SEBI on Hindenburg Report: హిండెన్ బర్గ్ రిపోర్టుపై ఇన్వెస్టర్లు బీ అలర్ట్, చివరి దశలో అదానీ గ్రూపు దర్యాప్తు: సెబీ
SEBI Investigations Into Adani Group | హిండెన్ బర్గ్ రీసెర్చ్ విడుదల చేసిన నివేదికపై సెబీ స్పందించింది. సంస్థపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని, అదానీ గ్రూపుపై దర్యాప్తు చివరి దశకు వచ్చినట్లు తెలిపింది.
Hindenburg Report News | హైదరాబాద్: అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) ఆగస్ట్ 10, 2024న ప్రచురించిన నివేదికలో తమపై చేసిన ఆరోపణలపై సెబీ ఛైర్ పర్సన్ మాధవిపురి బుచ్ స్పందించారు. ఆ నివేదికలో ఏ వాస్తవం లేది మాధవిపురి బుచ్ దంపతులు స్పందించారు. తమ జీవితం తెరిచిన పుస్తకం అన్నారు. మరోవైపు, ఆ రిపోర్టులో ఆరోపణలు ఎదుర్కొన్న అదానీ గ్రూప్ (Adani Group) సైతం వాటిని తీవ్రంగా ఖండించింది. ఉద్దేశపూర్వకంగానే హెండెన్ బర్గ్ రీసెర్చ్ తమ సంస్థపై మరోసారి నిరాధార ఆరోపణలు చేసిందని అదానీ గ్రూపు స్పష్టం చేసింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తాజా నివేదికపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) స్పందించింది. పెట్టుబడిదారులు ప్రశాంతంగా ఉండాలని, ఆ నివేదికను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఓ ప్రకటన విడుదల చేసింది.
పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలి..
ఆగస్ట్ 10, 2024న హిండెన్‌బర్గ్ రీసెర్చ్ విడుదల చేసిన నివేదికపై పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలని, ఏ అనుమానం అక్కర్లేదని సెబీ పేర్కొంది. ఈ రిపోర్టులో వాస్తవాలు లేవని పేర్కొన్న సెబీ, మరోవైపు అదానీ గ్రూపుపై వచ్చిన ఆరోపణలపై విచారణ దాదాపు పూర్తి కావొచ్చిందని తమ ప్రకటనలో సెబీ తెలిపింది. ‘3 జనవరి 2024 నాటికి SEBI అదానీ గ్రూప్‌పై 24 ఇన్వెస్టిగేషన్స్ చేసి అందులో 22 పూర్తి చేసిందని సుప్రీం కోర్టు గుర్తించింది. SEBI పూర్తి స్థాయి దర్యాప్తును ముమ్మరం చేసినట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. తమ దర్యాప్తులో భాగంగా సెబీ 100 సమన్లు, సుమారు 1,100 లేఖలు, ఇమెయిల్స్ పంపింది. దర్యాప్తులో పలు నియంత్రణ సంస్థలు, ఏజెన్సీల సహకారాన్ని సైతం కోరింది. 300 డాక్యుమెంట్స్ లో దాదాపు 12,000 పేజీల విచారణ పత్రాలు రూపొందించాం.
హిండెన్‌బర్గ్ ఏడాదిన్నర కిందట విడుదల చేసిన నివేదిక ఆధారంగా అదానీ గ్రూపుపై దర్యాప్తు కొనసాగుతోంది. సెక్యూరిటీస్ చట్టాల ప్రకారం వందల కొద్ది డాక్యుమెంట్స్ పరిశీలించాం. సంబంధిత వ్యక్తులు, కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసి దర్యాప్తు కొనసాగించాం. హిండెన్ బర్గ్ సంస్థకు సైతం సెబీ నోటీసులు జారీ చేసింది. అన్ని వైపులా విచారణ చేయడంలో భాగంగా ఈ చర్యలు చేపట్టాం. కానీ జూన్ 27, 2024న హిండెన్ బర్గ్ కు తాము జారీ చేసిన నోటీసుల హేతుబద్ధతను ప్రశ్నించడం సమంజసం కాదు.
హిండెన్‌బర్గ్ వివాదం: నిబంధనల సవరణల్ని సమర్థించుకున్న SEBI
SEBI (REIT) రెగ్యులేషన్స్ 2014కి సంబంధించి చేసిన సవరణలు సరైనవే. ఎవరికో లబ్ది చేకూర్చేందుకు సవరణలు చేయలేదు. ఇన్వెస్టర్లు, ప్రజలతో సంప్రదింపుల అనంతరం సెబీ బోర్డు సవరణలు చేస్తుంది. ఈ ప్రక్రియ పారదర్శకంగా జరిగింది కనుక SEBI వెబ్‌సైట్‌లో వివరాలను ప్రచురించాం’ అని సెబీ తాజా ప్రకటనలో పేర్కొంది.
హిండెన్‌బర్గ్ తమపై చేసిన ఆరోపణలపై సెబీ ఛైర్ పర్సన్ మధాబిపురి బుచ్, ధావల్ బుచ్ స్పందించారు. గౌతం అదానీ సోదరుడు వినోద్ అదానీ నిర్వహిస్తోన్న ఆఫ్ షోర్ బెర్ముడా, మారిషస్ ఫండ్స్ లో సీక్రెట్ పెట్టుబడులు పెట్టారన్న హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించారు. తమ జీవితం తెరిచిన పుస్తకం అని, అదానీ గ్రూపులోగానీ, ఇతర సంస్థల్లో గానీ తమ ఇన్వెస్ట్‌మెంట్స్ ను సెబీలో బాధ్యతలు చేపట్టకముందే సంస్థకు పూర్తి వివరాలు ఇచ్చామన్నారు. అదానీ సోదరుడు వినోద్ అదానీ తమ స్టాక్స్ ధరలు అమాంతం పెంచడానికి ఉపయోగించిన సంస్థలలో తాము ఎలాంటి పెట్టుబడులు పెట్టలేదని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసి, దర్యాప్తు ముమ్మరం చేస్తున్నామని తమపై ఉద్దేశపూర్వకంగానే హిండెన్ బర్గ్ సంచలన ఆరోపణలు చేసినట్లు పేర్కొన్నారు.
Also Read: Hindenburg Research: హిండెన్‌బర్గ్ మరో నివేదిక, సెబీ ఛైర్ పర్సన్ మాధవి బుచ్‌పై సంచలన ఆరోపణలు