.
వీటిలో... ఆదిత్య బిర్లా సన్ లైఫ్ AMC, నువోకో విస్టాస్, GR ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్, క్యాంపస్ యాక్టివ్‌వేర్, లాటెంట్ వ్యూ అనలిటిక్స్, విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ వంటి స్టాక్స్ కనిష్ట స్థాయుల నుంచి రికవరీ కాలేకపోతున్నాయి. ఈ స్టాక్స్ వాటి 52 వారాల గరిష్ట స్థాయుల (52-week highs) నుంచి ఇప్పటి వరకు 29 శాతం నుంచి 69 శాతం వరకు తగ్గాయి.
2022 డిసెంబర్‌లో ఈక్విటీ మార్కెట్ బాగా పడిపోయినప్పుడు, ఐదు స్టాక్స్.. క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ లిమిటెడ్, FSN ఈ-కామర్స్ వెంచర్స్, ఇండిగో పెయింట్స్, రోస్సరి బయోటెక్, మెడ్‌ప్లస్ హెల్త్ సర్వీసెస్ 'ఆల్ టైమ్ లోస్'కు చేరుకున్నాయి.
డెలివెరీ, మెడ్‌ప్లస్ హెల్త్, FSN ఈ-కామర్స్ స్టాక్స్ తిరిగి 52-వారాల గరిష్ట స్థాయిని మళ్లీ పరీక్షించాలంటే, ఇప్పటి నుంచి రెట్టింపు విలువకు పైగా పెరగాల్సి ఉంటుంది.
పుంజుకుంటున్న స్టాక్స్
వీటిలో కొన్ని కంపెనీలు ఆల్ టైమ్ కనిష్ట స్థాయుల నుంచి బాగానే పుంజుకున్నాయి, అదే ట్రెండ్ కొనసాగిస్తున్నాయి. జీవిత కాల కనిష్టం నుంచి ఇప్పటి వరకు, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ AMC 22 శాతం పెరిగింది. నజారా టెక్నాలజీస్ 22 శాతం, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) 22 శాతం, లాటెంట్ వ్యూ అనలిటిక్స్ 21 శాతం, మెడ్ ప్లస్ హెల్త్ సర్వీసెస్ 13 శాతం, రోస్సరీ బయోటెక్ 12 శాతం, GR ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ 11 శాతం, శ్యామ్ మెటాలిక్స్ 10 శాతం, FSN ఈ-కామర్స్ వెంచర్స్ (Nykaa) 8 శాతం, డెలివెరీ 6 శాతం, క్లీస్ సైన్స్ అండ్ టెక్ 3 శాతం, ఇండిగో పెయింట్స్ 2 శాతం రికవరీని చూశాయి.
2022లో ఆల్ టైమ్ గరిష్టాలను తాకిన స్టాక్స్‌లో.. రెయిన్‌బో చిల్డ్రన్స్ మెడికేర్, రెస్టారెంట్ బ్రాండ్స్ ఏసియా, మదర్‌సన్ సుమీ వైరింగ్, గో ఫ్యాషన్ (ఇండియా), వేదాంత్ ఫ్యాషన్స్, అదానీ విల్మార్ లిమిటెడ్ సహా చాలా పేర్లు ఉన్నాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.