అన్వేషించండి

Stock Market Holiday: ఈ రోజు స్టాక్‌ మార్కెట్లకు హాలిడేనా? డౌట్‌ తీర్చుకోండి

Share Market Today: ఈద్ మిలాద్-ఉన్-నబీ గురించి పెట్టుబడిదార్లలో ఓ ప్రశ్న మెదులుతోంది. ఈ రోజు (సోమవారం) BSE & NSE తెరిచి ఉంటాయా లేదా ట్రేడింగ్‌కు సెలవు ఇచ్చారా అని గూగుల్‌ చేస్తున్నారు.

Stock Market News Today In Telugu: గత ట్రేడింగ్‌ సెషన్‌లో (శుక్రవారం, 13 సెప్టెంబర్‌ 2024) ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు మిశ్రమ ఫలితాలు ఇచ్చాయి. అయితే.. గత వారంలో మార్కెట్‌లో రికార్డ్‌ల మోత మోగింది. శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌లో, ప్రధాన సూచీలైన BSE సెన్సెక్స్ & NSE నిఫ్టీ పడిపోయినప్పటికీ, మిడ్ క్యాప్ ఇండెక్స్‌ కొత్త రికార్డ్‌ గరిష్ట స్థాయికి చేరింది. మిడ్‌ క్యాప్స్‌లో కొనుగోళ్ల ఫలితంగా నిఫ్టీ మిడ్‌ క్యాప్ ఇండెక్స్ తొలిసారిగా 60,000 స్థాయిని దాటి 60,189.35 వద్ద ఆల్‌టైమ్ రికార్డ్‌ లెవెల్‌ను (Nifty mid-cap index at all time high) టచ్‌ చేసింది. ఆ రోజు ట్రేడింగ్‌ ఆగిపోయే సమయానికి నిఫ్టీ మిడ్‌ క్యాప్ 100 ఇండెక్స్‌ 60,034 వద్ద క్లోజ్‌ అయింది. శుక్రవారం నాడు నిఫ్టీ స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో కూడా మంచి కొనుగోళ్లు జరిగాయి. 

అంతేకాదు, శుక్రవారం నాడు, బీఎస్ఈలో నమోదైన అన్ని కంపెనీల మార్కెట్ విలువ (market capitalization of indian stock market) మొట్టమొదటిసారిగా రూ. 469 లక్షల కోట్ల మార్క్‌ను చేరింది. ఆ రోజు నమోదైన రెండో రికార్డ్‌ ఇది. ట్రేడ్‌ క్లోజింగ్‌ సమయానికి, బీఎస్‌ఈలో లిస్టయిన అన్ని స్టాక్స్ మార్కెట్ క్యాప్‌ రూ. 468.80 లక్షల కోట్ల వద్ద ముగిసింది. ఆ ఒక్క రోజే, బీఎస్‌ఈలో పెట్టుబడిదార్ల సంపద రూ.1.44 లక్షల కోట్లు పెరిగింది.

శుక్రవారం నాడు సెన్సెక్స్ 71 పాయింట్లు పెరిగి 82,890.94 పాయింట్ల వద్ద, నిఫ్టీ 32 పాయింట్లు తగ్గి 25,356 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి.

దీనికిముందు రోజున కూడా పాత రికార్డ్‌లు బ్రేక్ అయ్యాయి. గురువారం (సెప్టెంబరు 12, 2024) నాడు, BSR సెన్సెక్స్ & NSE నిఫ్టీ రెండూ ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. సెన్సెక్స్ ఆల్ టైమ్ హై 83,116.19ని, నిఫ్టీ 50 లైఫ్ టైమ్ హై 25,433.35ని టచ్‌ చేశాయి.

ఈ రోజు (సోమవారం) స్టాక్‌ మార్కెట్లకు సెలవా?
ఈ రోజు (2024 సెప్టెంబర్ 16, సోమవారం), ముస్లింలకు పవిత్రమైన ఈద్ మిలాద్-ఉన్-నబీ పర్వదినం. ఈ పండుగ కారణంగా ఈ రోజు ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు తెరిచి ఉంటాయా లేదా ట్రేడింగ్‌కు సెలవు ఇచ్చారా అనే విషయంలో కొంత గందరగోళం ఏర్పడింది. బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ BSE & నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ NSE వెబ్‌సైట్‌ల ప్రకారం, 2024 స్టాక్ మార్కెట్ సెలవుల అధికారిక జాబితాలో, ఈద్ మిలాద్-ఉన్-నబీని సెలవు రోజుగా చేర్చలేదు. అందువల్ల, ఈ రోజు రెండు ఎక్స్ఛేంజీలు యథావిధిగా తెరిచి ఉంటాయి, అన్ని కార్యకలాపాలు జరుగుతాయి. కాబట్టి, ఇన్వెస్టర్లు & ట్రేడర్లు యాక్టివ్‌గా మార్కెట్‌లో పార్టిసిపేట్‌ చేయొచ్చు.

BSE & NSE వెబ్‌సైట్‌లలోని అధికారిక సెలవుల జాబితా 2024 ప్రకారం, తదుపరి సెలవు రోజు అక్టోబర్ 2, 2024న (బుధవారం) ఉంటుంది. ఆ రోజు మహాత్మాగాంధీ జయంతి. ఆ రోజు ఇండియన్‌ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్‌ నిర్వహించరు. ఆ తర్వాత.. నవంబర్ 01, శుక్రవారం రోజున దీపావళి లక్ష్మి పూజ సందర్భంగా; నవంబర్ 15 శుక్రవారం నాడు  గురునానక్ జయంతి సందర్భంగా; డిసెంబర్ 25 బుధవారం రోజున క్రిస్మస్ సందర్భంగా స్టాక్‌ మార్కెట్లకు సెలవు ఉంటుంది.

మరో ఆసక్తికర కథనం: 17 ఏళ్లకే లవ్ ఫెయిల్ - రోడ్డు పక్కన కాఫీ అమ్మారు -ఇప్పుడు కోట్లకు అధిపతి - ఈ మహిళ సాధించారు !

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు - తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు - తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మపుష్ప 2 ట్రైలర్‌లో హైలైట్ షాట్ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు - తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు - తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
Golbal Star Ram Charan : అయ్యప్ప మాలలో కడప దర్గాకు వెళ్తోన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. కారణం ఇదేనా?
అయ్యప్ప మాలలో కడప దర్గాకు వెళ్తోన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. కారణం ఇదేనా?
Posani Krishna Murali: సీఎం చంద్రబాబు, పవన్‌లపై అనుచిత వ్యాఖ్యలు - నటుడు పోసాని, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడలపై కేసులు నమోదు
సీఎం చంద్రబాబు, పవన్‌లపై అనుచిత వ్యాఖ్యలు - నటుడు పోసాని, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడలపై కేసులు నమోదు
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Embed widget