అన్వేషించండి

Banking: ఆదివారమైనా బ్యాంక్‌లు, LIC ఆఫీస్‌లు తెరిచే ఉంటాయి, మీ పని పూర్తి చేసుకోండి

నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (NEFT), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (RTGS) పని చేస్తాయి. చెక్ క్లియరింగ్ సేవలు కూడా ఈ రోజు కొనసాగుతాయి.

Banks, LIC Offices Works on Sunday: ఈ రోజు ఆదివారమైనా (మార్చి 31) బ్యాంక్‌లు, ఎల్‌ఐసీ ఆఫీసులు పని చేస్తాయి. ఆదాయ పన్ను కార్యాలయాలకు కూడా ఈ రోజు సెలవు లేదు. 

2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ రోజు చివరి రోజు కాబట్టి, సంవత్సరాంతం లోగా పూర్తి చేయాల్సిన పనుల కోసం ప్రజలకు ఈ అవకాశం కల్పించారు. ఆదివారం కూడా అన్ని ఏజెన్సీ బ్యాంక్‌ల శాఖలు తెరిచి ఉంచాలని రిజర్వ్‌ బ్యాంక్‌ గతంలోనే ఆదేశించింది. ఏజెన్సీ బ్యాంకుల్లో 12 ప్రభుత్వ బ్యాంకులతో సహా మొత్తం 33 బ్యాంకులు ఉన్నాయి. స్టేట్‌ బ్యాంక్‌ (SBI), పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (PNB), బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB), HDFC బ్యాంక్, ICICI బ్యాంక్‌తో సహా అన్ని ప్రధాన బ్యాంకులు ఈ రోజు పని చేస్తాయి. సాధారణ పని గంటల్లో సేవలు అందిస్తాయి.

ఈ రోజు అందే బ్యాంక్‌ సేవలు
ఈ రోజు అర్ధరాత్రి వరకు... నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (NEFT), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (RTGS) పని చేస్తాయి. చెక్ క్లియరింగ్ సేవలు కూడా ఈ రోజు కొనసాగుతాయి. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (PPF), కిసాన్‌ వికాస్‌ పత్ర ‍‌(KVP), సుకన్య సమృద్ధి యోజన (SSY) వంటి పథకాల్లో కనీస డిపాజిట్‌ చేయడానికి ఇదే చివరి రోజు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి టాక్స్‌ సేవింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ చేసేందుకు కూడా ఆదివారమే ఆఖరు. కాబట్టి, వీటికి సంబంధించిన లావాదేవీలను బ్యాంకుల్లో అనుమతిస్తారు. 

కొత్త ఆర్థిక సంవత్సరం 2024-25 మొదటి రోజున (సోమవారం, 01 ఏప్రిల్‌ 2024) మాత్రం బ్యాంక్‌లు సాధారణ లావాదేవీలు నిర్వహించవు. 2023-24 ఆర్థిక సంవత్సరం ఖాతాలను ముగించే పనిలో బిజీగా ఉంటాయి.

స్వాగతం పలకనున్న ఎల్‌ఐసీ ఆఫీసులు
దేశంలో అతి పెద్ద బీమా కంపెనీ 'లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' (LIC) ఆఫీసులు ఆదివారం కూడా మీకు స్వాగతం పలుకుతాయి. మార్చి 31తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున ఆదివారం నాడు అన్ని కార్యాలయాలను తెరిచి ఉంచాలని LIC నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఏ పనైనా చివరి రోజులో పూర్తి చేయడంలో కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా LIC ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణ రోజుల మాదిరిగానే, సాధారణ పని గంటల ప్రకారం పని చేస్తాయి. ఎల్‌ఐసీకి సంబంధించిన ఏదైనా పని పూర్తి చేయాల్సి వస్తే, మీరు ఈ రోజు కూడా ఎల్‌ఐసీ ఆఫీస్‌కు వెళ్లొచ్చు.

ఎల్‌ఐసీ పాటు చాలా బీమా కంపెనీలు కూడా ఈ ఆదివారం నాడు పని చేస్తాయి.

ఆదాయ పన్ను కార్యాలయాలు కూడా..
ఆదాయ పన్ను విభాగం కార్యాలయాలు కూడా ఈ రోజు తెరిచి ఉంటాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను చెల్లింపుదార్లు ఇంకా ఏదైనా పని పూర్తి చేయాల్సి ఉంటే, ఆదివారం నాడు కూడా ఆ పనిని పూర్తి చేయవచ్చు. లేదా, ఇన్‌కమ్‌ టాక్స్‌ ఆఫీస్‌కు వెళ్లాల్సివస్తే నిరభ్యంతరంగా వెళ్లొచ్చు.

మరో ఆసక్తికర కథనం: రూ.5 లక్షల పెట్టుబడికి రూ.43,000 వడ్డీ, ఈ రోజే లాస్ట్‌ ఛాన్స్‌- ఆలస్యానికి ఆశాభంగం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Tirumala News: తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
Bigg Boss Rohini: రోహిణి దెబ్బకు మారిన బిగ్ బాస్ లెక్కలు... శివంగిలా ఆడుతూ టాప్ 5 లిస్టులోకి Jabardasth లేడీ
రోహిణి దెబ్బకు మారిన బిగ్ బాస్ లెక్కలు... శివంగిలా ఆడుతూ టాప్ 5 లిస్టులోకి Jabardasth లేడీ
Telangana: మేం అలా చేసి ఉంటే చర్లపల్లి జైల్లో చిప్పకూడు తింటూడేవాడివి - కేటీఆర్‌పై బీజేపీ ఎంపీ ఫైర్ !
మేం అలా చేసి ఉంటే చర్లపల్లి జైల్లో చిప్పకూడు తింటూడేవాడివి - కేటీఆర్‌పై బీజేపీ ఎంపీ ఫైర్ !
Mirai Audio Rights: హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
Embed widget