అన్వేషించండి

RBI Repo Rate: వడ్డీ రేట్లు యథాతథం.. పండుగ సమయంలో దేశ ప్రజలను నిరాశపరిచిన ఆర్బీఐ

RBI MPC Meeting | ద్రవ్య విధాన కమిటీ ఈసారి ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోలేదు. కీలకమైన రెపో రెట్లు యథాతథంగా ఉంచాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు.

RBI Governor Sanjay Malhotra | ముంబై: దసరా, దీపావళి పండుగల సమయంలో వడ్డీ రేట్లు తగ్గించి ఆర్బీఐ శుభవార్త చెబుతుందని ఆశించిన దేశ ప్రజలకు నిరాశే ఎదురైంది. కీలక రెపో రేట్లను యథాతథంగా ఉంచాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం ఉదయం మాట్లాడుతూ.. భారతీయ రిజర్వ్ బ్యాంకు (RBI) కీలక రెపో రేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించిందని వెల్లడించారు. ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ (MPC) నిర్ణయాన్ని బుధవారం ఉదయం వెల్లడించారు. ప్యానెల్ ఏకగ్రీవంగా కీలక రేట్లను మార్చకుండా ఉంచాలని నిర్ణయించిందని గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు.

రెపో రేటు 5.5 శాతంగా కొనసాగింపు

ఈ ఎంపీసీ ప్యానెల్ రెపో రెట్లను యథాతథంగా కొనసాగించింది. ప్రస్తుతం, రెపో రేటు 5.5 శాతం వద్ద ఉందని ఆయన తెలిపారు. ముఖ్యంగా, RBI  సోమవారం నాడు మూడు రోజుల సమీక్షను ప్రారంభించింది. మార్కెట్లు బెంచ్ మార్క్ లోన్ రేట్లపై ఆర్బీఐ నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూశాయి. రెపో రేటు ఇప్పుడు 5.50 శాతం వద్ద ఉండగా, అందులో ఏ మార్పు చేయలేదు. వరుసగా రెండో సమీక్షలో వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (SDF) రేటు 5.25 శాతంగా ఉంది. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF) రేటు, బ్యాంక్ రేటు 5.75 శాతం వద్ద ఉన్నాయి.

ఆర్థిక వ్యవస్థ ఊపందుకునేలా ఫిబ్రవరి 2025 నుంచి RBI ఇప్పటికే 100 బేసిస్ పాయింట్లు రేటు తగ్గించింది. ఆగస్టు పాలసీ సమావేశంలో, MPC గతంలో చేసిన కోతల తర్వాత వడ్డీ రేట్లను మార్చలేదు. పండుగల సీజన్లో వడ్డీ రేట్లు తగ్గిస్తుందని దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసినా నిరాశ తప్పలేదు. జీఎస్టీ తగ్గింపుతో పాటు వడ్డీ రేట్లు దిగొస్తే ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతమిస్తుందని మార్కెట్లు సైతం భావించాయి.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
FMCG Price Hike: ధరలు పెంచడానికి రెడీ అవుతున్న ఎఫ్‌ఎంసిజి బ్రాండ్లు! మీ ఇంటి బడ్జెట్‌పై ఎఫెక్ట్‌! 
ధరలు పెంచడానికి రెడీ అవుతున్న ఎఫ్‌ఎంసిజి బ్రాండ్లు! మీ ఇంటి బడ్జెట్‌పై ఎఫెక్ట్‌! 
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Embed widget