Share Market Closing Today: పరిమిత లాభాలతో సరిపెట్టుకున్న మార్కెట్లు - మిడ్, స్మాల్ క్యాప్స్‌లో జోష్
Stock Market Telugu News: ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 90 పాయింట్ల జంప్‌తో 73,738 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 32 పాయింట్లు పెరిగి 22,368 పాయింట్ల దగ్గర క్లోజయ్యాయి.
Stock Market News Today in Telugu: భారత స్టాక్ మార్కెట్ వరుసగా మూడో ట్రేడింగ్ సెషన్‌లోనూ లాభాలతో ముగిసింది. అయితే, ఈ రోజు (మంగళవారం, 23 ఫిబ్రవరి 2024) మార్కెట్లు పరిమిత లాభాలతో సరిపెట్టుకున్నాయి. రోజంతా పడుతూ, లేస్తూ సాగిన ట్రేడింగ్.. రోలర్ కోస్టర్ రైడ్‌ను తలపించింది, రేంజ్ బౌండ్‌లో సాగింది. అయితే.. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లలో చాలా ఉత్సాహం కనిపించింది. ఎఫ్‌ఎంసీజీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఐటీ స్టాక్‌లలో మంచి షాపింగ్ జరిగింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 90 పాయింట్ల జంప్‌తో 73,738 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 32 పాయింట్లు పెరిగి 22,368 పాయింట్ల దగ్గర క్లోజయ్యాయి.
ఏ సెక్టార్లు ఎలా పని చేశాయి?
ఈ రోజు ట్రేడింగ్‌లో మిడ్ క్యాప్ & స్మాల్ క్యాప్ షేర్లు ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా నిలిచాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 518 పాయింట్ల లాభంతో ముగియగా, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 203 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ రియాల్టీ 2.6 లాభపడింది. బ్యాంకింగ్, ఐటీ, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాల షేర్లు కూడా ఎగబాకాయి. మరోవైపు... ఫార్మా, హెల్త్‌కేర్, ఆయిల్ & గ్యాస్, ఎనర్జీ, మెటల్స్ రంగాల షేర్లు దిగజారాయి.
పెరిగిన & పడిపోయిన స్టాక్స్
సెన్సెక్స్ 30 ప్యాక్‌లో.. 18 స్టాక్స్ లాభాలతో ముగియగా, 12 స్టాక్స్ నష్టాల్లో రోజును ముగించాయి. నిఫ్టీ50 ప్యాక్‌లో.. 30 స్టాక్స్ పచ్చ రంగులో, 20 స్టాక్స్ ఎర్ర రంగులో క్లోజ్ అయ్యాయి. గ్రాసిమ్ 3.93 శాతం, భారతి ఎయిర్‌టెల్ 3.45 శాతం, నెస్లే 1.73 శాతం, మారుతి సుజుకీ 1.65 శాతం, టాటా మోటార్స్ 1.36 శాతం పెరిగాయి. అదే సమయంలో.. సన్ ఫార్మా 3.60 శాతం, బీపీసీఎల్ 1.73 శాతం, రిలయన్స్ 1.39 శాతం పతనంతో ఆగాయి.
మళ్లీ రూ.400 లక్షల కోట్లకు మార్కెట్ క్యాప్
ఈ ట్రేడింగ్‌లో, బీఎస్‌ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ (BSE Market Capitalisation) మళ్లీ 400 లక్షల కోట్ల రూపాయలను దాటింది. అయితే చివరి గంటలో గరిష్ట స్థాయి నుంచి పతనం కావడంతో మార్కెట్ క్యాప్ ఈ స్థాయి నుంచి కిందకు దిగక తప్పలేదు. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి మార్కెట్ క్యాపిటలైజేషన్ 399.68 లక్షల కోట్ల రూపాయల వద్ద స్థిరపడింది. దీనికి ముందు ట్రేడింగ్ సెషన్‌లో (సోమవారం) ఇది 397.85 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. ఈ లెక్కన, ఈ రోజు సెషన్‌లో పెట్టుబడిదార్ల సంపద రూ.1.83 లక్షల కోట్లు పెరిగింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: మే నెల నుంచి మారే మనీ రూల్స్, మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే తప్పక తెలుసుకోవాలి