Ratan Tata Hospitalised: పారిశ్రామికవేత్త రతన్ టాటా తీవ్ర అస్వస్థతకు గురయ్యారా? ఐసీయూలో చికిత్స పొందుతున్నారా?
Ratan Tata Admitted In ICU: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా అస్వస్థతకు గురై ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారనే వార్త అందర్నీ దిగ్బ్రాంతికి గురి చేసింది. అయితే అది ఫేక్ అని తర్వాత తేలింది.
Ratan Tata News: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా అస్వస్థతకు గురయ్యారంటూ వచ్చిన వార్తలను స్వయంగా ఆయనే ఖండించారు. ఈ ఉదయం, రతన్ టాటాను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్చారంటూ ఒక న్యూస్ వైరల్ అయింది. రతన్ టాటాకు రక్తపోటు (Blood Pressure - BP) సంబంధించిన సమస్యలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. ఆయన్ను IUCలో ఉంచి చికిత్స అందిస్తున్నారని కూడా పుకార్లు స్ప్రెడ్ అయ్యాయి. ఈ అబద్ధపు వార్తలు రతన్ టాటా దృష్టికి వెళ్లడంతో, ఆయనే స్వయంగా క్లారిటీ ఇచ్చారు. తాను క్షేమంగా ఉన్నానంటూ ట్వీట్ చేశారు. టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటా వయస్సు 86 సంవత్సరాలు.
సోషల్ మీడియా హ్యాండిల్ 'X'లో, తన ఆరోగ్యంపై రతన్ టాటా అప్‌డేట్ ఇచ్చారు. వయస్సు సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంగా, రెగ్యులర్ చెకప్ కోసం మాత్రమే తాను ఆసుపత్రికి వెళ్లానని ఆయన వివరించారు. తద్వారా, తన అనారోగ్యానికి సంబంధించి స్ప్రెడ్ అయిన వార్తలు తప్పు అని ప్రకటించారు. "నా గురించి ఆలోచించినందుకు ధన్యవాదాలు" అంటూ ఆ ట్వీట్‌ను ప్రారంభించారు రతన్ టాటా.
Thank you for thinking of me 🤍 pic.twitter.com/MICi6zVH99
— Ratan N. Tata (@RNTata2000) October 7, 2024
ఇది కూడా చదవండి: సెలవుల్లో టూర్ వెళుతున్నారా, ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకున్నారా, అది ఎందుకు ముఖ్యమో తెలుసా?
తన ఆరోగ్యంపై వస్తున్న వార్తల గురించి తనకు పూర్తిగా తెలియదని, అయితే, ఆ వార్తలు తప్పని అందరికీ చెప్పడానికే ఇప్పుడు స్పందిస్తున్నట్లు 'X' పోస్ట్‌లో రతన్ టాటా రాశారు.
ఈ ఉదయం వైరల్‌గా మారిన వార్తల్లో... రతన్ టాటా బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి వెళ్లడం వరకు మాత్రమే నిజం. ఆయన సాధారణ వైద్య పరీక్షల కోసమే ఆసుపత్రికి వెళ్లారు. వయస్సు సంబంధిత సమస్యల వల్ల, రెగ్యులర్ చెకప్ కోసమే టాటా సన్స్ ఛైర్మన్ ఆసుపత్రికి వెళ్లారు. ఆయనకు BP సమస్యగా మారడం, ఐసీయూలో చేర్చడం అబద్ధమని రతన్ టాటా ట్వీట్‌తో స్పష్టమైంది.
ఇది కూడా చదవండి: ఉపయోగించని క్రెడిట్ కార్డును క్లోజ్ చేయాలా, కంటిన్యూ చేయాలా - ఏది మంచిది?
తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన పని లేదని కూడా రతన్ టాటా భరోసా ఇచ్చారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయొద్దని, అలాంటి పుకార్లకు దూరంగా ఉండాలని ఆయన మీడియాను కోరారు. వ్యాపారం నుంచి రిటైర్ కాకముందు చాలా చురుగ్గా పని చేసిన రతన్ టాటా, ఇప్పుడు 86 సంవత్సరాల ముదిమి వయస్సులో ఉన్నారు. తన వయస్సుతో పాటు కొన్ని ఆరోగ్యాల కారణంగా, రతన్ టాటా ఇప్పుడు చాలా అరుదుగా మాత్రమే బహిరంగ ప్రదేశాల్లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా వ్యక్తిగత జీవితాన్ని గడుపుతున్నారు.