Hindenburg Research: హిండెన్‌బర్గ్ మరో నివేదిక, సెబీ ఛైర్ పర్సన్ మాధవి బుచ్‌పై సంచలన ఆరోపణలు
SEBI Chairperson Madhabi Buch | భారత స్టాక్ మార్కెట్లు కుప్పకూలే మరో సంచలన నివేదికను హిండెన్‌బర్గ్ విడుదల చేసింది. సెబీ చైర్ పర్సన్ మాధవిపురి బుచ్ కు అదానీ కంపెనీల్లో వాటాలున్నాయని ఆరోపించింది.
SEBI Chairperson Madhabi Buch had stake in offshore entities used in Adani scandal: అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ ఇదివరకే పలు సంచలన నివేదికలు విడుదల చేసింది. గతేడాది భారతీయ బిలియనీర్ అదానీ గ్రూప్ వ్యాపారాలను టార్గెట్ చేసింది. అదానీ కంపెనీ షేర్లలో అవకతవకలు జరిగాయని నివేదిక అలా వచ్చిందో లేదో, ఇలా కంపెనీ షేర్లు కుప్పకూల్చాయి. అదానీ తన అతిపెద్ద ఓఎఫ్ఎస్ సక్సెల్ ఫుల్ అయినప్పటికీ, ఇన్వెస్టర్లకు డబ్బును వెనక్కి తిరిగి ఇచ్చేశారు. హిండెన్ బర్గ్ తాజాగా మరో సంచలన నివేదిక విడుదల చేసింది. అదానీ గ్రూపులలో సెబీ ఛైర్ పర్సన్ మాధవిపురి బుచ్, ఆమె భర్త ధావల్ బుచ్ వాటాలు కలిగి ఉన్నారని తాజా రిపోర్టులో ఆరోపించింది. "సమ్ థింగ్ బిగ్ థౌన్ ఇండియా" అని ట్వీట్ చేసిన Hindenburg Research అదానీ గ్రూపులకు సంబంధించిన సీక్రెట్ మరొకటి వెల్లడించింది.
Adani money siphoning scandalకు సంబంధించిన సంస్థలలో సెబీ చీఫ్, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని తాజా నివేదికలో హిండెన్ బర్గ్ ఆరోపణలు చేసింది. బెర్ముడా, మారిషస్ ఫండ్స్ లో సీక్రెట్ పెట్టుబడులు ఉన్నాయని హెండెన్ బర్గ్ రిపోర్ట్ రివీల్ చేసింది. హిండెన్ బర్గ్ రిపోర్ట్ ప్రకారం.. ‘ఏ సపోర్ట్ లేకుండా అదానీ గ్రూప్ ఇంత రిస్క్ కోలేదని, అందుకు కారణం సెబీ చైర్ పర్సన్, ఆమె భర్తతో ఉన్న మనీ లింక్స్ కారణమని గుర్తించాం. మాధవిపురి బుచ్, ఆమె భర్త ధవల్ బుచ్ జూన్ 5, 2015న సింగపూర్‌లో ఐపీఈ ప్లస్ ఫండ్ 1తో తొలిసారి తమ ఖాతాను తెరిచారు. IIFLలోని ప్రిన్సిపాల్ సంతకం ప్రకారం.. సెబీ చైర్మన్ దంపతుల నికర విలువ $10 మిలియన్లుగా అంచనా. ఈ ఫండ్ బెర్ముడాలోని గ్లోబల్ డైనమిక్ ఆపర్చునిటీస్ ఫండ్ (GDOF)లోని ఓ స్ట్రక్చర్‌లో భాగం. కాగా, మాధవిపురి బుచ్ దంపతుల వాటా విలువ ఫిబ్రవరి 2018 నాటికి 872,762.25 అమెరికా డాలర్లు’ అని ఆరోపించారు. అయితే అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ నిర్వహిస్తోన్న బెర్ముడా, మారిషస్ ఫండ్స్ లో ఆ వాటాలను సెబీ చైర్మన్ దంపతులు కలిగి ఉన్నారా అనేది కచ్చితంగా గుర్తించలేకపోయాం అని రిపోర్టులో ప్రస్తావించారు.
