అన్వేషించండి

SIP Investment Plan: దీర్ఘకాలంలో లాభాల కోసం సిప్ ఒక్కటే బెస్ట్.. తెలివిగా ఇన్వెస్ట్‌మెంట్ రూట్ తెలుసుకోండి

నేటి కాలంలో డబ్బు ఆదా చేయడం ఒక్కటే సరిపోదు. మీకు సరైన పెట్టుబడి పెట్టడం ద్వారా లాభాలు రావడం ముఖ్యం. సిప్ ఒక్కటే బెస్ట్ సొల్యూషన్ అని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

SIP Investment plan: ఈ రోజుల్లో డబ్బు ఆదా చేసుకోవడం మాత్రమే తెలివైన పని కాదు, అదే సమయంలో సరైన పద్ధతిలో పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఏ ప్లాన్ లేకుండా పెట్టుబడి పెడితే, దాని పూర్తి ప్రయోజనం పొందలేం. కొన్నిసార్లు నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంది. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP)లో పెట్టుబడి పెట్టడం తేలిక, తక్కువ రిస్క్ ఉంటుందని భారత ప్రజలు భావిస్తున్నారు. 

SIP ద్వారా క్రమం తప్పకుండా ప్రతినెలా కొంత మొత్తం ఆదా చేయడం ద్వారా, దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో నగదు పొందుతారు. అదే సమయంలో, ఆర్థిక క్రమశిక్షణ, బ్యాలెన్స్, సరైన ఆలోచనతో ముందుకు సాగడంతో పెట్టుబడిదారులకు అద్భుతమైన రాబడిని ఇస్తుంది. ఇలా చేయడం ద్వారా భవిష్యత్తులో ఆర్థిక పరిస్థితిని మరింత బలోపేతం చేస్తుంది. 

పెట్టుబడి బ్యాలెన్సింగ్ చేసుకోవాలి

ఎక్కడైనా ఇన్వెస్ట్ పెట్టేటప్పుడు, మొత్తం డబ్బు ఒకే చోట, ఒకే విధానంలో ఇన్వెస్ట్ చేయకూడదని గుర్తుంచుకోవాలి. పెట్టుబడిని వేర్వేరు భాగాలుగా విభజించాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. 5 ఫింగర్ ఫ్రేమ్‌వర్క్ ఇదే ఆలోచనతో పనిచేస్తుంది. దీనిలో మీ పొదుపును 5 భాగాలుగా విభజించి నగదు పెట్టుబడి పెడతారు.

ఇందులో ఎక్కువ నమ్మదగిన, బలమైన ఆప్షన్లు, తక్కువ ధరలకు లభించే అవకాశాలు, వృద్ధి, మీ నగదు పెడ్డుబడిలో బ్యాలెన్సింగ్  అవసరం. చిన్న స్థాయి ఆప్షన్లు, విదేశీ మార్కెట్లలో పెట్టుబడి అంశాలు సైతం ఉన్నాయి. ఈ రకమైన వ్యూహంతో నష్టాల ప్రమాదం కొంతమేర తగ్గుతుంది. అదే సమయంలో మంచి రాబడికి అవకాశం పెరుగుతుంది.

మార్కెట్‌లో కొనసాగడమే సక్సెస్ సీక్రెట్ 

పెట్టుబడిదారులు SIPలో కొన్ని సందర్భాలలో కనిపించే నష్టానికి భయపడి, మొత్తం అమ్మాలని నిర్ణయించుకోవడం తరచుగా చేస్తుంటారు. అయితే, మీరు దీర్ఘకాలం పాటు ఇన్వెస్టిమెంట్ చేయాలని భావిస్తే, మీ పెట్టుబడిపై మంచి రాబడిని పొందవచ్చు. అందువల్ల, దీర్ఘకాలంలో మీకు కచ్చితంగా మంచి రాబడి ఉంటుంది. తక్కువ సమయంలో అనిశ్చితి కారణంగా తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని, అయితే అత్యవసరంగా అవసరమయ్యే నగదును పెట్టుబడికి వాడొద్దని సూచిస్తున్నారు. 

దీర్ఘకాలంలో మంచి ఫలితాలు

ఇన్వెస్టిమెంట్ ప్రారంభ దశలో మార్కెట్ పరిస్థితులు చాలాసార్లు పెట్టుబడిదారులను కలవరపరుస్తాయి. కొన్నిసార్లు మీ నగదు పెరుగుతుంది, కొన్నిసార్లు నష్టాలకు దారి తీస్తుంది. అప్పుడు మీరు ఓపికగా ఉండాలి. కానీ ఏదైనా పెట్టుబడి దాదాపు 7 సంవత్సరాల పాటు కొనసాగితే, దానిపై కాంపౌండింగ్ ప్రభావం కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు నష్టాలు ఉండవని, ఈ సమయంలో, డబ్బు విలువ పెరిగి ఆదాయాన్ని సృష్టిస్తుంది. అందుకే దీర్ఘకాలం పాటు పెట్టుబడిలో నగదును ఉంచడం  ముఖ్యం. ఎందుకంటే కాలంతో పాటు వాటి విలువ పెరిగి, మీరు స్థిరమైన రాబడి అందుకుంటారు. స్టాక్ మార్కెట్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్లు లాంటివి అనుభవం లేమి కారణంగా మీ నగదును మొత్తం పోగొట్టుకుంటారు.

నిరాకరణ: (ఇక్కడ అందించిన వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే ఇచ్చాం. అంతేగానీ మార్కెట్‌లో పెట్టుబడి రిస్క్‌కు లోబడి ఉంటుందని తెలుసుకోండి. ఎక్కడైనా మీ నగదు ఇన్వెస్ట్ చేసేముందు ఆర్థిక నిపుణులను సంప్రదించి మీకు ఉన్న టార్గెట్, టైంను బట్టి నిర్ణయం తీసుకోవాలి. ABP ఎవరికీ డబ్బు పలానాచోట ఇన్వెస్ట్ చేయాలని ఎప్పుడూ సలహా ఇవ్వదు.)

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget