అన్వేషించండి

Reliance 49th AGM Highlights: రిలయన్స్ ఇంటెలిజెన్స్ తో ఏఐ విప్లవం.. ప్రతి ఒక్కరికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ - ముఖేష్ అంబానీ సంచలన ప్రకటన

Mukesh Ambani On Reliance Intelligence: రిలయన్స్ 49వ ఏజీఎంలో ముఖేష్ అంబానీ సంచలన ప్రకటన. 'రిలయన్స్ ఇంటెలిజెన్స్' ద్వారా దేశంలో ఏఐ విప్లవం. గూగుల్, మెటా, ఎన్విడియాలతో భాగస్వామ్యం.

AI To Everyone Everywhere Jio: ప్రముఖ వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్  49వ వార్షిక సర్వసభ్య సమావేశం ఆన్‌లైన్‌ వేదికగా అత్యంత ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సంస్థ సరికొత్త వ్యూహాత్మక అడుగులు, భవిష్యత్తు ప్రణాళికలను ప్రకటించారు. ముఖ్యంగా టెక్నాలజీ ప్రపంచాన్ని శాసిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాన్ని భారతీయులందరికీ చేరువ చేయడమే లక్ష్యంగా రిలయన్స్ సరికొత్త విప్లవానికి తెరలేపింది.
   
కేవలం వినియోగదారులుగా కాదు.. సృష్టికర్తలుగా మారుదాం 

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ ఏజీఎం ప్రసంగంలో భారతదేశ ఏఐ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు.  భారతదేశం కేవలం ఇతర దేశాలు సృష్టించిన ఏఐ సాంకేతికతను వాడుకునే సాధారణ వినియోగదారుడిగా మాత్రమే ఉండిపోకూడదని నేను బలంగా నమ్ముతున్నాను. భారత్ ఏఐ సృష్టికర్తగా, దానిని అందిపుచ్చుకునే అగ్రగామిగా, ప్రపంచానికే నాయకుడిగా ఎదగాలి  అని ఆయన ఆకాంక్షించారు. అందుకోసమే గత ఏడాది రిలయన్స్ గ్రూప్ యొక్క సరికొత్త గ్రోత్ ఇంజిన్‌గా  రిలయన్స్ ఇంటెలిజెన్స్ ను ప్రకటించినట్లు ఆయన గుర్తుచేశారు.

 గూగుల్, మెటా, ఎన్విడియాలతో గ్లోబల్ పార్ట్‌నర్‌షిప్ 

ప్రపంచస్థాయిలో అత్యంత లాభదాయకమైన, పటిష్టమైన ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ప్లాట్‌ఫారమ్ , సర్వీసెస్ వ్యాపారాన్ని నిర్మించడమే రిలయన్స్ ఇంటెలిజెన్స్  ముఖ్య ఉద్దేశమని ముఖేష్ అంబానీ స్పష్టం చేశారు. సాధారణ వినియోగదారులు, బడా కార్పొరేట్ సంస్థలు,   ప్రభుత్వాలకు సైతం భారీ స్థాయిలో ఏఐ సేవలను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. దీని కోసం ఇప్పటికే ఒక స్పష్టమైన విజన్‌తో గూగుల్ , మెటా  ,  ఎన్విడియా వంటి ప్రపంచ టెక్ దిగ్గజాలతో రిలయన్స్ అత్యంత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుని, పునాదులను బలంగా వేసిందని వివరించారు.

 రిలయన్స్ ఇంటెలిజెన్స్  తదుపరి దశ – ఎగ్జిక్యూషన్ ప్లాన్ 

ఇప్పటివరకు ప్రణాళికల దశలో ఉన్న ఏఐ ప్రాజెక్టులు ఇప్పుడు తదుపరి దశ అయిన  ఎగ్జిక్యూషన్ లోకి అడుగుపెడుతున్నాయని అంబానీ ప్రకటించారు. ఈ ఏఐ విప్లవానికి సంబంధించిన పూర్తి సాంకేతిక వివరాలను, క్షేత్రస్థాయి కార్యాచరణను జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాష్ అంబానీ త్వరలోనే సవివరంగా వెల్లడిస్తారని పేర్కొన్నారు. ఒక దశాబ్దం క్రితం జియో ఏ విధంగానైతే సరికొత్త టెలికాం విప్లవాన్ని తెచ్చిందో, అదే తరహా విప్లవాన్ని ఇప్పుడు ఏఐ రంగంలోనూ పునరావృతం చేయబోతున్నట్లు బిజినెస్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 

 దశాబ్దం క్రితం బ్రాడ్‌బ్యాండ్.. నేడు ఏఐ ప్రామిస్ 

గతాన్ని గుర్తుచేసుకుంటూ ముఖేష్ అంబానీ ఒక ఆసక్తికరమైన పోలికను తెరపైకి తెచ్చారు. ఒక దశాబ్దం క్రితం, జియో ద్వారా  ప్రతి ఒక్కరికీ, ప్రతి చోటా బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ అందిస్తామని మేము దేశానికి మాటిచ్చాం, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం. ఈ రోజు, రిలయన్స్ ఇంటెలిజెన్స్ ద్వారా  ప్రతి ఒక్కరికీ, ప్రతి చోటా ఏఐ ని అందిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం, ఈ వాగ్దానాన్ని కూడా మేము ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాం అని ముఖేష్ అంబానీ ధీమా వ్యక్తం చేశారు.

 మార్కెట్‌లో రిలయన్స్ ఏఐ సంచలనాలు 

వ్యాపార ,  టెక్ విశ్లేషకుల ప్రకారం, రిలయన్స్ ఏఐ రంగంలోకి పూర్తిస్థాయిలో అడుగుపెట్టడం వల్ల రాబోయే రోజుల్లో డేటా సెంటర్లు, క్లౌడ్ కంప్యూటింగ్,  ఏఐ ఆధారిత అప్లికేషన్ల ధరలు సామాన్యుడికి అందుబాటులోకి రానున్నాయి. భారతీయ భాషలకు అనుకూలమైన లోకల్ ఏఐ మోడల్స్‌ను అభివృద్ధి చేయడం ద్వారా దేశీయ స్టార్టప్‌లకు, చిన్న వ్యాపారాలకు రిలయన్స్ పెద్ద పీట వేయనుంది. టెలికాం రంగంలో జియో సృష్టించిన ప్రభంజనం లాగే,  రిలయన్స్ ఇంటెలిజెన్స్  కూడా అంతర్జాతీయ ఏఐ మార్కెట్‌లో సరికొత్త మైలురాళ్లను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
PMFME Scheme: ఫుడ్ బిజినెస్ చేసేవారికి గుడ్ న్యూస్.. రూ. 10 లక్షల రుణంపై 35% సబ్సిడీ.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
ఫుడ్ బిజినెస్ చేసేవారికి రూ. 10 లక్షల రుణంపై 35% సబ్సిడీ.. ఎలా అప్లై చేసుకోవాలంటే
Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Air India New CEO: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Embed widget