Tata Motors Shares: వీక్ మార్కెట్‌లోనూ టాటా మోటార్స్ టాప్ గేర్, హెల్ప్ చేసిన JLR సేల్స్
చిప్ సరఫరా పెరగడంతో JLR కార్ల ఉత్పత్తి, సేల్స్ పెరిగాయి.
Tata Motors Shares: ఇవాళ్టి (మంగళవారం, జనవరి 10, 2023) వీక్ మార్కెట్‌లోనూ టాటా మోటార్స్ & టాటా మోటార్స్ DVR (Differential Voting Right) షేర్లు 6 శాతం పైగా ర్యాలీ చేశాయి, వరుసగా రూ. 415.80 & రూ. 223 స్థాయికి చేరుకున్నాయి.
టాటా మోటార్స్ పూర్తి యాజమాన్యంలో పని చేస్తున్న జాగ్వార్ ల్యాండ్ రోవర్ (Jaguar Land Rover - JLR) డిసెంబర్ త్రైమాసికం సేల్స్ బాగుండడంతో, బలహీనమైన మార్కెట్‌లోనూ టాటా మోటార్స్ దూసుకుపోయింది.
గత కొన్నేళ్లుగా ప్రపంచాన్ని భయపెట్టిన చిప్ కొరత ఇప్పుడు క్రమంగా తగ్గిపోతోంది. చిప్‌ల సరఫరా పెరగడంతో JLR కార్ల ఉత్పత్తి, సేల్స్ పెరిగాయి.
అంచనాలను దాటిన JLR అమ్మకాలు
2022 డిసెంబర్ (Q3FY23) త్రైమాసికంలో JLR హోల్‌సేల్ వాల్యూమ్స్ (చైనా జాయింట్ వెంచర్ చెరీ జాగ్వార్ ల్యాండ్ రోవర్ మినహా) 79,591 యూనిట్లుగా లెక్క తేలాయి. 2022 సెప్టెంబర్ (Q2FY23) త్రైమాసికంతో పోలిస్తే ఇది 5.7 శాతం ఎక్కువ. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంతో పోలిస్తే 15 శాతం (Q3FY22) ఎక్కువ.
ఈ సంఖ్యలు తమ అంచనా 88,101 యూనిట్ల కంటే ముందున్నాయని (2 శాతం QoQ), Q3FY23లో టాటా మోటార్స్ కంపెనీ మెరుగైన పనితీరును నివేదించగలదని ICICI సెక్యూరిటీస్ తెలిపింది.
తన పాసెంజర్ కార్స్ & యూటిలిటీ వెహికల్స్‌కు బలమైన డిమాండ్ కొనసాగుతోందని టాటా మోటార్స్ తెలిపింది. Q3FY23 నాటికి, మొత్తం ఆర్డర్ బుక్ 2,15,000 ఆర్డర్‌లకు పెరిగింది, అంతకుముందు త్రైమాసికం (Q2FY23) కంటే దాదాపు 10,000 ఆర్డర్‌లు పెరిగాయి. న్యూ రేంజ్ రోవర్ (New Range Rover), న్యూ రేంజ్ రోవర్ స్పోర్ట్ (New Range Rover Sport), డిఫెండర్‌కు (Land Rover Defender) డిమాండ్ బలంగా ఉంది. మొత్తం ఆర్డర్ బుక్‌లో 74 శాతం ఆర్డర్లు వీటి కోసమే వచ్చాయి.
గత ఆరు నెలల్లో, S&P BSE సెన్సెక్స్‌లో 11 శాతం ర్యాలీతో పోలిస్తే, టాటా మోటార్స్ మార్కెట్ 6 శాతం పడిపోయి అండర్‌పెర్ఫార్మ్ చేసింది. గత ఒక సంవత్సర కాలంలో, బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లో 0.03 శాతం పెరుగుదలతో పోలిస్తే, ఈ స్టాక్ 18 శాతం పడిపోయింది.
జనవరి 18, 2022న టాటా మోటార్స్ స్టాక్ రూ. 528 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది.
ఇవాళ ఉదయం 11.10 గంటల సమయానికి 6.24 శాతం ర్యాలీతో రూ. 413.80 వద్ద షేర్లు కదులుతున్నాయి.
టెక్నికల్ వ్యూ
బయాస్: నెగెటివ్
టార్గెట్: రూ. 375
రెసిస్టెన్స్ : రూ. 415; ఇది దాటితే రూ. 421
సపోర్ట్: రూ. 398
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.