NEW FROM US:
— Hindenburg Research (@HindenburgRes) August 10, 2024
Whistleblower Documents Reveal SEBI’s Chairperson Had Stake In Obscure Offshore Entities Used In Adani Money Siphoning Scandalhttps://t.co/3ULOLxxhkU
22 మార్చి 2017న సెబీ ఛైర్‌పర్సన్‌గా మాధబి బుచ్ నియామకానికి కొన్ని రోజుల ముందు ఆమె భర్త ఓ అప్పీల్ చేశాడు. మారిషస్ ఫండ్ అడ్మినిస్ట్రేటర్ ట్రైడెంట్ ట్రస్ట్ అకౌంట్స్ నిర్వహిణకు అథారిటీ ఒక్కరికే ఉండాలని అభ్యర్థించారని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపించింది. భార్య పేరిట ఉన్న ఆస్తులను మరో అకౌంట్ కు మార్చే ప్రయత్నం జరిగింది. 26 ఫిబ్రవరి 2018లో మాధవిపురి బుచ్ ప్రైవేట్ ఇమెయిల్ వివరాలు గమనిస్తే.. వినోద్ అదానీ ఉపయోగిస్తున్నారని ఆరోపణలు ఉన్న మారిషస్ రిజిస్టర్డ్ సెల్ కు చెందిన GDOF సెల్ 90 (IPEplus ఫండ్ 1) వివరాలు ఉన్నాయని సంచలన నివేదికలో ఆరోపించారు.
గతంలో హిండెన్ బర్గ్ నివేదిక అనంతరం అదానీ కంపెనీ రూ. 20,000 కోట్ల ఐపీఓ పబ్లిక్ ఆఫర్ రద్దు చేసి, ఇన్వెస్టర్లకు డబ్బు తిరిగిచ్చేసింది. కానీ ఆ నివేదికలో నిజాలు లేవని కంపెనీ ఆ వార్తల్ని ఖండించింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణల్ని ఎలా నమ్మాలని ప్రశ్నలు సైతం లేవనెత్తారు. అయితే సెబీ ఇచ్చిన నివేదికతో అదానీ గ్రూపు ఏ తప్పిదం చేయలేదని సుప్రీంకోర్టు పేర్కొంది.
తమపై ఆరోపణల్ని ఖండించిన సెబీ ఛైర్ పర్సన్
ఆగస్టు 10న హిండెన్‌బర్గ్ విడుదల చేసిన నివేదికలో తమపై చేసిన ఆరోపణలపై సెబీ ఛైర్ పర్సన్ మాధవిపురి బుచ్, ఆమె భర్త ధావల్ బుచ్ స్పందించారు. హిండెన్ బర్గ్ నివేదికలో తమపై చేసిన నిరాధారమైన ఆరోపణలు అని, వాటిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. హిండెన్ బర్గ్ రిపోర్టులో పేర్కొన్న విషయాలలో వాస్తవం లేదని, తమ జీవితం, ఆర్థిక విషయాలు తెరిచిన పుస్తకం లాంటివన్నారు. ప్రైవేట్ పౌరులుగా ఉన్న సమయంలో తమకు సంబంధించిన వివరాలు గత కొన్నేళ్లుగా సెబీకి బహిర్గం చేశామన్నారు. వాటిని ఎవరైనా అధికారులకు బహిర్గతం చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. తమ విషయంలో పారదర్శకత కోసం ఈ ప్రకటన జారీ చేస్తున్నట్లు తెలిపారు. గతంలో హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌పై సెబీ ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలలో భాగంగా వారికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. అందుకు రియాక్షన్ గా క్యారెక్టర్ ను దిగజార్చడానికి ప్రయత్నించడం దురదృష్టకరం అన్నారు.