News
News
వీడియోలు ఆటలు
X

PSBs: ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు అదరహో, తొలిసారి అలాంటి అద్భుతం

2017-18లో రూ. 85,390 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసిన PSBలు, క్రమంగా పుంజుకుని 2022-23లో రూ.1,04,649 కోట్ల లాభానికి చేరుకున్నాయి.

FOLLOW US: 
Share:

Public Sector Banks Profit: గత ముగిసిన ఆర్థిక సంవత్సరంలో (2022-23 లేదా FY23) ప్రభుత్వ రంగ బ్యాంకులు అద్భుతం చేశాయి. మన దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం (cumulative profit) లక్ష కోట్ల రూపాయల మార్కును అధిగమించింది. ఈ ఫీట్‌ సాధించడం ఇదే తొలిసారి. 

ఏడాదిలో 57 శాతం పెరిగిన లాభాలు
మన దేశంలో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు (PSBs) ఉన్నాయి. 2017-18లో రూ. 85,390 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసిన PSBలు, క్రమంగా పుంజుకుని 2022-23లో రూ.1,04,649 కోట్ల లాభానికి చేరుకున్నాయి. 2021-22లో ఆర్జించిన సంచిత లాభం రూ. 66,539.98 కోట్ల లాభంతో పోలిస్తే, 2022-23లో ఏకంగా 57 శాతం పెరిగింది.

లక్ష కోట్ల రూపాయల లాభం ఘనతలో సగం వాటా మార్కెట్ లీడర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది (SBI). ఆ ఆర్థిక సంవత్సరంలో, SBI, రూ. 50,232 కోట్ల వార్షిక లాభాన్ని నివేదించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం కంటే 59 శాతం వృద్ధిని సాధించింది.

శాతం పరంగా చూస్తే, నికర లాభంలో 126% వృద్ధితో రూ. 2,602 కోట్లను సాధించిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (BoM) తొలిస్థానంలో ఉంది. 100% పెరుగుదలతో రూ. 1,862 కోట్ల లాభానికి చేసిన యూకో (UCO) బ్యాంక్‌ రెండో స్థానంలో, 94% వృద్ధితో రూ. 14,110 కోట్ల లాభం సాధించిన బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) మూడో స్థానంలో ఉన్నాయి.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) మినహా, మిగిలిన PSBలన్నీ ఆకర్షణీయమైన లాభాన్ని ఆర్జించాయి. దిల్లీ ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న PNB వార్షిక నికర లాభం 2021-22లో రూ. 3,457 కోట్లుగా ఉండగా, 2022-23లో 27% శాతం క్షీణించి రూ. 2,507 కోట్లకు పరిమితమైంది.

రూ.10,000 కోట్ల లాభం దాటిన బ్యాంక్‌లు
SBI కాకుండా, రూ.10,000 కోట్ల కంటే ఎక్కువ వార్షిక లాభాన్ని నివేదించిన ఇతర PSBలు.. బ్యాంక్ ఆఫ్ బరోడా (రూ. 14,110 కోట్లు), కెనరా బ్యాంక్ (రూ. 10,604 కోట్లు).

పంజాబ్ అండ్‌ సింధ్ బ్యాంక్ వార్షిక లాభం 26 శాతం (రూ. 1,313 కోట్లు), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 51 శాతం (రూ. 1,582 కోట్లు), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 23 శాతం (రూ. 2,099 కోట్లు), బ్యాంక్ ఆఫ్ ఇండియా 18 శాతం (రూ. 4,023 కోట్లు), ఇండియన్ బ్యాంక్ 34 శాతం (రూ. 5,282 కోట్లు), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 61 శాతం (రూ. 8,433 కోట్లు) లాభాలను సాధించాయి.

2023 మార్చి త్రైమాసికం/2022-23 నాలుగో త్రైమాసికంలో, 12 PSBల సంచిత లాభం 95% పైగా పెరిగి రూ. 34,483 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది రూ. 17,666 కోట్లుగా ఉంది.

అధిక వడ్డీ ఆదాయం, నిరర్థక ఆస్తుల నిర్వహణలో మెరుగుదల, మొండి బకాయిలు తగ్గడం, పీఎస్‌బీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి మూలధనం, RBI చేపట్టిన సంస్కరణలే ఈ స్థాయి లాభాలకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: ICICI బ్యాంక్‌ వడ్డీ రేట్లు మారాయ్‌, మీ FDపై ఎంత ఆదాయం వస్తుందో తెలుసుకోండి

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 22 May 2023 11:16 AM (IST) Tags: Profit public sector banks FY23 PSBs 1 lakh crores

సంబంధిత కథనాలు

Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్లకు యూఎస్‌ డెట్‌ సీలింగ్‌ ఊపు - బిట్‌కాయిన్‌ రూ.70వేలు జంప్‌!

Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్లకు యూఎస్‌ డెట్‌ సీలింగ్‌ ఊపు - బిట్‌కాయిన్‌ రూ.70వేలు జంప్‌!

Latest Gold-Silver Price Today 29 May 2023: మళ్లీ పడిన పసిడి - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Latest Gold-Silver Price Today 29 May 2023: మళ్లీ పడిన పసిడి - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Petrol-Diesel Price 29 May 2023: తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - కొత్త రేట్లివి

Petrol-Diesel Price 29 May 2023: తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - కొత్త రేట్లివి

NSC: మీకు ₹72 లక్షలు కావాలా? ఈ పోస్టాఫీస్‌ పథకం ఇస్తుంది!

NSC: మీకు ₹72 లక్షలు కావాలా? ఈ పోస్టాఫీస్‌ పథకం ఇస్తుంది!

Stock Market News: ఆల్‌టైమ్‌ హై వైపు పరుగులు - ఇంట్రాడేలో 63,026 టచ్‌ చేసిన సెన్సెక్స్‌!

Stock Market News: ఆల్‌టైమ్‌ హై వైపు పరుగులు - ఇంట్రాడేలో 63,026 టచ్‌ చేసిన సెన్సెక్స్‌!

టాప్ స్టోరీస్

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

Wrestlers Protest: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవమిదేనా: మంత్రి కేటీఆర్

Wrestlers Protest: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవమిదేనా: మంత్రి కేటీఆర్

‘బిచ్చగాడు’ పెద్ద మనసు - క్యాన్సర్ రోగులకు విజయ్ ఆంటోని గుడ్ న్యూస్

‘బిచ్చగాడు’ పెద్ద మనసు - క్యాన్సర్ రోగులకు విజయ్ ఆంటోని గుడ్ న్యూస్

Top 5 Headlines Today: ఉచితాలతో ఎన్నికల శంఖారావం పూరించిన చంద్రబాబు! ఇటు కాంగ్రెస్ తో పొత్తులు ఫైనల్ అవుతున్నాయా ?

Top 5 Headlines Today: ఉచితాలతో ఎన్నికల శంఖారావం పూరించిన చంద్రబాబు! ఇటు కాంగ్రెస్ తో పొత్తులు ఫైనల్ అవుతున్నాయా ?