![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Share Market Closing Today: సేల్స్‌తో హోరెత్తిన మార్కెట్లు - సెన్సెక్స్‌కు 1300 pts, నిఫ్టీకి 370 పాయింట్ల నష్టం
Stock Market Crashe: బీఎస్‌ఈలో లిస్టయిన స్టాక్‌ల మార్కెట్ క్యాప్ రూ.474.25 లక్షల కోట్లకు క్షీణించింది, ఇన్వెస్టర్లు ఈ ఒక్కరోజే రూ.3.68 లక్షల కోట్ల నష్టపోయారు.
![Share Market Closing Today: సేల్స్‌తో హోరెత్తిన మార్కెట్లు - సెన్సెక్స్‌కు 1300 pts, నిఫ్టీకి 370 పాయింట్ల నష్టం stock market closing today 30 September 2024 sensex nifty crashes reliance bank it and auto stocks drag Share Market Closing Today: సేల్స్‌తో హోరెత్తిన మార్కెట్లు - సెన్సెక్స్‌కు 1300 pts, నిఫ్టీకి 370 పాయింట్ల నష్టం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/30/86d0d8be1583205c90327fdcece2d44f1727692354100545_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Stock Market Closing On 30 September 2024: సెప్టెంబర్ నెలలో చివరి ట్రేడింగ్ సెషన్‌ను స్టాక్ మార్కెట్లు భారీ పతనంతో ముగించాయి. ఈ రోజు (సోమవారం, 30 సెప్టెంబర్ 2024) జరిగిన విధ్వంసంతో నెల మొత్తం మార్కెట్‌లో ఉన్న బుల్లిష్ ఉత్సాహం దెబ్బతింది. ప్రధాన సూచీలు సహా అన్ని సూచీలు తీవ్రంగా జారిపోయాయి. బ్యాంకింగ్, ఆటో రంగాలతో పాటు పెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు భారీగా ఆవిరి కావడంతో ఓవరాల్‌గా మార్కెట్‌లో బ్లీడింగ్ జరిగింది.
ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 1,272.07 పాయింట్లు లేదా 1.49% నష్టంతో 84,299.78 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 368.10 పాయింట్లు లేదా 1.41% పతనంతో 25,810.85 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ ఉదయం సెన్సెక్స్ 85,208.76 దగ్గర, నిఫ్టీ 26,061.30 దగ్గర ఓపెన్ అయ్యాయి.
పెరిగిన & పడిపోయిన షేర్లు
నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 30 ప్యాక్‌లో 5 స్టాక్స్ మాత్రమే లాభాలతో రోజును ముగించగా, 25 స్టాక్స్ నష్టాలను పోగేసుకున్నాయి. పెరిగిన స్టాక్స్ - జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 2.86 శాతం, ఎన్‌టీపీసీ 1.27 శాతం, టాటా స్టీల్ 1.17 శాతం, టైటన్ 0.41 శాతం, ఏషియన్ పెయింట్స్ 0.22 శాతం లాభంతో ముగిశాయి. రిలయన్స్ షేరు 3.23 శాతం, యాక్సిస్ బ్యాంక్ 3.12 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 2.58 శాతం, నెస్లే 2.12 శాతం, టెక్ మహీంద్రా 2.10 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 2.03 శాతం, మారుతీ సుజుకీ 1.99 శాతం పతనంతో ముగిశాయి.
మరో ఆసక్తికర కథనం: కేఆర్‌ఎన్ ఐపీవో అలాట్‌మెంట్ స్టేటస్‌ను ఇలా చెక్ చేయండి - లిస్టింగ్ గెయిన్స్ పక్కా!
సెక్టార్ల వారీగా...
మార్కెట్లో అత్యధిక ప్రాఫిట్ బుకింగ్ బ్యాంకింగ్ షేర్లలో కనిపించింది. నిఫ్టీ బ్యాంక్ కూడా 857 పాయింట్లు నష్టపోయింది. ఆటో, ఐటీ షేర్లు కూడా క్షీణించాయి. ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, ఎనర్జీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లలో కూడా అమ్మకాలు వెల్లువెత్తాయి. మెటల్స్, మీడియా షేర్లు మాత్రమే లాభాలతో ముగిశాయి. నేటి ట్రేడింగ్‌లో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు కూడా జావగారాయి.
మార్కెట్ క్యాప్
స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం కారణంగా, నేటి సెషన్‌లో ఇన్వెస్టర్లు భారీ నష్టాలను చవిచూశారు. శుక్రవారం సెషన్‌లో రూ.477.93 లక్షల కోట్ల వద్ద ఉన్న బీఎస్‌ఈలో లిస్టయిన అన్ని కంపెనీల మార్కెట్ విలువ, ఈ రోజు రూ.474.25 లక్షల కోట్ల వద్ద ముగిసింది. అంటే, ఈ రోజు సెషన్‌లో ఇన్వెస్టర్లు రూ.3.68 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూశారు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: కోల్డ్‌ప్లే టిక్కెట్ల కోల్డ్ వార్ - బుక్‌మైషో CEOకి రెండోసారి పోలీసుల నోటీస్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)