By: ABP Desam | Updated at : 06 Jan 2023 11:03 AM (IST)
Edited By: Arunmali
ఇకపై కేవైసీ అవసరం లేదు - సెల్ఫ్ డిక్లరేషన్ చాలు
RBI On re-KYC Process: బ్యాంక్ కస్టమర్లు దగ్గరలోని బ్రాంచ్‌లకు వెళ్లి 'KYC' (Know Your Customer) డాక్యుమెంట్లు సమర్పించాలని సంబంధిత బ్యాంకులు అడుగుతూ ఉంటాయి. లేదంటే, ఖాతా లావాదేవీల్లో ఇబ్బందులు వస్తాయని హెచ్చరిస్తుంటాయి. ప్రతి బ్యాంక్ ఖాతాదారుకు ఇది అనుభవమే.
ఈ ప్రహసనం నుంచి అన్ని బ్యాంక్‌ల ఖాతాదార్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India - RBI) ఊరట కల్పించింది. మీకు సంబంధించిన సమాచారంలో ఎటువంటి మార్పు లేకుంటే, రీ-కేవైసీ (re-KYC) ప్రక్రియను పూర్తి చేసే బరువును గణనీయంగా తగ్గించింది. ఖాతాదారు సమాచారంలో ఎలాంటి మార్పు లేని సందర్భాల్లో.. కస్టమర్ తన బ్యాంకుకు స్వీయ ధృవీకరణ (self declaration) ఇస్తే సరిపోతుందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.
స్వీయ ధృవీకరణ ఇవ్వడానికి కూడా మీ సమయాన్ని వెచ్చించి బ్యాంక్ బ్రాంచ్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. బ్యాంక్ ఖాతాతో అనుసంధానమైన ఈ-మెయిల్ ఐడీ (registered email id), రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ (registered mobile number) ద్వారా బ్యాంకుకు సమాచారం అందించవచ్చు. ATMకు వెళ్లినప్పుడు కూడా ఈ పని పూర్తి చేయవచ్చు. లేదా, డిజిటల్ ఛానెల్స్ (ఆన్‌లైన్ బ్యాంకింగ్/ ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్), లేఖ (letter) వంటి వివిధ మార్గాల ద్వారా కూడా వ్యక్తిగత ఖాతాదారులు తమ సెల్ఫ్ డిక్లరేషన్‌ను బ్యాంకులకు అందించవచ్చని రిజర్వ్ బ్యాంక్ సూచించింది. కస్టమర్ తన బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ సౌలభ్యాన్ని కల్పించింది.
ఖాతాదారు నివాస చిరునామాలో మాత్రమే మార్పు ఉన్నట్లయితే, కస్టమర్లు పైన పేర్కొన్న ఏ మార్గం ద్వారా అయినా సవరించిన/ కొత్త చిరునామాను బ్యాంక్‌కు అందించవచ్చు, ఆ తర్వాత రెండు నెలల్లోగా, ఖాతాదారు అందించిన చిరునామా ధృవీకరణను బ్యాంక్ పూర్తి చేస్తుంది.
ఫ్రెష్ KYC ఎప్పుడు అవసరం?
ప్రతి నిర్దిష్ట కాలానికి తమ రికార్డులను తాజాగా (up to date) ఉంచాలని బ్యాంకులకు ఆదేశాలు ఉన్నందున, కొన్ని సందర్భాల్లో తాజా KYC ప్రక్రియ/ డాక్యుమెంటేషన్‌ను బ్యాంకులు చేపట్టాల్సి రావచ్చని RBI స్పష్టం చేసింది. బ్యాంక్ రికార్డుల్లో అందుబాటులో ఉన్న ఖాతాదారు KYC పత్రాలు.. ప్రస్తుత అధికారిక పత్రాల (Officially Valid Documents) జాబితాకు అనుగుణంగా లేకుంటే, లేదా ఇంతకు ముందు సమర్పించిన KYC పత్రం చెల్లుబాటు గడువు ముగిసిపుడు తాజా KYC ప్రక్రియ/ డాక్యుమెంటేషన్‌ను బ్యాంకులు చేపడతాయని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. ఇలాంటి సందర్భాల్లో, బ్యాంకులు కస్టమర్ నుంచి KYC పత్రాలు లేదా సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుని, దానికి ఒక రసీదును అందించవలసి ఉంటుంది.
OVDల జాబితాలో... పాస్‌పోర్ట్ (Passport), డ్రైవింగ్ లైసెన్స్ (Driving License), ఆధార్ (Aadhaar) కార్డ్ లేదా ఆధార్ నంబర్ కలిగి ఉన్నట్లు రుజువు, ఓటరు గుర్తింపు కార్డు, నరేగా (NREGA) జారీ చేసిన జాబ్ కార్డ్, జాతీయ జనాభా రిజిస్టర్ (National Population Register) జారీ చేసిన లేఖ వంటివి ఉన్నాయి.
బ్యాంక్ బ్రాంచ్‌ను సందర్శించడం ద్వారా, లేదా వీడియో ఆధారిత కస్టమర్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ (V-CIP) ద్వారా తాజా KYC ప్రక్రియను బ్యాంకులు నిర్వహించవచ్చని RBI తెలిపింది.
HDFC Q3 Results: హెచ్డీఎఫ్సీ అదుర్స్! 13% పన్నేతర లాభం - నేడు షేర్లు ట్రేడయ్యాయో చూడండి!
Porsche Panamera: రూ.14 లక్షలకే రూ.1.21 కోట్ల పోర్షే - ప్రకటన ఇచ్చిన కంపెనీ - తర్వాత ఏం అయింది?
Stock Market News: సాయంత్రానికి రైజైన స్టాక్ మార్కెట్లు - సెన్సెక్స్ 224 ప్లస్, నిఫ్టీ 5 డౌన్
Titan Q3 Results: మెరుపులు మిస్సింగ్, అంచనాలు అందుకోని టైటన్
Upcoming IPOs: సిద్ధంగా ఉన్నారా?, రెండు కంపెనీలు పబ్లిక్ ఆఫర్స్ ప్రకటించబోతున్నాయ్!
Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!
K.Viswanath: చిరంజీవితో విశ్వనాథ్‌కు ప్రత్యేక అనుబంధం - కళా తపస్విని కన్నతండ్రిలా భావించే మెగాస్టార్!
Anil Kumar On Kotamreddy : దమ్ముంటే రాజీనామా చెయ్, కోటంరెడ్డికి అనిల్ కుమార్ సవాల్
K Viswanath Death: టాలీవుడ్‌ను ఖండాంతరాలకు తీసుకు వెళ్ళారు, తీరని లోటు - విశ్వనాథునికి చిరంజీవి, ఎన్టీఆర్, మమ్ముట్టి నివాళులు