Money Rules: మే నెల నుంచి మారే మనీ రూల్స్, మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే తప్పక తెలుసుకోవాలి
Money Rules from 1May: గృహ & వాణిజ్య అవసరాలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ల రేట్లను చమురు కంపెనీలు సవరిస్తాయి. మే నెల నుంచి మారే మనీ రూల్స్, మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే తప్పక తెలుసుకోవాలి
Financial Rules Changing from 01 May 2024: మరికొన్ని రోజుల్లో ఏప్రిల్ నెల ముగుస్తుంది. ప్రతి నెలలాగే, మే నెల ప్రారంభం నుంచి కొన్ని ఆర్థిక నియమాలు మారబోతున్నాయి, సాధారణ ప్రజల జేబులపై అవి నేరుగా ప్రభావం చూపుతాయి. బ్యాంక్ ఖాతాల దగ్గర నుంచి ఎల్‌పీజీ సిలిండర్ ధరల వరకు చాలా విషయాల్లో సర్దుబాట్లు ఉంటాయి. వచ్చే నెల నుంచి ఎలాంటి సవరణలు జరగబోతున్నాయో ముందే తెలుసుకుంటే, ఆర్థిక నష్టాన్ని కొంత వరకు నివారించవచ్చు.
2024 మే 01 నుంచి మారే ఫైనాన్షియల్ రూల్స్
యెస్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ రూల్స్
యెస్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం, మే 01 నుంచి, వివిధ రకాల పొదుపు ఖాతాల కనీస సగటు నిల్వ (Minimum Average Balance) మారుతుంది. యెస్ బ్యాంక్ ప్రో మాక్స్ మినిమమ్ యావరేజ్ బ్యాలెన్స్ (MAB) రూ. 50,000గా మారుతుంది. దీనిపై గరిష్ట రుసుము రూ. 1000గా నిర్ణయించారు. ప్రో ప్లస్ పొదుపు ఖాతాలు Yes Respect SA, Yes Essence SAలో కనీస సగటు నిల్వ పరిమితిని రూ. 25,000గా సవరించారు. ఈ ఖాతాకు గరిష్ట రుసుమును రూ. 750గా నిర్ణయించారు. బ్యాంక్ అకౌంట్ ప్రోలో కనీస నిల్వ రూ. 10,000. దీనిపై గరిష్ట రుసుము రూ. 750గా మారింది.
ఐసీఐసీఐ బ్యాంక్ నిబంధనలు
ఐసీఐసీఐ బ్యాంక్ కూడా సేవింగ్స్ ఖాతాకు సంబంధించిన సర్వీస్ ఛార్జ్ నిబంధనలు మార్చింది. ఈ బ్యాంక్ డెబిట్ కార్డ్ లావాదేవీల విషయంలో.. గ్రామీణ ప్రాంతాల్లో రూ. 99, పట్టణ ప్రాంతాల్లో రూ. 200 వార్షిక రుసుము (Annual fee) చెల్లించాలి. బ్యాంక్ చెక్ విషయంలో.. 25 లీఫ్స్ వరకు ఎలాంటి ఛార్జ్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ ఒక్కో పేజీకి రూ.4 చొప్పున సమర్పించుకోవాలి. IMPS లావాదేవీల ఛార్జ్‌ను రూ. 2.50 నుంచి రూ. 15 వరకు నిర్ణయించారు.
HDFC బ్యాంక్ స్పెషల్ FD స్కీమ్
దేశంలోని అతి పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, సీనియర్ సిటిజన్‌ల కోసం అమలు చేస్తున్న "హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీనియర్ సీటిజన్ కేర్ ఎఫ్‌డీ" గడువును మే 10 వరకు పొడిగించింది. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం కింద, సీనియర్ సిటిజన్లకు 0.75 శాతం అధిక వడ్డీ రేటును బ్యాంక్ అందిస్తోంది. 5 - 10 సంవత్సరాల కాలపరిమితి FDపై ఇన్వెస్టర్లకు 7.75 శాతం వడ్డీ అందుతుంది. ఈ పథకం కింద, సీనియర్ సిటిజన్లు రూ. 5 కోట్ల వరకు డిపాజిట్ చేయొచ్చు.
బ్యాంక్‌లకు 14 రోజులు సెలవులు
2024 మే నెలలో ఆదివారాలు, రెండు & నాలుగు శనివారాలు, వివిధ పండుగలు, సందర్భాల కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు 12 రోజులు సెలవులు వచ్చాయి. ఈ సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారతాయి. ఈ 12 రోజుల్లో.. రెండు & నాలుగు శనివారాలు, 4 ఆదివారాలు కూడా కలిసి ఉన్నాయి.
LPG సిలిండర్ ధరలలో మార్పు
ప్రతి నెల ఒకటో తేదీన LPG సిలిండర్ల ధరలు మారతాయి, మే 01న కూడా మారబోతున్నాయి. గృహ & వాణిజ్య అవసరాలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ల రేట్లను చమురు కంపెనీలు సవరిస్తాయి.
మరో ఆసక్తికర కథనం: బంగారం కొనాలనుకునే వారికి గోల్డెన్ ఛాన్స్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే