By: Arun Kumar Veera | Updated at : 31 Mar 2024 08:17 AM (IST)
రూ.5 లక్షల పెట్టుబడికి రూ.43,000 వడ్డీ
SBI Amrit Kalash Scheme Details: దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank FD) రన్ చేస్తున్న పథకాల్లో 'అమృత్ కలశ్' ఒకటి. ఇదొక ప్రత్యేక కాల వ్యవధి పథకం. ఈ పథకం మీద స్టేట్ బ్యాంక్ అత్యంత ఆకర్షణీయమైన వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది.
ఈ పథకంలో చేరడానికి ఈ రోజే (ఆదివారం, 31 మార్చి 2023) తుది గడువు. ఆదివారమైనా ఈ రోజు కూడా బ్యాంక్‌లు తెరిచే ఉంటాయి. మీకు పెట్టుబడి ఆలోచన ఉంటే.. నేరుగా బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ మీద అవగాహన ఉంటే, బ్రాంచ్ వరకు వెళ్లక్కర్లేకుండా ఆన్‌లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేస్తుకోవచ్చు. ఇందుకోసం, మీకు SBI ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా మీ ఫోన్‌లో యోనో (SBI YONO) యాప్ ఉంటే చాలు. మీరు ఇంట్లోనే కూర్చుని ఇంటర్నెట్ బ్యాంకింగ్/యోనో ద్వారా ఎస్‌బీఐ అమృత్ కలశ్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.
అమృత్ కలశ్ పథకంపై వడ్డీ రేట్లు
SBI అమృత్ కలశ్ పథకం టెన్యూర్ 400 రోజులు. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లో డబ్బు జమ చేసిన సీనియర్ సిటిజన్లకు ఏటా 7.60 శాతం వడ్డీ రేటు (SBI Amrit Kalash Scheme Interest Rate) అందుతుంది. సాధారణ పౌరులకు ఏడాదికి 7.10 శాతం వడ్డీ రేటును బ్యాంక్ జమ చేస్తుంది.
వడ్డీ రేటుపై ఒక ఉదాహరణను పరిశీలిస్తే... ఎస్‌బీఐ అమృత్ కలశ్‌లో ఒక సీనియర్ సిటిజన్ 5 లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే, 7.60 శాతం వడ్డీ రేటు ప్రకారం 400 రోజులకు రూ. 43,000 వడ్డీ వస్తుంది. రూ. 5 లక్షల డిపాజిట్‌కు 7.60 శాతం వడ్డీ రేటు ప్రకారం, ఒక సాధారణ పౌరుడికి లభించే వడ్డీ మొత్తం 40,085 రూపాయలు.
రూ. 2 కోట్లకు మించకుండా...
రెండు కోట్ల రూపాయల కంటే తక్కువ మొత్తాల్లో ఉండే దేశీయ రిటైల్ టర్మ్ డిపాజిట్లు, NRI రూపాయి టర్మ్ డిపాజిట్లు రెండింటికీ ఈ పథకం వర్తిస్తుంది. అంటే, రూ.2 కోట్ల లోపు మొత్తంతో ఎఫ్‌డీ వేయాలనుకున్న అందరూ దీనికి అర్హులే. కొత్తగా ఎఫ్‌డీ అకౌంట్ ఓపెన్ చేయడంతో పాటు, పాత డిపాజిట్‌ను కూడా రెన్యూవల్ చేసుకోవచ్చు. ఇందులో, టర్మ్ డిపాజిట్ & స్పెషల్ టర్మ్ డిపాజిట్ సౌకర్యం కూడా ఖాతాదార్లకు అందుబాటులో ఉంది.
ఒకవేళ మీకు హఠాత్తుగా డబ్బు అవసరమైనా, 400 రోజుల కంటే ముందే అమృత్ కలశ్ ఖాతాను రద్దు చేసుకోవాలనుకున్నా.. మెచ్యూరిటీ తేదీ కంటే ముందుగానే అకౌంట్‌ను క్లోజ్ చేసే (Amrit Kalash premature withdrawal) సదుపాయం ఉంది. ఈ డిపాజిట్‌ను మీద బ్యాంక్ లోన్ కూడా వస్తుంది.
అమృత్ కలశ్ పథకంపై మీరు తీసుకునే వడ్డీపై ఇన్‌కం టాక్స్ యాక్ట్ (Income Tax Act) రూల్స్ ప్రకారం TDS కట్ అవుతుంది. ఇలా కట్ అయిన మొత్తాన్ని, మీరు ఆదాయ పన్ను పత్రాలు దాఖలు చేసే (ITR Filing) సమయంలో క్లెయిమ్ చేసుకోవచ్చు.
మరో ఆసక్తికర కథనం: పట్టు వదిలిన పసిడి - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
Gold-Silver Prices Today 21 Dec: ఒక్కరోజులో రూ.6,500 పెరిగిన గోల్డ్ - ఏపీ, తెలంగాణలో రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
Gold-Silver Prices Today 20 Dec: మీ నగరంలో చవకగా మారిన గోల్డ్, సిల్వర్ నగలు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Instant Loan Apps: అర్జంట్‌గా డబ్బులు కావాలా?, నిమిషాల్లో రుణం ఇచ్చే ఇన్‌స్టాంట్ లోన్ యాప్స్ ఇవి, కానీ జాగ్రత్త!
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Look Back 2024 - Celebrity Divorce: పెటాకులైన పెళ్లిళ్లు... 2024లో విడాకులు తీసుకున్న సెలబ్రిటీ కపుల్స్ వీళ్లే
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?